Begin typing your search above and press return to search.

బాబు...పవన్ లకు ధీటుగా జగన్ ప్లాన్ బీ ...?

By:  Tupaki Desk   |   11 Jan 2023 3:51 AM GMT
బాబు...పవన్ లకు ధీటుగా జగన్ ప్లాన్ బీ ...?
X
ఏపీలో రాజకీయం క్లారిటీకి వస్తోంది. తెలుగుదేశం జనసేన పొత్తులు పెట్టుకోవడం ఖాయమని తేలిపోయిన నేపధ్యంలో ఈ పొత్తుని తట్టుకుని గెలిచేందుకు జగన్ ఏమి చేస్తారు అన్నదే సొంత పార్టీలోనూ బయటా చర్చగా ఉంది. ఏపీలో కాపులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దాంతో కాపు ఓట్లతో పాటు తెలుగుదేశం ఓటింగ్ కూడా కలిస్తే తిరుగు ఉండదని లెక్కలేసుకుంటున్నారు.

అయితే దీనికి వైసీపీ పై ఎత్తు వేస్తోంది అని అంటున్నారు. ఏపీలో బీసీలు యాభై శాతానికి పైగా ఉన్నారు. దాంతో బీసీలకు ఈసారి జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. బీసీలు కనుక తమ వైపు ఉంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పొత్తును చిత్తు చేయవచ్చు అని ఆయన ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

ఏపీలో దాదాపుగా ఎనభై నుంచి వంద నియోజకవర్గాలలో బీసీలు డామినేటింగ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఏపీలఒ 175 సీట్లు ఉంటే వారికి తగిన దామాషా పద్ధతిలో టికెట్లు రావడం లేదు అన్న ఆందోళన ఎప్పటి నుంచో ఉంది. దాంతో జగన్ కూడా కొత్త ప్లాన్ లో ఉన్నారని తెలుస్తోంది. బీసీలకు అత్యధి శాతం ఈసారి టికెట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.

గతంలో రాయలసీమ జిల్లాలో రెడ్లకు ఎక్కువ సీట్లు ఇవ్వడం జరిగింది. ఈసారి మాత్రం బీసీలకు పెద్ద పీట వేస్తారని అంటున్నరు.ఇక ఉత్తరాంధ్రా జిల్లాలు బీసీ ఖిల్లాగా పేరు గడించాయి. ఇక్కడ తొంబై శాతం టికెట్లు వారికే కట్టబెడతారు అని తెలుస్తోంది. మరో వైపు చూసే ఏపీలో రాజకీయ మార్పునకు కేంద్ర బిందువుగా మారుతుంది అనుకుంటున్న గోదావారి జిల్లాలలో కూడా గెలిచేందుకు వైసీపీ వ్యూహాన్ని రూపొందిస్తోంది అని తెలుస్తోంది.

ఇక్కడ కాపులకు ఢీ కొట్టేందుకు బీసీలనే ఎక్కువ మందిని తమ పార్టీ నుంచి అభ్యర్ధులుగా నిలబెడతారు అని అంటున్నారు. గోదావరి జిల్లాలలో కాపులతో పాటు బీసీలు ఎస్సీలు ఎక్కువ. దాంతో ఆయా నియోజకవర్గాల సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని వారిని ఎంపిక చేయడం ద్వారా కాచుకోవాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.

ఇక కోస్తా జిల్లాలలో సైతం ఇదే ఫార్ములాను అనుసరించాలని అనుకునంటున్నారు. ఎస్సీస్, మైనారిటీలకు అక్కడ పెద్ద పీట వేయడం ద్వారా ఈసారి సోషల్ ఇంజనీరింగ్ కి కొత్త పుంతలు తొక్కించాలన్నది జగన్ మార్క్ ప్లాన్ గా చెబుతున్నారు. ఇక చూస్తే 2019 ఎన్నికల్లో జగన్ ఎక్కువగా రెడ్లకు అగ్ర కులాలకు టికెట్లు ఇచ్చారు. వైసీపీ తరఫున గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలలో 50 మంది ఎమ్మెల్యేల దాకా రెడ్లు ఉన్నారు. అలాగే ఇతర అగ్ర కులాలు కూడా బాగానే ఉన్నారు.

ఇపుడు అదంతా మారిపోతుంది అని అంటున్నారు. మొత్తం 175 సీట్లలో సగానికి పైగా సీట్లు బీసీలకు కేటాయించడం, మిగిలిన వాటిలో ఎస్సీస్, మైనారిటీలు, ఎస్టీలకు సీట్లు ఇవ్వడం ద్వారా ఎనభై శాతానికి పైగా బడుగు బలహీన వర్గాలకే ప్రాధాన్యత ఇవ్వడానికి జగన్ మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అంటే ఒక విధంగా ఈసారి చాలా మంది సీనియర్లు, దిగ్గజ నేతలు కనిపించే చాన్స్ ఉండదని అంటున్నారు. వారిని పక్కన పెట్టడం ఖాయమనే అంటున్నారు.

ఇక గోదావరి జిల్లాలలో గెలుస్తారు అన్న నమ్మకం ఉన్న కాపులకే టికెట్లు దక్కుతాయని తెలుస్తోంది. ఒక వేళ డౌట్ ఉంటే ఆ ప్లేస్ లో బీసీలనే బరిలోకి దించుతారు అని అంటున్నారు. బీసీ మంత్రంతో ఈ కొత్త పొత్తును ఎత్తుని ఢీ కొట్టాలని జగన్ చూస్తున్నారు. మరి ఇది ఎంతవరకూ ఫలిస్తుందో చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.