Begin typing your search above and press return to search.

ఏపీలో.. ఎన్నికల యాక్షన్ అపుడే మొదలెట్టేశారా?

By:  Tupaki Desk   |   26 April 2022 1:30 AM GMT
ఏపీలో.. ఎన్నికల యాక్షన్ అపుడే మొదలెట్టేశారా?
X
ఈ ఫొటో చూశారుగా! కొత్త‌గా ఏర్ప‌డిన జ‌గ‌న్ 2.0 కేబినెట్‌లో మ‌రోసారి మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన రామ‌చంద్ర‌పురం ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ. మ‌రి మంత్రికి వేరే పనులు లేవా.. దోశ‌లువేస్తున్నారు? అనే సందేహాలు స‌హ‌జం. దీనిపై నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర కామెంట్లు కూడా చేస్తున్నారు.. ''మంత్రిగారికి ఇంకే ప‌నిలేన‌ట్టుందే!'' అని కొంద‌రు వ్యాఖ్యానించారు. మ‌రికొంద‌రు.. ఎన్నిక‌ల యాక్ష‌న్ అప్పుడే ప్రారంభించారా? లేక‌.. ఎన్నిక‌ల‌కు ముందుగానే ప్రాక్టీస్ చేస్తున్నారా? అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు.

మ‌రికొంద‌రు మాత్రం... 'ముందే ప్రాక్టీస్ చేసుకుంటున్నారు'' అని ఒకింత హీట్ కామెంట్లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలానూ ఆయ‌న ఓడిపోతార‌ని.. త‌ర్వాత ఎలాగూ.. హొట‌ల్ పెట్టుకునే ప్లాన్‌లో ఉన్నారేమో.. అందుకే ఇలా ముందుగానే.. ప్రాక్టీస్ చేస్తున్నారు.. అని కామెంట్లు చేశారు. ఇక‌, మంత్రిగా రి అనుచ‌రుల విష‌యానికి వ‌స్తే.. స‌మాచార‌, ప్ర‌సారాల శాఖ మంత్రిగా బాగానే ఎంజాయ్ చేస్తున్నార‌ని.. అంటున్నారు.

సీఎం జ‌గ‌న్ ఇలాంటివారిని ఎందుకు ప‌క్క‌న పెట్ట‌రు? అని ఒక‌రు కామెంట్ చేశారు. ఇక‌, స‌మాజం ప‌ట్ల బాధ్య‌త లేదా? అని ఒక‌రిద్ద‌రు వ్యాఖ్యానించారు. ''ఇటు తూర్పుగోదావ‌రిలో చాలా ప‌నులు మిగిలిపోయా యి. రోడ్లు బాగోలేదు.

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై.. ఆయ‌న ప్ర‌జ‌ల నుంచి స‌మాచారం తీసుకోవ‌చ్చు. ప్ర‌జ‌ల్లోకి రావొచ్చు. కానీ, ఇలా దోశ‌లు పోయ‌డంఏంటి సార్‌.. ఇప్పుడేమైనా ఎన్నిక‌లు ఉన్నాయా?'' అని మ‌ధ్య వ్య‌క్తులు.. ప్ర‌శ్నిస్తున్నారు.

ఇలా.. మంత్రి చెల్లుబోయిన‌.. చేసిన ప‌నిని నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో వ్యాఖ్యానించారు. స‌మాచార శాఖ మంత్రిగా ఉన్న చెల్లుబోయిన‌..తాజాగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. సాదాసీదాగా.. రోడ్డు వెంట న‌డుస్తూ.. ఓ 5 నుంచి 6 కిలో మీట‌ర్ల మేర‌.. ప‌ర్య‌టించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న రోడ్డు ప‌క్క‌న ఉండే... బ‌డ్డీ కొట్ల ద‌గ్గ‌ర కాల‌క్షేపం చేశారు. చాయ్ తాగి ఎంజాయ్ చేశారు. ఇలా ఓ హోట‌ల్‌కు వెళ్లి దోశ పిండి క‌లిపి ఓ నాలుగు దోశ‌లు పోశారు. మ‌రి ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందుగానే ప్ర‌జ‌ల‌ను కాకా ప‌ట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా? లేక ముంద‌స్తు ఎన్నిక‌లు ఉన్నాయ‌నేసంకేతాల నేప‌థ్యంలో ఇలా ప్రాక్టీస్ చే్స్తున్నారా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.