Begin typing your search above and press return to search.

రాజ్ కుంద్రా ఇలా దొరికేశారు!

By:  Tupaki Desk   |   21 July 2021 12:30 PM GMT
రాజ్ కుంద్రా ఇలా దొరికేశారు!
X
అశ్లీల వీడియోలు తీసి యాప్స్ లో అప్ లోడ్ చేస్తున్నారన్న కారణంతో ముంబై పోలీసులు ప్రముఖ వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రాను కోర్టులో హాజరుపరచగా అతడి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని జూలై 23 వరకు కోర్టు పోలీసు కస్టడీకి పంపింది. 45 ఏళ్ల కుంద్రాపై నమోదైన కేసు అశ్లీల వీడియోలు తీయడం.. కొన్ని యాప్‌ల ద్వారా పోస్ట్ చేసినందుకు అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

రాజ్ కుంద్రాతోపాటు ముంబై పోలీసులు అతడి భాగస్వామి ర్యాన్ థార్ప్ ను కూడా అరెస్ట్ చేశారు. అయితే తనను మెంటల్ టార్చర్ కు గురిచేశారని ఒక నటి ఫిర్యాదుతోనే రాజ్ కుంద్రా డొంకంతా కదిలిందని ముంబై సర్కిల్స్ మీడియాలో చర్చ సాగుతోంది.

ఈ కేసులో రాజ్ కుంద్రా కంటే ముందు నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ నిందితుల వాంగ్మూలం, సాంకేతిక కారణాల ఆధారంగా రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రాజ్ కుంద్రా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

కెన్నిన్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన 'హాట్ షాట్స్ డిజిటల్ ఎంటర్ టైన్ మెంట్' అనే మొబైల్ యాప్ ను రాజ్ కుంద్రాతో కలిసి బక్షి సంయుక్తంగా నిర్వహిస్తున్నారని ముంబై జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైమ్) మిలింద్ భరంబే తెలిపారు.హాట్ షాట్ ల యాప్ ను ప్రపంచంలోని 18 సంవత్సరాలు నిండిన ఎవరైనా డౌన్ లోడ్ చేసుకొని వాడేలా రూపొందించారు. ఇందులో ప్రపంచంలోనే ప్రత్యేకమైన హాటెస్ట్ మోడల్స్, షార్ట్ ఫిల్మ్ లు, హాట్ వీడియోలను ప్రదర్శిస్తారు. ఇది ఒక సాఫ్ట్ అశ్లీల యాప్ గా రూపొందించినట్టు తెలుస్తోంది. ఇక ఈ యాప్ నుంచి ఉచితంగా అశ్లీల కంటెంట్ ను డౌన్ లో చేసుకునేలా రూపొందించారు.

ముంబై చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా మారాలని వచ్చే అమాయక, నిరుపేద బాలికలను ఈ పనిలో ఇరికించినట్లు పోలీసులు తెలిపారు. పెద్ద సినిమాల్లో పనిచేయిస్తామనే నెపంతో బాలికలను బలవంతంగా ఈ అశ్లీల సినిమాల్లో చేయించేవారని తెలిసింది. అలా బూతు సినిమాలను మొబైల్ యాప్, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేసి లక్షలు సంపాదించేవారని తెలిసింది.

ముంబైలోని మలాద్ వెస్ట్ లోని మాధ్ గ్రామంలో అశ్లీల చిత్రాలను చిత్రీకరించిన బంగ్లా అద్దెకు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఏపీఐ లక్ష్మీకాంత్ సులుఖే ఆ బంగ్లాపై దాడి చేసినప్పుడు అశ్లీల చిత్రం షూటింగ్ జరుగుతోంది.

రాజ్ కుంద్రా సారథ్యంలోనే హాట్ షాట్ యాప్ ద్వారా ఈ రాకెట్ నిర్వహిస్తున్నట్లు నటి సాగరిక వాదించారు. తాను అశ్లీల వ్యాపారానికి బాధితురాలిని అని.. అందులో ప్రవేశించినప్పుడు తాను బాధలో ఉన్నానని హైకోర్టులో సాగరిక పిల్ దాఖలు చేసింది. మానసికంగా హింసించారని.. ఆన్ లైన్ లో చాలా మంది వ్యక్తులు వేధించారని ఆమె ఆరోపించింది.

ఇక జార్ఖండ్ బాలిక ముంబై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తాను అశ్లీల వీడియోలో నటించకుంటే 10 లక్షల పరిహారం చెల్లించాలని.. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రాసుకొచ్చారని పేర్కొంది. ఇలా రాజ్ కుంద్రా కేసులో కీలకమైన ఫిర్యాదుల తర్వాతే పోలీసులు చర్యలు చేపట్టారు.