రాజ్ కుంద్రా ‘నగ్న’ ట్వీట్లు వైరల్

Tue Jul 20 2021 15:01:04 GMT+0530 (IST)

Raj Kundra 'nude' tweets go viral

బాలీవుడ్ లో కలకలం చెలరేగింది. ప్రముఖ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్  కుంద్రాను ముంబై సైబర్ క్రైం పోలీసులు పోర్న్ వీడియోలు తీస్తున్నారని అరెస్ట్ చేయడం సంచలనమైంది. రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత అనూహ్యంగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.రాజ్ కుంద్రా తీరు ‘పోర్నో గ్రఫీ’ని ప్రోత్సహించేలానే ఉందని ఆయన ట్వీట్లు చూస్తే అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రాజ్ కుంద్రా అరెస్ట్ తో ఆయన గతంలో చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. గతంలో ‘పోర్న్ వర్సెస్ ప్రాస్టిట్యూషన్’ అనే అంశంపై రాజ్ కుంద్రా చేసిన ట్వీట్లు వైరల్ గా మారాయి. 2012లో ఆయన చేసిన ట్వీట్లను నెటిజన్లు రీట్వీట్ చేస్తూ ట్రల్ చేస్తున్నారు.

తన ట్వీట్లలో రాజ్ కుంద్రా ‘పోర్న్ ప్రాస్టిట్యూషన్(వ్యభిచారం) గురించి ప్రస్తావించారు. ‘కెమెరా ముందు శృంగారం చేసే వారికి ఎందుకు రెమ్యూనరేషన్ చెల్లించాలి’ అంటూ రాజ్ కుంద్రా గతంలో చేసిన ట్వీట్ ఇప్పుడు తీసిన నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. పోర్న్ కు ప్రాస్టిట్యూషన్ కు సంబంధం లేదు అంటూ తన అభిప్రాయాన్ని రాజ్ కుంద్రా వ్యక్తం చేశారు.

ఇక మరో ట్వీట్ లో రాజ్ కుంద్రా ఇండియాలో యాక్టర్లు క్రికెట్ ఆడుతున్నారని.. క్రికెటర్లు పాలిటిక్స్ చేస్తున్నారని.. పొలిటీషియన్లు పోర్న్ చూస్తున్నారని చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. .

ఇక ప్రముఖ యాంకర్ కపిల్ శర్మ షోకు వచ్చినప్పుడు కూడా రాజ్ కుంద్రా చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో కపిల్ శర్మ సూటిగా ‘రాజ్ కుంద్రా డబ్బు ఎలా సంపాదిస్తారు’ అని అడుగుతాడు.. మీకు ఆదాయ వనరు ఏదని.. ఇంత విలాసవంతమైన జీవితం గడపడానికి అంత డబ్బు మీకు ఎలా వస్తుందని అడుగుతాడు.. బాలీవుడ్ పార్టీలలో విమానాల్లో తిరుగుతారు ఫుట్‌బాల్ మ్యాచ్‌లు బయటి రెస్టారెంట్లలో లేదా తన భార్యను షాపింగ్ కోసం తీసుకెళుతూ భారీగా ఎలా ఖర్చు చేస్తాడని కపిల్ అతనిని ప్రశ్నిస్తాడు. ‘ఏమీ చేయకుండా మీరు డబ్బు ఎలా సంపదిస్తారు?’ అని కపిల్ ఎంత గుచ్చి గుచ్చి అడిగినా రాజ్ కుంద్రా నోరు మెదపలేదు. ఈ ప్రశ్నకు శిల్పా శెట్టి మాత్రం నవ్వి ఊరుకుంటుంది.

దీన్ని బట్టి పోర్న్ వీడియోలు తీసే రాజ్ కుంద్రా సంపాదించాడా? అని ఆయన అరెస్ట్ తర్వాత ఈ వీడియోలను వైరల్ చేస్తూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ప్రముఖ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్  కుంద్రాను ముంబై సైబర్ క్రైం పోలీసులు పోర్న్ వీడియోలు తీస్తున్నారని అరెస్ట్ చేయడం సంచలనమైంది. రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత అనూహ్యంగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

మొబైల్ యాప్ ద్వారా పోర్నో గ్రాఫిక్ కంటెంట్ ను అప్ లోడ్ చేస్తున్నారనే ఆరోపణలపై రాజ్ కుంద్రాతోపాటు 11 మందిని అరెస్ట్ చేయడం బాలీవుడ్ ను కుదిపేసింది. దీనిపై గత జూన్ లోనే పోలీసులకు ఫిర్యాదు అందింది. తనపై ఆరోపణలు రావడంతో రాజ్ కుంద్రా ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన ఖండించారు. వెబ్ సిరీస్ వీడియోలను ప్రొడ్యూస్ చేసే స్టార్టప్ కంపెనీ నుంచి బయటకు వచ్చానని స్పష్టం చేశారు. అయితే ఆయనకు పోర్నోగ్రఫి మాఫియాతో రాజ్ కుంద్రాకు లింకులు ఉన్నాయని నిర్ధారించుకొన్న తర్వాత ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.

ఈ అరెస్ట్ తో ఇప్పుడు రాజ్ కుంద్రాకు సంబంధించిన  అన్ని వీడియోలు బయటకు వస్తూ ఆయన గురించి నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.