శిల్పా శెట్టి మిస్సింగ్.. మీడియాకు దూరం

Wed Jul 21 2021 10:00:14 GMT+0530 (IST)

Shilpa Shetty is missing stays away from the media

అశ్లీల వీడియోలు చిత్రీకరించినట్టు ఆరోపణలతో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. రాజ్ కుంద్రా నేరం చేసినట్టు తమ వద్ద తగిన ఆధారాలున్నాయని ముంబై పోలీసులు తెలిపారు. ఈ కేసులో రాజ్ కుంద్రాను జూలై 23 వరకు పోలీసు కస్టడీకి పంపారు.అయితే భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ నేపథ్యంలో శిల్పా శెట్టి అదృశ్యమయ్యారు. ఆమె మీడియాకు దూరంగా జరిగారు. ఆమె ఆచూకీ ఎవరికి తెలియనంత రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు. ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ చేసినట్టుగా తెలుస్తోంది.

రాజ్ కుంద్రాతోపాటు ఇప్పటికే మరో ఐదుగురిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్ కుంద్రాపై తీవ్రమైన ఆరోపణలను పోలీసులు చేశారు. అతను అశ్లీల సినిమాలు చేసి వాటిని ఓటీటీ ఫ్లాట్ ఫాంపై విడుదల చేశాడని ఆరోపించారు. ప్రతి వారం ఒక చిత్రం విడుదలవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2021 ఫిబ్రవరిలో రాజ్ కుంద్రాపై కేసు నమోదైంది. రాజ్ వాట్సాప్ చాట్ కూడా బయటపడింది. అగడి వ్యాపార సీక్రెట్స్ అన్నీ అందులో ఉన్నాయంటున్నారు.

ప్రస్తుతం శిల్పా శెట్టి ‘సూపర్ డ్యాన్సర్ 4’ అనే రియాలిటీ షోలో జడ్జీగా పాల్గొంటున్నారు. ఆయన భర్త అశ్లీల చిత్రాల యాప్ కేసులో అరెస్ట్ కావడంతో ఈ షో షూటింగ్ కోసం శిల్పాశెట్టి రాలేదని వార్తలు వస్తున్నాయి. శిల్పా మంగళవారం షో షూటింగ్ కోసం షెడ్యూల్ ఉన్న భర్త కేసు నేపథ్యంలో రాలేదని తెలిసింది.

సోమవారం రాత్రి ఆమె భర్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే తన సోదరి వద్దకు వెళ్లిందని.. ఆమె ప్రస్తుతం సోదరి షమిత తల్లితో కలిసి జుహులోని ఒక బంగ్లాలో ఉందని అంటున్నారు.

ఇక శిల్పా సైతం బాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్న వేళ ఈ అనుకోని షాక్ తగిలింది. శిల్పా ప్రస్తుతం ‘హంగామా2’ సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రంలో పరేష్ రావల్ మీజాన్ జాఫ్రి కూడా నటిస్తున్నారు. ఇప్పుడు భర్త చిక్కులతో ఆమె ఇందులోనూ పాల్గొంటుందా? లేదా అన్నది చూడాలి.