Begin typing your search above and press return to search.

బాబు మీద ఈసారి ఫైబర్ నెట్ స్కాం తో....!

టీడీపీ అధినేత చంద్రబాబు మీద మరో కేసుతో ఏపీ సీఐడీ రెడీ అవుతోంది. ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు మీద ఫైబర్ నెట్ స్కాం కేసుని మునుదుకు తెస్తోంది సీఐడీ.

By:  Tupaki Desk   |   19 Sep 2023 1:39 PM GMT
బాబు మీద ఈసారి ఫైబర్ నెట్ స్కాం తో....!
X

టీడీపీ అధినేత చంద్రబాబు మీద మరో కేసుతో ఏపీ సీఐడీ రెడీ అవుతోంది. ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు మీద ఫైబర్ నెట్ స్కాం కేసుని మునుదుకు తెస్తోంది సీఐడీ. ఈ కేసులో బాబుని విచారించడం కోసం ఏసీబీ కోర్టులో మరో పీటీ వారెంట్ ని సీఐడీ అధికారులు దాఖలు చేశారు. ఈ పిటిషన్ ని ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించడం జరిగింది.

ఈ ఫైబర్ నెట్ స్కాం సంగతి ఏంటి అంటే దీని మీద వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సిట్ ని విచారణకు వేసింది. ఆ సిట్ దర్యాప్తులో 121 కోట్ల రూపాయల స్కాం జరిగిందని తేల్చింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే అంటే 2019లోనే ఫైబర్ నెట్ స్కాం మీద సిట్ ని నియమిస్తే అదే ఏడాది 19 మంది మీద సీఐడీ కేసుని నమోదు చేసింది.

ఈ కేసులో ఏ వన్ గా వేమూరి హరిప్రసాద్, ఏ టూ గా మాజీ ఎండీ సంబశివరావు పేర్లను సిట్ పేర్కొంది. ఇక వేమూరి హరిప్రసాద్ అన్న వ్యక్తి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అని అంటున్నారు. దాంతో ఆ దిశగా సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. అదే విధంగా ఫైబర్ నెట్ స్కాం లో చంద్రబాబు పాత్రను కూడా సీఐడీ ఆద్వర్యంలోని సిట్ గుర్తించింది అంటున్నారు.

అదే విధంగా టెర్రా సాఫ్ట్ కి అక్రమ మార్గంలో టెండర్లు ఇచ్చారన్న దాని మీద కూడా సీఐడీ విచారణ చేసింది అంటున్నారు. ఒకసారి కాకుండా టెర్రా సాఫ్ట్ కోసం నిబంధనలను పక్కన పెట్టి మరీ వారం రోజుల పాటు టెండర్ల గడువుని పొడిగించారని గుర్తించింది అంటున్నారు.

ఇక టెర్రా సాఫ్ట్ అన్న సంస్థ బ్లాక్ లిస్ట్ లో ఉన్నా దానికి ఫైబర్ నెట్ టెండర్లు దక్కడం వెనక వేమూరి హరిప్రసాద్ ఉన్నారని సీఐడీ దర్యాప్తులో గుర్తించింది అంటున్నారు. ఇక ఫైబర్ నెట్ కి సంబంధించి మొదటి దశ కోసం 320 కోట్ల రూపాయలకు టెండర్లు వేస్తే అందులో 121 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సీఐడీ తేల్చింది అని అంటున్నారు.

ఇలా తమకు అనుకూలమైన టెర్రా సాఫ్ట్ కి టెండర్లు దక్కేలా చేశారని, దీని వెనక అవకతవకలు జరిగాయని సీఐడి అంటోంది. అందుకే ఈ కేసులో బాబు ప్రమేయం మీద దర్యాప్తు కోసం ఏసీబీ కోర్టులో సీఐడీ పీటీ పిటిషన్ వేసింది. దీని మీద జరిగే విచారణ లో ఏమి జరగనుంది అన్నది కూడా ఇపుడు ఆసక్తికరంగా మారింది.