Begin typing your search above and press return to search.

వైసీపీ మీద టీడీపీ బురద.... వంత పాడుతున్న అనుకూల మీడియా

నిజానికి ఈ రోజున విషయం అందరికీ తెలుసు. ఇది స్మార్ట్ యుగం. సోషల్ మీడియా తరం. అందుకే తెల్లనివన్ని పాలు కావు నల్లనివన్నీ నీళ్ళు కాదు అని జనాలు నమ్ముతున్నారు

By:  Tupaki Desk   |   29 Nov 2023 4:53 PM GMT
వైసీపీ మీద టీడీపీ బురద.... వంత పాడుతున్న అనుకూల మీడియా
X

ఏపీలో అభివృద్ధిని పక్క తోవ పట్టించేందుకు టీడీపీ బురద జల్లే కార్యక్రమం ఎత్తుకుంటే దాన్ని అనుకూల మీడియాలో అతి పెద్దగా ప్రచారం లోకి తెచ్చి ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్రకు తెర తీస్తున్నారు. నిజానికి ఈ రోజున విషయం అందరికీ తెలుసు. ఇది స్మార్ట్ యుగం. సోషల్ మీడియా తరం. అందుకే తెల్లనివన్ని పాలు కావు నల్లనివన్నీ నీళ్ళు కాదు అని జనాలు నమ్ముతున్నారు.

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు అభివృద్ధి కార్యక్రమాలు జనాలకు చేరువుతున్న నేపధ్యంలో వారి బుర్రల్లో వేరే విషయాన్ని జొప్పించాలనే టీడీపీ ప్రయత్నం చేస్తోందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా ఒక విమర్శ లాంటి బురద జల్లారని అంటున్నారు.

అదేంటి అంటే కేంద్రం ముంచి డెప్యుటేషన్ మీద వచ్చే ఐఏఎస్ అధికారులలో అత్యధికులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాజిక వర్గం వారు అని. వారిని ఆదాయార్జన వచ్చే కీలక శాఖలలో నియమించారని. ఇలా టీడీపీ విమర్శలు చేస్తే అనుకూల మీడియా దాన్నే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ నిజం అన్నట్లుగా భ్రమింపచేస్తోంది అని అంటున్నారు.

నిజానికి చంద్రబాబు హయాంలో అంటే ఆయన 2014 నుంచి 2019 దాకా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఏకంగా 30 మంది ఐఏఎస్ అధికారులను తన సామాజిక వర్గానికి చెందిన వారిని తెచ్చుకుని వివిధ శాఖలలో నియమించారని వైసీపీ నుంచి వస్తున్న ఘాటు సమాధానంగా ఉంది.

టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబుకు సామాజిక వర్గానికి చెందిన అధికారులు గురించి టీడీపీ అనుకూల మీడియాకు ఎందుకు గుర్తుకు రాదని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం నుండి బాబు హయాంలో ఐఏఎస్ అధికారులు జాస్తి కృష్ణ కిషోర్, సంధ్యారాణి, రాజమౌళి,వెంకయ్య చౌదరి, సాంబశివరావు ఇలా ఎంతో మంది ఏపి క్యాడర్ కు వచ్చారుని అంటున్నారు.

అలాగే వీరితో పాటు చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించే ఎంతోమంది ఐఏఎస్ అధికారులను రాష్ట్రానికి తీసుకువచ్చారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే ఉదాహరణలు అని వివరిస్తున్నారు. అలాగే, ఇంకా ఎంతోమంది అధికారులను బాబుకు అనుకూలంగా ఉన్న వారిని తమకు నచ్చిన చోట పోస్టింగ్ ఇచ్చిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయని అంటున్నారు.

అసలు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో అన్యాయం జరిగినా అక్రమాలు జరిగినా కనీసం వాటి గురించి రాసేందుకు కూడా ఒక వర్గం మీడియా ఎందుకు ప్రయత్నం చేయలేదు అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఎంతసేపూ వైసీపీ మీద ఒక వర్గం మీడియా బురద జల్లుతూ అవే నిజాలుగా జనాలను నమ్మించాలని చూస్తోంది అంటున్నారు.

మీడియాను పెట్టుకుని జనాలను మభ్యపెట్టాలనుకుంటే కుదురే రోజులు కావి ఇవి అంటున్నారు. ఒక వైపు ఏపీలో అభివృద్ధి ఎంత చేసినా ఎవరికీ కనిపించకపోవడం చిత్రంగా ఉంది అని అంటున్నారు. అసలు అభివృద్ధి గురించి చూడడం అన్నదికూడా లేదని అంటున్నారు. ఇదంతా చూస్తూంటే ప్రత్యేకించి ఏపీలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వ్యవహారం అంతా గురువిందగింజ సామెతలా ఉందని అంటున్నారు.

లేనిది ఉన్నట్లుగా చూపించే ఒక వర్గం మీడియాకు మాత్రం వైసీపీ తప్పులే ఎపుడూ కనిపిస్తాయని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ విధంగా టన్నుల కొద్ది విషం చిమ్మి వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం నిరాటంకంగా చేస్తున్నారు అని కూడా మండిపడుతునారు.

వాస్తవానికి చూస్తే ఏపీలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు చూసి ఓర్వలేని విపక్షం మళ్లీ ఓటమి తప్పదని భయపడుతోంది అంటున్నారు. దానికి సాయంగా అనుకూల మీడియా ఈ విధంగా ఆధారం లేని విషయాలను రాస్తోందని కూడా ఫైర్ అవుతున్నారు. పాత్రికేయానికి ఒక విలువ గౌరవం ఉన్నాయన్నది మరచి చేస్తున్న ఈ చర్యలను ఏపీ జనాలు అంతా గమనిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి ఇదంతా వైసీపీని బదనాం చేసేందుకే అని అంటున్నారు.