Begin typing your search above and press return to search.

పవన్ నాలుకని వెయ్యిసార్లు కోస్తాం... వైసీపీ ఎమ్మెల్యే ఫైర్!

ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు! ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారని అంటున్నారు

By:  Tupaki Desk   |   17 July 2023 11:43 AM GMT
పవన్ నాలుకని వెయ్యిసార్లు కోస్తాం... వైసీపీ ఎమ్మెల్యే ఫైర్!
X

గతకొన్ని రోజులుగా ఏపీలో వాలంటీర్ల పై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాలంటీర్లపై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ... తీవ్రస్థాయిలో ఫైరయ్యారట వైసీపీ ప్రివిలైజ్ కమిటీ సభ్యుడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు! ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

అవును... వాలంటరీ వ్యవస్థపై కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ నాలుకను వెయ్యిసార్లు కోస్తామని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది. ఈ సందర్భంగా.. వాలంటరీ వ్యవస్థకు సంబంధించి పవన్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారని అంటున్నారు.

ఈ సందర్భంగా... వాలంటరీ వ్యవస్థ సచివాలయాలను వద్దంటున్న పవన్.. తిరిగి జన్మభూమి కమిటీలను తీసుకురావాలని కోరుకుంటున్నారా? అని సుధాకర్ బాబు ప్రశ్నించారని తెలుస్తుంది. ఇదే సమయంలో... గతంలో ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబు ఆడించిన విధంగా పవన్ ఎందుకు ఆడుతున్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది.

అదేవిధంగా... వాలంటీర్లపై హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేసిన పవన్ పై సుమోటోగా కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోలీసులను కోరారని తెలుస్తుంది. ఈ విషయంలో సుమారు 18 వేల మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని స్టేట్మెంట్ ఇచ్చిన పవన్ వారి వివరాలు చెప్పాలని.. లేకపోతే వాలంటీర్లకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారని అంటున్నారు.

అనంతరం చంద్రబాబుపై కూడా సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో ఫైరయ్యారని తెలుస్తుంది. దొంగలకు కేరాఫ్ అడ్రస్ నారా చంద్రబాబు నాయుడు ఇల్లు దోపిడికి కేరాఫ్ టీడీపీ పార్టీ మారాయని సుధాకర్ బాబు విమర్శించారని తెలుస్తుంది. ఈ సందర్భంగా కందుకూరును ప్రకాశం జిల్లాలో కలుపుతారంటూ లోకేష్ వ్యాఖ్యానించినట్లు వచ్చిన కథనాలను ఎమ్మెల్యే ప్రస్థావించారని తెలుస్తుంది

ఈ సందర్భంగా... దేనికి అర్హత సాధించాడని లోకేష్ కందుకూరును ప్రకాశం జిల్లాలో కలుపుతాడని సుధాకర్ ప్రశ్నించారని అంటున్నారు. ఇదేసమయంలో... కందుకూరును ప్రకాశం జిల్లాలో చేర్చే అంశాన్నే రెఫరెండంగా భావించి ఎన్నికలకు వెళ్దామని సవాల్ విసిరినట్లు చెబుతున్నారు.

అనంతరం బీజేపీ తాజా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పై కూడా సుధాకర్ బాబు స్పందించారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపికైన దగ్గుబాటి పురందేశ్వరీకి స్వాగతం చెబుతున్నట్లు సుధాకర్ బాబు పేర్కొన్నారని అంటున్నారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీపై ఆమె చేసిన వ్యాక్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారని అంటున్నారు.

ఇదే సమయంలో రాష్ట్రానికి ఇవ్వాల్సిన విభజన హామీల నిధులను వెంటనే కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారని సమాచారం. ఏది ఏమైనా... వైసీపీ ప్రివిలేజ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన సుధాకర్ బాబు... ఇలా విపక్ష సభ్యులందరిపైనా... తీవ్రస్థాయిలో చెప్పాలనుకున్న విషయాలను చెప్పారని అంటున్నారు పరిశీలకులు.