Begin typing your search above and press return to search.

లోకేష్ పాదయాత్రలో ఫ్లెక్సీలు...డబ్బులు ఎగ్గొడుతున్న టీడిపీ నేతలు!

టీడీపీ పరువుపోయే సంఘటన

By:  Tupaki Desk   |   18 July 2023 3:51 AM GMT
లోకేష్ పాదయాత్రలో ఫ్లెక్సీలు...డబ్బులు ఎగ్గొడుతున్న టీడిపీ నేతలు!
X

టీడీపీ పరువుపోయే సంఘటన ఒక తాజాగా స్పందన కార్యక్రమంలో జరిగిందని తెలుస్తుంది. టీడీపీ నేతలు ఫ్లెక్సీలు డబ్బులు ఎగ్గొట్టారంటూ ఒక వ్యక్తి ఏకంగా స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. దీంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడీయోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని అంటున్నారు.

అవును... యువ‌గ‌ళం పేరుతో నారా లోకేష్ చేస్తున్న పాద‌యాత్రలో టీడీపీ నేత‌లు భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే లోకేష్ రాకకోసం కట్టిన ఫ్లెక్సీలకు ఇప్పటివరకూ డబ్బులు ఇవ్వలేదని కె.వేణుగోపాల్ అనే వ్యక్తి జిల్లా ఎస్పీకి స్పందన కార్యక్రమలో ఫిర్యాదు చేశాడని తెలుస్తుంది. దీంతో టీడీపీ పరువు, లోకేష్ పరువు ఏకకాలంలో పోయాయనే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్నారు

వివరాళ్లోకి వెళ్తే... మే నెల‌లో లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర నంద్యాల‌, ఆళ్లగ‌డ్డకు చేరిన సమయంలో ప్లెక్సీలు క‌ట్టేందుకు నంద్యాల‌కు చెందిన టీడీపీ కార్యకర్త బొల్లెద్దుల సూరి... త‌న‌ను అఖిల‌ప్రియ భ‌ర్త భార్గవ్‌ రామ్ ద‌గ్గరికి తీసుకెళ్లి ఒప్పందం కుదుర్చుకున్నట్టు ల‌క్ష్మి డిజిట‌ల్ ప్రొప్రైట‌ర్ కె.వేణుగోపాల్ చెబుతున్నారట. ఈ వ‌ర్క్ విలువ రూ.5.85 ల‌క్షలు అని ఆయన చెబుతున్నారట!

అయితే ఈ పని నిమిత్తం ఇప్పటివరకూ రూ.4.25 ల‌క్షలను తొమ్మిది విడ‌త‌ల్లో ఇచ్చార‌ని వేణుగోపాల్ చెబుతున్నారని అంటున్నారు. ఇక, మిగిలిన సొమ్ము విషయంలో ఇవ్వకుండా బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో... చివ‌రికి ఇచ్చేది లేద‌ని.. ఏం చేసుకుంటావో చేసుకోపో అని వార్నింగ్ ఇచ్చారని వేణుగోపాల్ ఎస్పీకి చెప్పారని తెలుస్తుంది.

దీంతో... మిగిలిన సొమ్ము ఎగ్గొట్టే ఆలోచనలో ఉన్నారని పోలీసులకు చెబుతానని వేణుగోపాల్... బొల్లెద్దుల సూరితో చెప్పగా... వాళ్ల సంగ‌తి తెలియ‌ద‌ని, ఎత్తుకెళ్తార‌ని హెచ్చరించిన‌ట్టు అత‌ను వాపోయారని తెలుస్తుంది. ఈ సందర్భంగా అఖిల ప్రియను అడిగితే అన్న వచ్చిన తర్వాత సెటిల్ మెంట్ చేస్తారని చెప్పారని అన్నారు.

విఖ్యాత్ రెడ్డిని అడిగితే బావ వచ్చిన తర్వాత ఇస్తానన్నాడని చెప్పారని వేణుగోపాల్ చెబుతున్నారని అంటున్నారు. తీరా బావ వ‌చ్చిన త‌ర్వాత వెళ్తే... కనీసం త‌న‌ను లోప‌లికి కూడా రానివ్వలేద‌ని ఆయ‌న వాపోయారని సమాచారం. ఇదే సమయంలో అఖిల‌ప్రియ పీఏ మ‌హేశ్... త‌న‌ను, త‌న భార్యను తిట్టాడ‌ని, ఇంటి నుంచి బ‌య‌టికి గెంటేశాడ‌ని ఆరోపించారని అంటున్నారు.

దీంతో ఇక అడగడం, అనిపించుకోవడం, అవమానపరచబడటం కరెక్ట్ కాదని వేణుగోపాల్ ఆలోచించారట. దీంతో వెంటనే స్పందన కార్యక్రమానికి హాజరై.... నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైందని తెలుస్తుంది.

మరోపక్క ఈ విషయం తెలుసుకున్న వారు మాత్రం... లోకేశ్ పాద‌యాత్రకు క‌ట్టిన ప్లెక్సీలు, ఇత‌ర‌త్రా వాటికి అయిన ఖర్చును ఇవ్వకుండా ఏడిపించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. చినబాబు ఇలాంటి చిన్న చిన్న విషయాలను లైట్ తీసుకోకూడదని సూచిస్తున్నారంట. దీంతో ఇది టీడీపీ పరువుపోయే సంఘటనే అనే కామెంట్లు వినిపిస్తున్నాయని తెలుస్తుంది!