Begin typing your search above and press return to search.

మ‌రోసారి వైసీపీకి ఎందుకు ఓటేయాలి.. సీఎం జ‌గ‌న్ ఏం చెప్పారంటే!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి మ‌రోసారి ఎందుకు ఓటేయాల‌నే విష‌యంపై సీఎం జ‌గ‌న్ స్పందించారు

By:  Tupaki Desk   |   2 April 2024 4:30 PM GMT
మ‌రోసారి వైసీపీకి ఎందుకు ఓటేయాలి.. సీఎం జ‌గ‌న్ ఏం చెప్పారంటే!
X

ఏపీ అధికార పార్టీ వైసీపీకి మ‌రోసారి ఎందుకు ఓటేయాల‌నే విష‌యంపై సీఎం జ‌గ‌న్ స్పందించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న మాట్లాడుతూ.. త‌న‌కు ఓటెందుకు వేయాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌శ్నిస్తున్నార‌ని అన్నారు. అస‌లు చంద్ర‌బాబుకు ఎందుకు ఓటేయాలో ఆయ‌నే చెప్పాలన్నారు. మాకు ఎందుకు ఓటేయాలో తాను చెబుతాన‌ని వ్యాఖ్యానించారు.

వైసీపీకి ఎందుకు ఓటేయాలి.. అనే విష‌యంపై జ‌గ‌న్ స్పందిస్తూ..

+ అక్కచెల్లెమ్మలను ఈ ఐదేళ్ల మాదిరే వచ్చే ఐదేళ్లు కూడా ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు.

+ కుటుంబాలకు మూలం అక్కచెల్లెమ్మలు. పథకాల సాయంతో వారిని మరింత బలంగా నిలబెట్టాలన్న ఉద్దేశంతో మళ్లీ అధికారం అడుగుతున్నాం.

+గతంలో ఎవరూ చేయని విధంగా రూ.2.70 లక్షల కోట్లు సంక్షేమం కింద పారదర్శకంగా, అవినీతిరహితంగా అందించాం కాబ‌ట్టి మాకు ఓటేయాలి.

+ బటన్ నొక్కి నేరుగా డీబీటీ ద్వారా అందించింది రూ.2.70 లక్షల కోట్లు అయితే, నాన్ డీబీటీ కూడా కలిపితే... నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలాలు, వారి పిల్లలకు అందించే గోరుముద్ద, విద్యార్థులకు అందించే ట్యాబ్ లు, విద్యా దీవెన... ఇలాంటివన్నీ కలుపుకుంటే ఈ 58 నెలల కాలంలో అక్షరాలా రూ.3.75 లక్షల కోట్లు మా అక్కచెల్లెమ్మలకు లబ్ధి చేకూర్చాం కాబ‌ట్టి వైసీపీకి ఓటేయాలి.

+ఎక్కడా అవినీతి లేదు, లంచం మాట లేనేలేదు. ఒక్క రూపాయి దోపిడీ లేదు, ఒక్క రూపాయి కమీషన్ లేదు అందుకే వైసీపీకి ఓటేయాల‌ని అడుగుతున్నాం.

+ వార్డు/గ్రామ సచివాలయం, వాటిలో పది శాశ్వత ఉద్యోగాలు, ఇంటికే వచ్చే వాలంటీర్లు, వారు అందించే పెన్షన్, లంచాలు, వివక్ష లేని పాలన, బటన్ నొక్కితే అక్కచెల్లెమ్మల ఖాతాలో నమోదయ్యే ఆర్థికసాయం వంటివి ఏర్పాటు చేశాం కాబ‌ట్టి వైసీపీకి ఓటేయాలి.

+ విలేజ్ క్లినిక్ లు, ఉచితంగా మందులు, ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తున్నాం కాబ‌ట్టి వైసీపీకి ఓటేయాలి.

+ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీషు మీడియం, ప్రపంచస్థాయి చదువులు, పిల్లల చేతుల్లో ట్యాబ్ లు, ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన అందిస్తున్నాం కాబ‌ట్టి వైసీపీకి ఓటేయాల‌ని కోరుతున్నాం.

+ రైతు భరోసా, గ్రామాల్లో ఆర్బీకేలు, రైతులకు సున్నా వడ్డీ, రైతన్నలకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్, రైతన్నలకు ఉచిత పంట బీమా, రైతన్నకు ఇన్ పుట్ సబ్సీడీ వంటివి ఇస్తున్నాం కాబ‌ట్టి వైసీపీకి ఓటేయాల‌ని అడుగుతున్నాం.

+ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ అన్ని వర్గాలను ఆదుకున్నాం..ప‌ద‌వులు ఇచ్చాం..ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కూడా ఇచ్చాం కాబ‌ట్టి ఓటు అడుగుతున్నాం. అని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.