Begin typing your search above and press return to search.

''చంద్రబాబు అనే పసుపుపతి అధికారం కోసం వదల బొమ్మాళీ వదల అంటున్నాడు''

పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడుతున్నాడని చంద్ర‌బాబుపై సీఎం జ‌గ‌న్ స‌టైర్లు వేశారు

By:  Tupaki Desk   |   2 April 2024 4:12 PM GMT
చంద్రబాబు అనే పసుపుపతి అధికారం కోసం వదల బొమ్మాళీ వదల అంటున్నాడు
X

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన‌ అరుంధ‌తి సినిమాలో విల‌న్ 'ప‌శుప‌తి' పాత్ర‌ను ప్ర‌స్తావిస్తూ.. చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ''చంద్రబాబు అనే పసుపుపతి అధికా రం కోసం వదల బొమ్మాళీ వదల అంటున్నాడు'' అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ''మీరంతా అరుంధతి సినిమా చూశారా? ఆ సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతి లాగా, ఇప్పుడు ఐదేళ్ల తర్వాత చంద్రబాబు అనే పసుపుపతి అధికారం కోసం వదల బొమ్మాళీ వదల అంటున్నాడు'' అని వ్యాఖ్యానించారు.

పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడుతున్నాడని చంద్ర‌బాబుపై సీఎం జ‌గ‌న్ స‌టైర్లు వేశారు. నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్నాడని అన్నారు. ''ఈ పసుపుపతి 2014లోనూ ఇదే మాదిరి ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకు న్నాడు. ఇంటింటికీ హామీ పత్రం పంపించాడు. రైతులకు రుణమాఫీ అన్నాడు. చేశాడా? పొదుపు సంఘాలకు రుణమాఫీ అన్నాడు... చేశాడా? ఆడబిడ్డ పుట్టగానే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు... కనీసం ఒక్కరికైనా ఒక్క రూపాయి అని డిపాజిట్ చేశాడా?'' అని చంద్ర‌బాబుపై జ‌గ‌న్ విరుచుకుప‌డ్డారు.

జిత్తుల మారి పొత్తుల ముఠా!

టీడీపీ-జన‌సేన‌-బీజేపీ పొత్తుల‌పైనా సీఎం జ‌గ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ పొత్తును 'జిత్త‌ల మారి పొత్తు' గా ఆయ‌న అభివ‌ర్ణించారు. "ఈ ఎన్నికల్లో మనం పోరాడుతోంది ఎవరితోనో తెలుసా... అబద్ధాలనే పునాదులుగా, మోసాలనే అలవాటుగా మార్చుకున్న ఓ జిత్తులమారి పొత్తుల ముఠాతో'' అని వ్యాఖ్యానించారు. ఆ ముఠా నాయకుడు చంద్రబాబు అని దుయ్య‌బ ట్టారు. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఇచ్చిన మేనిఫెస్టో ఎవరికీ కనపడదని వ్యాఖ్యానించారు. ఎన్నిక‌లు అయిపోగానే చెత్తబుట్టలో ఉంటుందన్నారు. ''మరి ఇదే పొత్తు, ఇదే ముగ్గురు, ఇవే పార్టీలు... గతంలో ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకుండా, మీటింగులు పెడుతూ మరోసారి ఇదే డ్రామా ఆడుతున్నారు'' అని విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇంటింటికీ బంగారం..

జిత్తుల మారి పొత్తులు పెట్టుకున్న బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన‌లు ఇంటింటికీ బంగారం, ఇంటికో బెంజ్ కారు అంటున్నారని సీఎం జ‌గ‌న్ ఆక్షేపించారు. దీని గురించి ప్రజలు ఆలోచించాలని ఆయ‌న పిలుపునిచ్చారు.