జగన్ ని పొగిడిన పచ్చ చానల్...ఇదే వైరల్!
కానీ జగన్ అంటే పడని ఆయన పార్టీ పొడగిట్టని ఒక చానల్ వైసీపీ వారి దృష్టిలో పచ్చ చానల్ గా ముద్రపడిన ఒక మీడియా జగన్ ఏ రేంజిలో పొగిడిందో చూస్తే కనుక భూమి దద్దరిల్లిపోయేలా బిగ్ సౌండ్ వస్తుంది.
By: Tupaki Desk | 13 July 2025 5:51 PM ISTజగన్ జనం క్రేజ్ ఆయన గ్రేట్ ఇలాంటి మాటలు వైసీపీ వారు వందిమాగదులు అంటే మామూలుగా ఉంటుంది. ఆ సౌండ్ కూడా పెద్దగా ఉండదు. కానీ జగన్ అంటే పడని ఆయన పార్టీ పొడగిట్టని ఒక చానల్ వైసీపీ వారి దృష్టిలో పచ్చ చానల్ గా ముద్రపడిన ఒక మీడియా జగన్ ఏ రేంజిలో పొగిడిందో చూస్తే కనుక భూమి దద్దరిల్లిపోయేలా బిగ్ సౌండ్ వస్తుంది. అంతే కాదు టీడీపీ కూటమికి బహుశా షాక్ తినే పరిస్థితి వస్తుందేమో అంటున్నారు.
మన గురించి మన వారు కాదు అవతల వారు పొగిడితే ఆ కిక్కే వేరు దానికి వచ్చే లెక్కే వేరు అని అంటారు. ఇపుడు సరిగ్గా అదే జరుగుతోంది. జగన్ గురించి ఒక పచ్చ చానల్ రాసిన తనదైన విశ్లేషణ కూటమిలో అతి పెద్ద చర్చకు దారి తీస్తూంటే వైసీపీ వర్గాలు అయితే పండుగే చేసుకుంటున్నాయి.
జగన్ కి ఏముంది జస్ట్ పదకొండు సీట్లే కదా అని లైట్ తీసుకోకూడదన్నట్లుగా ఒక హెచ్చరికగా కూడా ఈ విశ్లేషణ ఉంటే ఉండొచ్చు. కానీ అందులో జగన్ ని మామూలుగా అనుకోవద్దు ఆయన వ్యూహాలు ఎత్తుగడలు వేరే లెవెల్ అని పొగడకుండానే పొగడడం చూసిన వారు మాత్రం ఏమిటి ఇది అనుకోవాల్సిందే.
ఒక రాజకీయ నాయకుడిగా జగన్ ది పదిహేనేళ్ళ ప్రస్థానం. అందులో ఆయన పాదయాత్రలని మరో యాత్రలను జనం మధ్యలో 2019 దాకా తిరిగారు. ఇక ఓటమి తరువాత కేవలం ఏడాది మాత్రమే అయింది. జగన్ రోడ్ల మీదకు వస్తూంటే జనాలు పోలోమని వెంటపడడం ఏ రకమైన సంకేతం అని సదరు పచ్చ చానల్ ప్రశ్నిస్తోంది. ఒక సినీ స్టార్ కి ఉండే క్రేజ్ జగన్ కి ఉందని చెప్పకనే చెబుతోంది.
అంతే కాదు అయిదేళ్ల టీడీపీ ప్రతిపక్ష పాత్రను వైసీపీతో పోల్చుతూ అబ్బే ఆ రోజులలో టీడీపీ కోలుకోవడానికి కనీసంగా మూడు నాలుగేళ్ళు పట్టిందని దెప్పిపొడుస్తోంది. పైగా 2024 ఎన్నికల వేళ కూటమి కట్టి అధికారం దక్కుతుందన్న సంకేతాలను ఇస్తూన్నా చంద్రబాబు సభలకు వచ్చిన జనాలతో పోలిస్తే ఈ రోజున తొలి ఏడాది కూటమి పాలన ముగిసిన తరువాత జగన్ సభలకు వస్తున్న జనాలే ఎక్కువ అని అంటోంది.
జగన్ భయం అనే పెట్టుబడితో అధికార కూటమిని కట్టడి చేస్తున్నారని కూడా చప్పడమూ విశేషమే. జగన్ పర్యటించే చోట్ల ఆయా జిల్లాలకు చెందిన కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు ఆయన మీద విమర్శలు చేయలేకపోతున్నారు అంటే ఇది ఏ రకమైన భయం అని కూడా ప్రశ్నిస్తున్నారు. మరో వైపు చూస్తే జగన్ హయాంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ టీడీపీ నేతల మీద వేధింపులు ఉండేవని, అలా వారు బయటకు రావడానికే భయపడ్డారని కానీ ఇపుడు వైసీపీ వారు అలా లేరని మేమే మళ్ళీ అధికారంలోకి వస్తున్నామని వారు చెబుతున్న మాటలు చేస్తున్న ప్రకటనలతో కూటమిలో సైతం ఒక రకమైన భావన ఏర్పడినట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు.
జగన్ మళ్ళీ వస్తారేమో అన్న భావనతో అధికార యంత్రాంగం కూడా చురుకుగా పనిచేయడం లేదని సదరు చానల్ ఆక్షేపించింది. అంతే కాదు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదని మెతక ప్రభుత్వం అన్న భావన జనంలోకి వెళ్తోంది అని చెబుతోంది. ఇక చంద్రబాబుకు కూటమి ప్రభుత్వం మీద పట్టు లేకుండా పోయింది అని కూడా నిశితమైన విమర్శలే చేసింది.
రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వమా లేక జగన్ ప్రభుత్వమా అన్నది టీడీపీ కార్యకర్తలే ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది అని అంటోంది. ప్రత్యర్ధి పక్షాన్ని భయపెట్టడంలో జగన్ విజయవంతం అయ్యారని కూడా మెచ్చుకోలు మాటలు చెబుతోంది. యావత్తు టీడీపీకి పిరికితనం ఆవహించింది అని కూడా నిందలేస్తోంది.
మరో వైపు కూటమి నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరూ కార్యకర్తల బాధలను పట్టించుకోవడం లేదని ఘాటైన విమర్శలే చేసింది. నిజంగా జగన్ బలపడ్డారా అని కూటమి నేతలు ఆరా తీసే పరిస్థితి వచ్చిందంటే జగన్ చూపిస్తున్న భయం ఏ రేంజిలో ఉందో అర్ధం చేసుకోవాలని అంటోంది. ఈ రోజున జగన్ కి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదని పేర్కొంటోంది.
ఇక జగన్ ని నిలువరించే విషయంలో టీడీపీ కూటమి పూర్తిగా విఫలం అయింది అని కూడా విమర్శించారు. జగన్ అధికారంలో ఉన్నపుడు ఒక ఉద్యమాన్ని కూడా చేయడానికి టీడీపీ వారు భయపడితే ఇపుడు ఏడాది అయినా తిరక్కముందే మేము అధికారంలోకి వస్తే అందరికీ సినిమా చూపిస్తామన్న స్థాయిలో వైసీపీకి రావడం అంటే ఆలోచించాల్సిందే అన్నది పచ్చ చానల్ ఉవాచ.
ఇలా జగన్ గురించి అన్నీ పాజిటివ్ గా రాస్తూ ఆయన పెడుతున్న భయాన్ని పిరికిగా టీడీపీ భరిస్తోందని ఆక్షేపించడం అంటే ఇది వైసీపీ శ్రేణులకు ఆనందపరచే విశ్లేషణగానే చూస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఎన్నడూ లేనిది పచ్చ చానల్ నుంచి వచ్చిన ఈ రాజకీయ వ్యాఖ్యానాన్ని వైసీపీ వారే పోస్టు చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు అదే సమయంలో దటీజ్ జగన్ అని వైసీపీ యూట్యూబర్లు కూడా లెక్కకు మిక్కిలిగా పోస్టులు చేసి వదులుతున్నారు.
మీరు పిరికివారు అని మీ ఇంటి పత్రిక మీ నట్టించి చానలే చెప్పిందిగా అంటూ రెట్టిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో చూస్తే టీడీపీ కూటమికి ఈ వ్యాఖ్యానాలు ఏ మాత్రం మింగుడు పడడం లేదు అంటున్నారు అదే సమయంలో వైసీపీ ఫుల్ జోష్ లో ఉంది. ఇంతకీ ఈ రాజకీయ విశ్లేషణ రాసింది సదరు పచ్చ చానలేనా అన్నంతగా ఇది ఉందంటే తమాషా మామూలుగా లేనట్లే.
