Begin typing your search above and press return to search.

బాబు పెద్ద నమస్కారం...లిస్ట్ లో ఉన్నదెవరు ?

తెలుగుదేశం పార్టీ తాజాగా ఎమ్మెల్యేలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు అధినేత హోదాలో కీలక వ్యాఖ్యలు చాశారు. పార్టీ కోసం పనిచేయాలని అన్నారు.

By:  Tupaki Desk   |   30 Jun 2025 1:30 AM
బాబు పెద్ద నమస్కారం...లిస్ట్ లో ఉన్నదెవరు ?
X

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చాలా సహనంతో ఉంటారు. ఆయన ఎవరినీ అంత తేలిగ్గా వదులుకోరు. ప్రతీ వారిలోనూ పాజిటివిటీనే చూస్తారు. వారిని దిశా నిర్దేశం చేస్తూనే ఉంటారు. అయితే బాబు ఎర్లీ సెవెంటీస్ లో పాలిటిక్స్ లోకి వచ్చారు. ఆయన ఎంతగా అప్డేట్ అవుతున్నా ఆయన ఉన్న కాలం వేరు, ఇపుడు పాలిటిక్స్ వేరు.

ఆయన రాజకీయ ప్రత్యర్ధి జగన్ విషయమే తీసుకుంటే ఆయన దగ్గర ఎలాంటి మొహమాటాలూ ఉండవు. నచ్చకపోయినా పార్టీ విధానాలకు సరిగ్గా లేకపోయినా వదిలేసుకుంటారు. ఇపుడిపుడే తెలుగుదేశం పార్టీ కూడా అలాంటి మొహమాటాలను వదిలేస్తోంది.

టీడీపీ కొత్త రూట్ ఏమిటి అన్నది 2024 ఎన్నికలలో టికెట్ల దగ్గరే తెలిసింది. చాలా మందికి టికెట్ల విషయంలో పార్టీ అనుసరించిన విధానం వారు అయిదేళ్ళూ విపక్షంలో ఉన్నపుడు ఏ విధంగా పనిచేసారు. అన్న దాని మీదనే. ఈ విషయంలో సీనియర్లను సైతం ఉపేక్షించలేదు. మంత్రులుగా పనిచేసిన వారిలో కొందరికి అయితే చివరి లిస్ట్ లో టికెట్లు ఆనాడు ఇచ్చారు.

ఈ విధంగా టీడీపీ మంత్రివర్గ కూర్పు విషయంలోనూ వ్యవహరించింది. సీనియర్లను పక్కన పెట్టారు. కొత్త వారికి చాన్స్ ఇస్తున్నారు. యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఏ విధంగా అనుసరించినా కూడా పనిమంతులకు నిబద్ధతతో పార్టీ పట్ల వ్యవహరించిన వారికి అధిక ప్రాధాన్యతం అన్నది టీడీపీ స్పష్టంగా చెబుతోంది.

తెలుగుదేశం పార్టీ తాజాగా ఎమ్మెల్యేలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు అధినేత హోదాలో కీలక వ్యాఖ్యలు చాశారు. పార్టీ కోసం పనిచేయాలని అన్నారు. అలా చేయని వారిని వదిలేసుకుంటామని కూడా స్పష్టం చేశారు. ఒకటికి రెండు సార్లు చెబుతామని వినకపోతే పెద్ద నమస్కారం పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను ఇప్పటికే ఒక నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడాను అని చెప్పారు ఫేస్ టూ ఫేస్ గా ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. అవసరం అయితే ప్రతీ రోజూ ఒక గంట ఎమ్మెల్యేలకు కేటాయిస్తామని అన్నారు. వారు చెప్పింది వింటాను అని వారికి పార్టీ పరంగా సూచనలు చేస్తామని అప్పటికీ తీరు మార్చుకోకపోతే మాత్రం కష్టమనే సంకేతాలు ఇచ్చారు. ఈ విషయంలో ఏ రకమైన మొహమాటాలు అసలు లేవని కూడా ఆయన చెప్పారు.

మొత్తానికి చంద్రబాబు చేసిన ఈ కామెంట్స్ తో టీడీపీ ఎమ్మెల్యేలలో ఎవరి పనితీరు ఏమిటి అన్న చర్చ సాగుతోంది. టీడీపీ అధినాయకత్వం వద్ద అందరికి సంబంధించిన వివరాలు సర్వేలు ఉన్నాయని అంటున్నారు. అంతే కాదు ఎప్పటికపుడు గ్రౌండ్ లెవెల్ రిపోర్టు అధినాయకత్వానికి చేరిపోతోంది అని అంటున్నారు. దాంతో ఇక మీదట జనంతో మమేకం అయి నిబద్ధతతో పనిచేసే వారికే ప్రయారిటీ అన్నది బాబు గట్టిగా చెప్పేశారు.

ఈ విషయంలో ఎవరికీ కూడా స్పేర్ చేసేది లేదని కూడా ఖండితంగా చెప్పేశారు. ఇక పెద్ద నమస్కారం బాబు పెడతారు అన్నది కూడా పార్టీలో చర్చ సాగుతోంది. మరి బాబు లిస్ట్ లో దృష్టిలో ఎవరెవరు అలా పెద్ద నమస్కరాలకు గురి అయ్యేవారు ఉన్నారు అన్నది కూడా ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా తీరు మార్చుకోకపోతే మాత్రం కష్టమే అన్న సందేశాన్ని మాత్రం అధినాయకత్వం బలంగా పంపిస్తోంది అని అంటున్నారు.