కలెక్టర్లు గ్రామాలకు వెళ్ళాల్సిందే... బాబు దిశా నిర్దేశం
గ్రామాల పర్యటనను కలెక్టర్లు సీనియర్ ఐఏఎస్ అధికారులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
By: Satya P | 11 March 2026 9:00 PM ISTగ్రామాల పర్యటనను కలెక్టర్లు సీనియర్ ఐఏఎస్ అధికారులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో పర్యటించినపుడే మంచి ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. నాలుగు నెలలకు ఒకసారి నాలుగు రోజుల పాటు కలెక్టర్లు గ్రామాలను సందర్శించాలని ఆయన కోరారు. గ్రామలకు వెళ్తే నేరుగా పరిస్థితుల మీద అవగాహన వస్తుందని అన్నారు అలాగే అనేకమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు.
ఏఐ ట్యూటర్ ఏఐ డాక్టర్ :
అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని సక్రమంగా వినియోగించుకుంటే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందని చంద్రబాబు చెప్పారు. 6వ జిల్లాల కలెక్టర్ల సమావేశలో స్వర్ణాంధ్ర -2047-పది సూత్రాలపై ఆయన పలు సూచనలు చేశారు. రానున్న కాలంలో ఏఐ ట్యూటర్ ఏఐ డాక్టర్ వచ్చే పరిస్థితి ఉండాలని అన్నారు. ఆ దిశగా ఏఐ సాంకేతిక అంశాలను కూడా ప్రాధాన్యతగా తీసుకుని అమలులో పెట్టాలని, సాంకేతికతను విరివిగా ఉపయోగించుకోవాలని బాబు కోరారు స్మార్ట్ హెల్త్ కేర్, వ్యవసాయంలో సాంకేతికత, విద్య, డిజిటల్ గవర్నెన్సు రంగాల్లో డీప్ టెక్ వినియోగం పెరగాలని ఆయన కలెక్టర్లకు సూచించారు అలాగే ఏఐ, బ్లాక్ చైన్, ఐఓటీ, రోబోటిక్స్ లాంటి టెక్నాలజీల వినియోగాన్ని పెంచితే వేగంతో పాటు తక్కువ వ్యయంతోనే ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుందని బాబు అన్నారు.
యువతకు ఉద్యోగాలు :
ఏపీలో నైపుణ్య శిక్షణ ద్వారా యువతకు ఉద్యోగాల కల్పించడంఓ చొరవ చూపాలని ఆయన సూచించారు. నైపుణ్యం, కౌశలం పోర్టల్ ద్వారా ఉద్యోగాలు, నైపుణ్య కల్పనపై ప్రత్యేక దృష్టి కలెక్టర్లు పెట్టాలని అన్నారు యువతకు ఉద్యోగాలు, నైపుణ్యం కల్పించే విషయంలో ఒకే తరహా విధానాన్ని అనుసరించాలని అన్నారు ఏపీలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం నిపుణుల్ని సంప్రదించాలని అన్నారు.
ప్రతీ జిల్లాలో హెచ్ఆర్ ఇనిస్టిట్యూట్ :
రానున్న రోజులలో ప్రతి జిల్లాలో ఒక హెచ్ఆర్ ఇనిస్టిట్యూట్ ను ఏర్పాటు చేసుకోవాలని బాబు కలెక్టర్లకు సూచించారు. దీని ద్వారా సిబ్బంది ఉద్యోగుల సామర్ధ్యాలను పెంపోందించుకోవచ్చునని అన్నారు. అలాగే ప్రణాళికా విభాగం ఆన్ లైన్ కోర్సులు తీసుకువచ్చినా ప్రాక్టికల్ నాలెడ్జి వచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా స్థాయిలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని పనితీరును విశ్లేషించుకోవాలని చెప్పారు.
కౌలు రైతుల విషయంలో :
ఏపీలో పెద్ద సంఖ్యలో కౌలు రైతులు ఉన్నారని బాబు కలెక్టర్ల సమావేశంలో చెప్పారు. అలాంటి కౌలు రైతులకు రుణాలివ్వడానికి అడ్డంకిగా ఎలాంటి నిబంధనలు ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఒక వేళ ఏమైనా నిబంధనలు ఉంటే వాటిపై చర్చించి తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతే కాదు వ్యవసాయాన్ని రీఓరియంట్ చేయాలని, వ్యవసాయంతో పాటు ఉద్యాన పశుసంవర్ధక రంగాల వైపు రైతులు మళ్ళేలా అవగాహన పెంచాలని అన్నారు
స్వర్ణ వార్డు సిబ్బందితో :
రాష్ట్రంలో ఉన్న స్వర్ణ గ్రామ, వార్డులలోని మహిళా పోలీసుల సేవలను ఎవరూ వినియోగించుకోవడం లేదని బాబు అన్నారు. వారి సేవలను అవసరమున్న శాఖలు వినియోగించుకోవాలని సూచినారు ఆర్ అండ్ బి హెల్త్ మున్సిపల్ శాఖలకు ఎక్కువగా అవసరం ఉన్నట్టుగా తెలుస్తోందని ఆయన చెప్పారు. స్వర్ణ, గ్రామ, వార్డు కార్యాలయాల్లోని సిబ్బంది సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ఆ మేరకు సర్దుబాటు చేసుకునేలా కలెక్టర్లకు అధికారాలిస్తున్నామని బాబు ప్రకటించారు. అలాగే స్వర్ణ వార్డు, గ్రామ సిబ్బంది బదిలీలు సిఫార్సుల ఆధారంగా కాదని, అవసరానికి అనుగుణంగానే బదిలీలు జరగాలని, రేషనలైజేషన్ ప్రకారమే ఈ బదిలీలు ఉండాలని బాబు స్పష్టం చేశారు.
