Begin typing your search above and press return to search.

పీకే టాపిక్ డైవర్షన్ కోసం పీకేని దించిన బాబు...!

ప్రశాంత్ కిశోర్ తో టీడీపీ ఒప్పదం కుదుర్చుకుందని, ఆయన వ్యూహకర్త సేవలను పార్టీ వాడుకుంటోందని ఇపుడు బ్రేకింగ్ న్యూస్ గా ముందుకు తెస్తున్నారు

By:  Tupaki Desk   |   23 Dec 2023 4:47 PM GMT
పీకే టాపిక్ డైవర్షన్ కోసం పీకేని దించిన బాబు...!
X

ఏపీలో పీకే వర్సెస్ పీకేగా కధ మారుతోంది. దానికి స్క్రీన్ ప్లే స్టోరీ అంతా టీడీపీ డైరెక్షన్లోనే అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కి సీఎం యోగం లేదు, ఆయనకు చాన్స్ లేనే లేదంటూ నారా లోకేష్ ఒక మీడియా ఇంటర్యూలో చేసిన హాట్ కామెంట్స్ ఇపుడు జనసేనలో మంట పుట్టించాయి. ప్రత్యేకించి కాపు సామాజిక వర్గం దీని మీద రగులుతోంది.

దాన్ని వెనక్కి తీసుకోవడం అంటే పీకేకి సీఎం పోస్ట్ షేర్ ఇస్తున్నట్లు. అలాగని ఊరుకుంటే పొలిటికల్ గా మంట పెడుతోంది. దాంతో సడెన్ గా మరో పీకేని ముగ్గులోకి దించారు అని అంటున్నారు. ఇది కచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నారు.

ప్రశాంత్ కిశోర్ తో టీడీపీ ఒప్పదం కుదుర్చుకుందని, ఆయన వ్యూహకర్త సేవలను పార్టీ వాడుకుంటోందని ఇపుడు బ్రేకింగ్ న్యూస్ గా ముందుకు తెస్తున్నారు. అంటే పీకే ఇష్యూవే ఇపుడు హైలెట్ కావాలని అదే టైం లో నారా లోకేష్ రాజేసిన అగ్గి ఈ హాట్ టాపిక్ మధ్యన పడి వెనక్కి పోవాలని టీడీపీ మాస్టర్ ప్లాన్ వేసింది అని అంటున్నారు.

లేకపోతే చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో మూడు రోజుల పాటు హోమాలు యాగాలు నిర్వహిస్తున్నారు. ఈ మూడు రోజుల పాటు ఎవరికీ నో అపాయింట్మెంట్ అన్నారు. అన్ని అపాయింట్మెంట్లు రద్దు అని చెప్పారు. అలాంటిది ఇపుడు ప్రశాంత్ కిశోర్ కి అపాయింట్మెంట్ ఇవ్వడమే కాదు మూడు గంటల పాటు ఆయనతో సుదీర్ఘమైన చర్చలు జరపడం అంటే నారా లోకేష్ పెట్టిన చిచ్చుని డైవర్షన్ చేసి ఆర్పేయడం కోసమే అని అంటున్నారు

మరో వైపు చూస్తే కుటుంబం అంతా కూర్చుని యాగంలో ఉండగా లోకేష్ ఢిల్లీ టూర్ పెట్టుకుని మరీ పీకేని తనతో వెంట బెట్టుకుని తేవడం అంతా చూస్తూ ఉంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే అని అంటున్నారు. నిజానికి చూస్తే పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి కాదు అని బహిరంగంగా నోరు జారిన లోకేష్ విషయం టీడీపీ జనసేన బంధాన్ని బదనాం చేసి పారేస్తోంది. ఆ వెంటనే జనసేన గ్రౌండ్ లెవల్ క్యాడర్ లోనే ఈ పొత్తుల మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీనిని డైవర్ట్ చేసే పనులో వెంటనే బీహార్ పీకేని రంగంలోకి చంద్రబాబు దింపారు అని అంటున్నారు.

ఇక వాస్తవానికి చంద్రబాబే సీఎం అభ్యర్థి కానీ అది ప్రజలకు ఎన్నికలు తర్వాతే చెప్పే ప్లాన్ లో అటు చంద్రబాబు ఇటు పవన్ ఉన్నారని అంటున్నారు. కానీ జనసేన క్యాడర్ మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ఉండాలని గట్టిగా కోరుకుంటున్నారు. ఇలా బాబు పవన్ ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

కానీ నారా లోకేష్ నోరు జారడంతో జనసేన కార్యకర్తలు ఇన్ని సంవత్సరాలు పార్టీ కోసం పనిచేశామని ఇపుడు ఇలా చేయడమేంటి అని మండిపోతున్నారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి కాదు అంటే జీర్ణించకోలేక పోతున్నారు. దీనిని సర్దుకునే పరిస్దితుల్లో ప్రశాంత్ కిషోర్ ను దింపి టాపిక్ డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు అని అంటున్నారు.

అందువల్లనే ఇపుడు టీడీపీ దాని అనుకూల మీడియా అంతా కూడా పీకే వ్యూహకర్త టీడీపీకి ఆయన సేవలు అంటూ ఊదరగొడుతున్నారు అని అంటున్నారు. కానీ ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ విషయం టీడీపీ స్పష్టంగా చెప్పాల్సిందే అని అంటున్నారు. ఈసారి జనసైనికులకు వాస్తవాలు తెలిసిపోయాయి కాబట్టి పవన్ ని సీఎం చేస్తామని టీడీపీ చెబితేనే తప్ప వారు మంట చల్లార్చుకోరని అంటున్నారు.

ఇక ప్రశాంత్ కిశోర్ ని తెచ్చామని అంటున్నారు. ఆయన ఎన్నికల వ్యూహకర్త. ఎవరు డబ్బులు ఇచ్చినా సలహాలు ఇస్తారని అంటున్నారు. ఆఖరుకు కే ఏ పాల్ కి కూడా సలహాలు ఇస్తారని అదేమీ గొప్ప విషయమూ కాదు బ్రేకింగ్ షేకింగ్ న్యూస్ అంతకంటే కాదు అని అంటున్నారు

అయినా సరే ఏపీ రాజకీయాలో చూస్తే జనసేన పీకే ఏమీ పీకలేదు, బీహార్ పీకే ఏమి పీకుతారు అని అంటున్నారు. మొత్తానికి టీడీపీ అతి పెద్ద గందరగోళంలో ఉంటూ తప్పు మీద తప్పులు చేసుకుంటూ ముందుకు పోతోంది అని అంటున్నారు.