Begin typing your search above and press return to search.

ఏపీ బ‌డ్జెట్‌పై ప్ర‌భావం చూపించేవి ఇవేనా.. ?

ఏపీ వార్షిక బ‌డ్జెట్‌(2026-27) ను ఈ నెల 14న అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. గ‌త ఏడాది 3.6 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు పూర్తి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టారు.

By:  Garuda Media   |   6 Feb 2026 10:15 PM IST
ఏపీ బ‌డ్జెట్‌పై ప్ర‌భావం చూపించేవి ఇవేనా.. ?
X

ఏపీ వార్షిక బ‌డ్జెట్‌(2026-27) ను ఈ నెల 14న అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. గ‌త ఏడాది 3.6 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు పూర్తి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టారు. దీనిలో వివిధ సంక్షేమ కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాలు.. అదే విధంగా భాషాభివృద్ధి.. సాంస్కృతిక అభివృద్ధికి కూడా నిధులు కేటాయించారు. కానీ, ఈ ద‌ఫా ఇవే కాకుండా అనేక అంశాలు.. బ‌డ్జెట్‌పై ప్ర‌భావం చూపించ‌నున్నాయ‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

1) ద్ర‌వ్య లోటు: ద్ర‌వ్య‌లోటు అంటే.. ఆదాయానికి-చేసే ఖ‌ర్చుల‌కు మ‌ధ్య పొంత‌న లేక‌పోవ‌డం. ఈ వ్య‌వ‌హా రం.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ నెల‌కొంది. ఆమాట కొస్తే కేంద్రాన్ని కూడా ద్ర‌వ్య‌లోటు వెంటాడుతోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర బ‌డ్జెట్లో దవ్య‌లోటును ఎంత‌గా చూపిస్తార‌న్న‌ది చూడాలి. దీని ఆధారంగానే సంక్షేమ ప‌థ‌కాల‌కు కేటాయింపులు జ‌ర‌పాల్సి ఉంటుంది.

2) అప్పులు: ఏ రాష్ట్ర ప్ర‌భుత్వానికైనా ఇప్పుడు అప్పులు త‌ప్ప‌డం లేదు. కేంద్రం కూడా వ‌చ్చే ఆర్థిక సం వత్స‌రం(2026-27)లో 17 ల‌క్షల కోట్ల రూపాయ‌ల‌ను అప్పుగా తీసుకోనున్న‌ట్టు బ‌డ్జెట్లో పేర్కొంది. ఇప్ప‌టికే దేశంలో ఒక్కొక్క‌రి త‌ల‌పైనా 1.34 ల‌క్ష‌ల రూపాయ‌లు అప్పుగా ఉంది. ఇప్పుడు రాష్ట్ర స‌ర్కారు కూడా అప్పులు చేయ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్పంది. దీనినిఎంత గా చూపిస్తార‌న్న‌ది చూడాలి.

3) సంక్షేమ ప‌థ‌కాలు: గ‌త ఏడాదిలోనే ఈ భారం ఎక్కువ‌గా ఉంద‌ని ప్ర‌భుత్వం స్వ‌యంగా పేర్కొంది. ఇప్పుడు సంక్షేమ ప‌థ‌కాలు అవే అయినా.. ల‌బ్ధి దారుల సంఖ్య మాత్రం పెర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో ఏమేరకు సంక్షేమ ప‌థ‌కాల‌కు నిధులు అందిస్తార‌న్న‌ది చూడాలి. గ‌తంలో కంటే కూడా ఇప్పుడు సంక్షేమం మ‌రింత పెరిగిన నేప‌థ్యంలో ఈ ప‌థ‌కాలు.. బ‌డ్జెట్‌పై ప్ర‌భావం చూపించ‌నున్నాయి.

4) మౌలిక స‌దుపాయాలు: ప్ర‌స్తుతం రాష్ట్రంలో మౌలిక స‌దుపాయాల‌ను అభివృద్ధి చేయాల్సి ఉంది. ర‌హ దారుల నుంచి ప్రాజెక్టుల వ‌ర‌కు అనేక మౌలిక స‌దుపాయాల‌కు ఇప్పుడు మాత్ర‌మే అవ‌కాశం ఉంటుంది. వ‌చ్చే ఏడాది బ‌డ్జెట్‌లో దీనిని ప్ర‌ధానంగా ప్ర‌స్తావించాల్సి ఉంటుంది. విద్యుత్ చార్జీల‌ను త‌గ్గిస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతున్న నేప‌థ్యంలో దీని న‌ష్టాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రించాల్సి ఉంటుంది. సో.. మ‌రి ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.