Begin typing your search above and press return to search.

పబ్లిక్ పల్స్ టచ్ చేసిన GOG.. ఊర మాస్

తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ ని ఆవిష్కరించారు. అతని క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ అండ్ మాసివ్ గా ఉండబోతోందని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది.

By:  Tupaki Desk   |   26 May 2024 7:36 AM GMT
పబ్లిక్ పల్స్ టచ్ చేసిన GOG.. ఊర మాస్
X

దాస్ కా దమ్కీ, గామి సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకున్న విశ్వక్ సేన్ మే 31న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కింది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో రాజకీయాలు, రౌడీయిజం కలగలిపిన కథాంశంతో ఈ మూవీ ఉండబోతోందని తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది.

ఈ సినిమా ఇప్పటికే మూడు సార్లు రకరకాల కారణాలతో వాయిదా పడింది. ఫైనల్ గా మే 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. విశ్వక్ సేన్ ఈ సినిమాలో యంగ్ పొలిటికల్ లీడర్ గా నటించాడు. తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ ని ఆవిష్కరించారు. అతని క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ అండ్ మాసివ్ గా ఉండబోతోందని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది.

ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ఒక్కసారిగా గట్టి సౌండ్ చేసిందని చెప్పొచ్చు. సినిమాపై ముందు వరకు ఉన్న కొద్దిపాటి అంచనాలని అమాంతం పెంచేసింది. ఇంటెన్సివ్ స్టోరీ లైన్, అంతకు మించి పవర్ ఫుల్ క్యారెక్టరైజేషన్ తో పవర్ ఫుల్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కథని కృష్ణ చైతన్య ఆవిష్కరించారని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.

కృష్ణ చైతన్య మొదటి చిత్రం రౌడీ ఫెలో తరహాలో ఈ సినిమాలో కూడా మంచి డెప్త్ ఉన్న డైలాగ్స్ ఉన్నాయి. ఇవి మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ట్రైలర్ ప్రస్తుతం యుట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన రెండు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ కి కూడా మాసివ్ రెస్పాన్స్ వస్తోంది. టాలీవుడ్ లో ఒక పవర్ ఫుల్ మాస్ కథాంశంతో మూవీ వచ్చి చాలా కాలం అయ్యింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆ లోటుని భర్తీ చేసేలా ఉందని ట్రైలర్ చూసిన వారు అంటున్నారు.

గోదావరి జిల్లాల నేపథ్యం కూడా ఈ మూవీ కథకి బలంగా పని చేస్తుందని అంటున్నారు. విశ్వక్ సేన్ గోదావరి స్లాంగ్ ని నేర్చుకొని ఈ మూవీలో క్యారెక్టర్ కోసం డబ్బింగ్ చెప్పడం విశేషం. పక్కా మాస్ రోల్ లో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకులని ఎంగేజ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. సినిమా ప్రమోషన్స్, ప్రీరిలీజ్ ఈవెంట్ ద్వారా మరింత ఎక్కువ మందికి ఈ చిత్రాన్ని రీచ్ చేస్తే భారీ ఓపెనింగ్స్ రావొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.