స్టార్ హీరో నత్తి తగ్గించడానికి స్పీచ్ థెరపీ
స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు నత్తి ఉందని ఒప్పుకున్నాడు.
By: Tupaki Desk | 5 May 2025 4:00 AMస్టార్ హీరో హృతిక్ రోషన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు నత్తి ఉందని ఒప్పుకున్నాడు. ఈ సవాల్‌ను అధిగమించడానికి రెగ్యులర్ స్పీచ్ థెరపీ ఎలా సహాయపడిందో వివరించాడు. హృతిక్ సోదరి సునైనా రోషన్ కూడా అతడికి నత్తి ఉందని చెప్పింది. స్పీచ్ క్లాసుల కోసం ఉదయం 4:35 గంటలకు అతడు నిద్ర లేచేవాడని తెలిపింది.
స్కూల్ లో ఉన్నప్పుడు నత్తి సమస్య చాలా చిక్కులు తెచ్చేది. అతడు సాటి విద్యార్థుల నుంచి బెదిరింపుల్ని ఎదుర్కొన్నాడు. అతడు అంతర్ముఖుడు.. నేను బహిర్ముఖిని. కానీ అతడు నత్తిగా మాట్లాడటం ఆపడానికి చాలా ప్రయత్నించాడు. వేకువ ఝామున 4:35 గంటలకు మేల్కొని స్పీచ్ క్లాసులు ప్రాక్టీస్ చేసేవాడు .. నెమ్మదిగా దాని నుండి బయటపడ్డాడు! అని గుర్తు చేసుకుంది.
కుటుంబంలో అనుబంధాలపైనా సునైనా రోషన్ మాట్లాడారు. శుభకార్యాల్లో అందరం కలిసి ఆనందిస్తాము. కానీ మాలో ఎవరికైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మేం ఒక కుటుంబంగా కలిసి పరిష్కరిస్తాము. మేము ఒకరికోసం ఒకరు.. సమస్యల నుంచి బయటపడతాము.. అని తెలిపారు.
తమ్ముడే అయినా కానీ హృతిక్ తనను అన్నయ్యలా చూసుకుంటాడని సునైనా అన్నారు. అతడు ఎప్పుడూ నన్ను అక్కలా భావించలేదని తెలిపారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే...హృతిక్ వార్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. తదుపరి క్రిష్ 4 కి దర్శకుడిగా కూడా మారనున్నాడు.