• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  USA >  హనుమాన్ చాలీసా చదువు...

హనుమాన్ చాలీసా చదువు ట్రంప్ సారూ.. ఇప్పటికైనా భారత్ పై మనసు మార్చుకోవయ్యా..

| దీపావళి వేడుకల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసిన భారతీయ వ్యాపారవేత్త విశాల్ గొండల్ ఆయనకు హనుమాన్ చాలీసా పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇది ధైర్యం, బలం, అపారమైన శక్తికి ప్రతీక అని ట్రంప్‌కు వివరించారు. భారత్‌-అమెరికా సంబంధాల మధ్య ఈ ఆధ్యాత్మిక కానుక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

By - A.N.Kumar
Update: 2026-11-07 04:18 GMT

అన్ని ప్రయత్నాలు చేశాడు.. విద్వేశాలు రెచ్చగొట్టాడు.. భారతీయులపై విషం చిమ్మాడు.. ఇరాన్ పై యుద్ధానికి వెళ్లాడు.. రష్యా, ఉక్రెయిన్ దౌత్యం చేశాడు. అమెరికన్ల మనసు గెలవడానికి కాకుండా తన పైత్యాన్ని అంతా ప్రపంచంపై చూపించాడు. ఫలితం ఏమైంది.. అమెరికాలోనే ధరలు, పెట్రోల్ ధరలు పెరిగి.. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలతో సొంత ప్రజలే ఇబ్బందులు పడి మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఆయనకు కర్రుకాల్చి వాత పెట్టారు. దీంతో ట్రంప్ కు తత్త్వం బోధపడింది. ఇప్పుడు అందరికీ చేరువయ్యే ప్లాన్ చేశారు. పాత గాయాలను మాన్పించి కొత్త పూత పూయడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరంలాగానే ఈసారి కూడా దీపావళి వేడుకలకు ట్రంప్ రెడీ అయ్యారు. కానీ ఈసారి ఒక విశేషం ఉంది. ట్రంప్ కు జ్ఞానబోద కలగాలని కావచ్చు ఆయనకు మన భారతీయ సంతతి వారు ‘హనుమాన్’ చాలీసాను’ బహుమతిగా ఇవ్వడం చర్చనీయాంశమైంది.

అగ్రరాజ్య అధిపతి కావడంతో డొనాల్డ్ ట్రంప్ కు ప్రపంచవ్యాప్తంగా లభించే కానుకలకు కొదువేలేదు. బంగారం తునకలు.. అరుదైన పెయింటింగ్స్, వందల కోట్ల విలువైన కళాఖండాలు ఆయన డ్రాయింగ్ రూమ్ లో కొలువై ఉంటాయి. అయితే తాజాగా భారతీయ వ్యాపారవేత్త విశాల్ గొండల్ ఆయనకు ఇచ్చిన ఓ కానుక ఇప్పుడు ప్రపంచ దౌత్య వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తెగ హాట్ టాపిక్ గా మారింది. అదేంటో తెలుసా? మన మార్కెట్లో సులభంగా దొరికే అత్యంత మహిమాన్వితమైన ‘హనుమాన్ చాలీసా’ ప్రతి.

అవును మీరు విన్నది నిజమే.. దీపావళి వేడుకల సందర్భంగా ట్రంప్ ను కలిసిన విశాల్ గొండల్ తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసాను ఆయన చేతిలో పెట్టి ‘ఇది ధైర్యానికి బలానికి అపారమైన శక్తికి ప్రతీక’ అని వివరించారు. బహుశా ఓడిపోయిన ట్రంప్ కు మన హనుమాన్ చాలీసాతో బలం కలగాలని విశాల్ ఈ పనిచేసినట్టు తెలుస్తోంది. దౌత్య సంబంధాల కోసం హెచ్-1బీ వీసాలు, టారీఫ్‌లు, ట్రేడ్ డీల్స్ అంటూ ఆర్థిక రాజకీయం చేసే కాలంలో.. మనోడు ఏకంగా 'ఆధ్యాత్మిక టచ్' ఇచ్చి దౌత్యానికే కొత్త అర్థం చెప్పారు..

సాధారణంగా అమెరికా అధ్యక్షుడికి ఏమైనా ఇచ్చేముందు పెద్ద పెద్ద కన్సల్టెంట్లు.. దౌత్యవేత్తలు కూర్చుని రీసెర్చ్ చేస్తారు. కానీ గొండల్ గారు మాత్రం "మన హనుమంతుడి కంటే పెద్ద సంకట మోచనుడు ఎవరున్నారు?" అని ఓడిపోయిన ట్రంప్ కు ధైర్యం కావాలంటూ ఇది ఇవ్వాలని డిసైడ్ అయినట్లున్నారు. ట్రంప్ గారి దూకుడు.. ట్వీట్ల స్పీడు.. ఎప్పుడు ఏ దేశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని ఆయన మార్క్ 'అస్థిరత'ను తగ్గించాలంటే హనుమాన్ చాలీసా పఠనమే ఏకైక మార్గమని భావించి ఉంటారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఆడంబరాలు లేకుండా ఒక చిన్న పుస్తకం రూపంలో ఆధ్యాత్మిక భావాన్ని.. భారత్-అమెరికా స్నేహ బంధాన్ని ముడిపెట్టిన ఈ ప్లాన్ భలే కుదిరింది. ఇప్పటికైనా ట్రంప్ తాత ఈ చాలీసా వెనుక ఉన్న 'శక్తి'ని అర్థం చేసుకుని.. భారత్‌తో చెలిమిని మరింత గట్టిగా ముందుకు తీసుకెళ్తారో లేదో చూడాలి..

Tags:    
  • donaldtrump 
  • hanumanchalisa 
  • vishalgondal 
  • diwali 
  • indiausties 

Similar News

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

అమెరికాలో మరో షాక్.. NSA రహస్య నెట్‌వర్క్ కూడా డౌన్!

2026-11-18 06:51 GMT

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ది ఆత్మహత్యా కాదా.? పక్కా ప్లాన్‌తో చేసిన హత్యా? ఫోరెన్సిక్ విశ్లేషణతో సంచలనం

2026-11-17 12:46 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రంప్ తెచ్చిన కొత్త రూల్‌ను కొట్టేసిన కోర్టు!

2026-11-17 10:20 GMT

1.8 లక్షల మంది కోరుతున్నా.. జెన్సన్ హువాంగ్‌ను వెనక్కి తీసుకోని ఎన్విడియా!

2026-11-17 10:01 GMT

అమెరికాలో ఇరాన్ దాడికి ప్లాన్ చేస్తోందా? ట్రంప్ అధికారులకు భద్రత పెంపు!

2026-11-17 05:35 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గింది.. మాస్టర్స్ చదువుపైనే ఎక్కువ ప్రభావం!

2026-11-17 04:38 GMT

అమెరికా విమానాల రద్దు వెనుక అసలు విలన్ ఎవరు? ఆ 4 సెకన్ల కథేంటి?

2026-11-16 18:55 GMT

విమానాలు ఎగరలేదు.. తప్పంతా బైడెన్ దే.. నాది కాదు.. ట్రంప్ మళ్లీ ఏసాడు..

2026-11-16 06:55 GMT

ఎన్ని ఎఫైర్లు పెట్టుకున్నా మళ్లీ జెన్సన్ రావాలి.. ఎన్వీడియో పగ్గాలి చేపట్టాలట.. వైట్ హౌస్ వద్దకు పంచాయితీ..

2026-11-16 04:53 GMT

Copyright @2026

Powered by Blink CMS