వీకెండ్ స్పెషల్.. ఓటీటీ ప్రియులను అలరిస్తున్న మూవీస్.. ఆ 3 చిత్రాలు డోంట్ మిస్!

మరి ఈ వారం ఏ సినిమాలు థియేటర్ల నుండి ఓటీటీలలో ప్రేక్షకులను అలరించబోతున్నాయి.. ఈ వీకెండ్ మస్తీ మజా ఏంటో ఇప్పుడు చూద్దాం.

Update: 2026-08-29 04:43 GMT

వీకెండ్ వచ్చిందంటే చాలు.. చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటారు. అందులో భాగంగానే అటు థియేటర్లలో విడుదలైన ఎన్నో చిత్రాలు ఇటు ఓటీటీలలో.. వివిధ ఫ్లాట్ ఫామ్ లో విడుదలవుతూ ప్రేక్షకుడికి మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. మరి ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి చూడదగిన కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్ లు, ఓటీటీలలోకి వచ్చేసాయి. ప్రత్యేకించి ఆదివారం సెలవు కావడంతో మీకు నచ్చిన జోనర్లో నచ్చిన సినిమా చూసే అవకాశం కల్పించబడింది . మరి ఈ వారం ఏ సినిమాలు థియేటర్ల నుండి ఓటీటీలలో ప్రేక్షకులను అలరించబోతున్నాయి.. ఈ వీకెండ్ మస్తీ మజా ఏంటో ఇప్పుడు చూద్దాం.

నెట్ ఫ్లిక్స్ లో మూవీల సందడి..

అలియా భట్ ఆల్ఫా..

అలియా భట్ , శార్వరీ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆల్ఫా. ఈ వారం బిగ్గెస్ట్ ఓటిటి అట్రాక్షన్ లో ఇది కూడా ఒకటి. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఆగస్టు 28 నుండి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

న్యూటన్స్ థర్డ్ లా..

నెట్ ఫ్లిక్స్ లో ఆల్ఫా తర్వాత ప్రేక్షకులను అలరిస్తున్న మరో చిత్రం న్యూటన్స్ థర్డ్ లా. అక్కినేని సుమంత్ హీరోగా రాజేష్ కర్ణ తెరకెక్కించిన ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చింది. జంట హత్యల చుట్టూ తిరిగే ఈ క్రైమ్ థ్రిల్లర్లో యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, క్రైమ్ అంశాలు మిక్స్ చేశారు. ఇక ఇందులో జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.

ఈ రెండు చిత్రాలతో పాటు ది విస్పర్ మ్యాన్, చుంబక్, మౌస్ ట్రాప్, సీక్రెట్ ఉమెన్, గ్రేవ్ యార్డ్ సీజన్ 3, ఆల్ ద ట్రూత్ ఇన్ మై లైస్, బ్యూటీ ఇన్ బ్లాక్: సీజన్ 3 వంటి చిత్రాలు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చాయి.

జియో హాట్ స్టార్ లో..

ఇకపోతే ఈ వారం జియో హాట్ స్టార్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన చిత్రాలలో ప్రథమంగా చెప్పుకోవాల్సిన చిత్రం ఐ నోబడి. పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతీ తిరువోతు జంటగా నటించిన ఈ చిత్రం జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. నిస్సాం బషీర్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్లో ఊహించని మలుపులు ప్రధాన ఆకర్షణ గా నిలిచాయి.

మరోవైపు ఇద్దరు భిన్నమైన యువతులు రూమ్మేట్స్ గా ఉంటూ పార్ట్ టైం ఉద్యోగులుగా చేస్తూనే స్టార్టప్ ప్రారంభించేందుకు ప్రయత్నించే కథే పార్ట్ టైమర్స్. జియో హాట్ స్టార్ వేదికగా అందుబాటులోకి వచ్చింది

ఇక వీటితోపాటు.. మైఖేల్ కూడా అందుబాటులోకి వచ్చింది.

అమెజాన్ ప్రైమ్ వేదికగా బబితా సింగ్ రిపోర్టింగ్, డైరెక్టర్ కిరణ్ కుమార్ ఆఖరి మూవీ కేజేక్యూ, బెట్టి లా ఫియా సీజన్ 3 వెబ్ సిరీస్ కూడా అందుబాటులోకి వచ్చింది..

అలాగే సోనీ లీవ్ లో అన్బే డయానా, అంకం అత్తహాసం చిత్రాలు అందుబాటులోకి రాగా.. జి ఫైవ్ వేదికగా బందర్ అనే సినిమా స్ట్రీమింగ్ కి వచ్చింది. ఆహా వేదికగా ఆకలి రాజ్యం 2026 సినిమా స్ట్రీమింగ్ కి రావడం గమనార్హం.

Tags:    

Similar News