విరాట్ కోహ్లీపై కుట్ర.. నిజాలు బయటపెట్టిన జర్మన్ మోడల్!
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నారా? అంటే అవుననే అంటోంది జర్మన్ మోడల్ లిజ్‌లాజ్.
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నారా? అంటే అవుననే అంటోంది జర్మన్ మోడల్ లిజ్‌లాజ్. గతంలో కోహ్లీ తన ఫోటోకు లైక్ కొట్టడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిన ఈమె, తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయటపెట్టింది. కోహ్లీ గురించి తప్పుగా మాట్లాడితే భారీగా డబ్బులు ఇస్తామని ఆఫర్ చేశారట. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ ఆఫర్ ఇచ్చింది ఎవరు? ఆ వివరాలు చూద్దాం..
ఆ ఒక్క 'లైక్' తెచ్చిన రచ్చ:
కొన్నాళ్ల క్రితం జర్మన్ మోడల్ లిజ్‌లాజ్ పోస్ట్ చేసిన ఒక హాట్ ఫోటోకు విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ కొట్టారు. ఇంకేముంది, సోషల్ మీడియాలో అది పెద్ద దుమారం రేపింది. వేల సంఖ్యలో మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. చివరకు కోహ్లీ స్పందిస్తూ.. ఇన్‌స్టాగ్రామ్ ఆల్గారిథమ్ లోపం వల్ల అనుకోకుండా ఆ లైక్ పడిందని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. కానీ, ఈ గ్యాప్‌లోనే లిజ్‌లాజ్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది.
డబ్బులు ఇస్తాం.. కోహ్లీని తిట్టండి:
తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ లైక్ ఇష్యూ తర్వాత తనను కొందరు జర్నలిస్టులు సంప్రదించారని తెలిపింది. విరాట్ కోహ్లీ క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడాలని, అతనిపై లేనిపోని ఆరోపణలు చేస్తే భారీగా డబ్బులు ఇస్తామని ఆఫర్ ఇచ్చారట. ఇక కోహ్లీ ఇమేజ్ పాడు చేసేలా స్టేట్‌మెంట్స్ ఇస్తే పాపులారిటీతో పాటు మనీ కూడా వస్తుందని ఆమెను ప్రలోభపెట్టారట.
నా ఫేవరెట్ క్రికెటర్.. అయితే ఆ నీచమైన ఆఫర్‌ను లిజ్‌లాజ్ సున్నితంగా తిరస్కరించింది. "విరాట్ కోహ్లీ నా ఫేవరెట్ క్రికెటర్. నా స్వార్థం కోసం, డబ్బు కోసం ఒక మంచి వ్యక్తి ఇమేజ్‌ను పాడు చేయడం కంటే దారుణం మరొకటి ఉండదు. ఆయన అంటే నాకెంతో గౌరవం ఉంది. అందుకే ఇక ఆ తప్పుడు పనులకు నేను ఒప్పుకోలేదు" అని ఆమె ధైర్యంగా చెప్పింది. లిజ్‌లాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కుట్ర బయటపడిందిలా:
ఈ విషయాన్ని బట్టి చూస్తే, సెలబ్రిటీల ఇమేజ్ పాడు చేయడానికి ఒక వర్గం ఎంతలా ప్రయత్నిస్తుందో అర్థమవుతోంది. కేవలం ఒక పొరపాటుగా పడిన లైక్‌ను అడ్డు పెట్టుకుని, అతని వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూడటం గమనార్హం. కానీ ఇక లిజ్‌లాజ్ నిజాయితీగా ఉండటంతో ఆ కుట్రదారుల ప్లాన్ పారలేదు. దీంతో కోహ్లీ అభిమానులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
డబ్బు కోసం ఏమైనా చేసే ఈ రోజుల్లో, లిజ్‌లాజ్ చూపిన నీతి నిజంగా మెచ్చుకోదగ్గది. ఒక స్టార్ క్రికెటర్‌ను వివాదాల్లోకి నెట్టాలని చూసిన వారి ప్రయత్నం ఫలించలేదు. ఇక మొత్తానికి ఇక విరాట్ కోహ్లీ క్లీన్ ఇమేజ్ మరోసారి సేఫ్ అని తేలిపోయింది.