ఫిఫా ప్రపంచ కప్ 2026: బ్రెజిల్ నిష్క్రమణ.. తవ్వి చూస్తే షాకింగ్ అంశాలెన్నో!

తమ దేశం కాని దేశం ప్రపంచకప్ టోర్నీలో ఓటమి పాలైతే.. తమ దేశ జట్టు ఓడినట్లుగా క్రీడాభిమానులు వేదన చెందే అవకాశం ఉందా? అంటే లేదనే చెబుతారు.

Update: 2026-07-07 05:34 GMT

తమ దేశం కాని దేశం ప్రపంచకప్ టోర్నీలో ఓటమి పాలైతే.. తమ దేశ జట్టు ఓడినట్లుగా క్రీడాభిమానులు వేదన చెందే అవకాశం ఉందా? అంటే లేదనే చెబుతారు. కానీ.. ఫుట్ బాల్ క్రీడలో బ్రెజిల్ జట్టు గురించి మాట్లాడినప్పుడు మాత్రం.. ఈ పోలికకు మినహాయింపుగా చెబుతారు. బ్రెజిల్ జట్టు ఓటమి ప్రపంచ ఫుట్ బాల్ అభిమానులకు అంతులేని శోకం ఎందుకు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఆసక్తికర అంశాలెన్నో కనిపిస్తాయి.

క్రికెట్ తో పోలిస్తే ఫుట్ బాల్ క్రీడకు దేశంలో ఆదరణ ఒక మోస్తరు మాత్రమే. కాకుంటే.. క్రీడాభిమానులు ఫుట్ బాల్ మ్యాచ్ లు పెద్దగా ఫాలో కాకున్నా ఫిఫా ప్రపంచ కప్ టోర్నీవిషయంలో మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు. అనూహ్య రీతిలో.. అందరి అంచనాలకు భిన్నంగా ప్రపంచ ర్యాంకింగ్ లో ఆరో స్థానంలో ఉన్న బ్రెజిల్.. 21వ స్థానంలో ఉండే నార్వే చేతిలో ఓడిపోయింది. అంతేనా.. టోర్నీ ఫేవరేట్ జట్లలో ఒకటై.. క్వార్టర్స్ కు సైతం అర్హత సాధించక తట్టా బుట్టా సర్దుకొని ఇంటికి వెళ్లిపోయిన వైనం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక.. బ్రెజిల్ దేశస్తులకు.. బ్రెజిల్ జట్టును అమితంగా ఆరాధించే అభిమానులకు తాజా ఓటమి శోకం అంతా ఇంతా కాదు.

ఎప్పటిలానే ఈ మ్యాచ్ కు సంబంధించి తెలుగు మీడియాలో వచ్చిన కథనాలు అంతంతే. మహా అయితే.. బ్రెజిల్ ఓటమిపాలైన మ్యాచ్ వివరాల్ని కవర్ చేశారే తప్పించి.. ఎన్నో ఆసక్తికర అంశాల్ని కవర్ చేయలేదు. నార్వే జట్టు చేతిలో బ్రెజిల్ ఎలా ఓడింది? దానికి దారి తీసిన కారణాలు కొన్నింటిని మాత్రమే తెలుగు మీడియాలో కొందరు కవర్ చేశారు. ఈ మ్యాచ్ కాకుండా.. బ్రెజిల్ - నార్వే జట్లు.. వాటి వెనుకున్న అంశాల లోతుల్లోకి వెళితే.. ఆశ్చర్యానికి గురి చేసే అంశాలెన్నో కనిపిస్తాయి. అందుకే.. ఈ ప్రత్యేక అంశాల్ని మా పాఠకుల కోసం ప్రత్యేకంగా ఇస్తున్నాం.

బ్రెజిల్.. బ్రెజిల్.. ఈ జట్టుకు ఎందుకంత క్రేజ్. నార్వే చేతిలో ఓటమిపాలైతే బ్రెజిల్ పౌరులే కాదు.. ఫుట్ బాల్ ను ప్రేమించే ఎంతో మంది తమ సొంత జట్టు ఓడినట్లుగా ఎందుకు ఫీలయ్యారు? అంటే.. దానికి కారణాలు లేకపోలేదు. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో బ్రెజిల్ జట్టు మాత్రమే ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఇప్పటివరకు ఏ దేశ జట్టుకు ఇది సాధ్యం కాలేదు. అంతేనా.. 1930లో మొదలైన మొదటి ప్రపంచ కప్ టోర్నీ నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించి.. ఆడిన ఏకైక దేశం బ్రెజిల్ మాత్రమే.

సాంప్రదాయ పసుపు.. ఆకుపచ్చ జెర్సీతో ఆడే బ్రెజిల్ జట్టు మైదానంలోకి అడుగు పెడితేనే అదో వైబ్ గా చెబుతారు. ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్ లు (114 మ్యాచ్ లు) ఆడిన అరుదైన రికార్డు ఈ జట్టు సొంతం. అంతేనా.. ఆడిన మ్యాచ్ లలో అత్యధిక విజయాలు (76) సాధించిన జట్టుగా మొదటి స్థానం బ్రెజిల్ దే. అంతేనా.. ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక గోల్స్ (237) సాధించిన జట్టుగా నిలిచింది. ప్రపంచ కప్ ఆడిన అన్ని జట్లలో అత్యధిక విన్నింగ్ స్ట్రైక్ రేట్ (66.6శాతం) కూడా బ్రెజిల్ దే. అందుకే.. ఈసారి క్వార్టర్ ఫైనల్ కు చేరుకోకుండానే ఇంటికి వెళ్లిపోవటం ఎంతోమందిని కలిచివేసింది.

ర్యాంకింగ్ లో భారీ వ్యత్యాసం

ప్రపంచ ఫుట్ బాల్ జట్లకు సంబంధించిన ర్యాకింగ్స్ లో బ్రెజిల్ ఆరో స్థానంలో నిలిస్తే.. నార్వే 21వ స్థానంలో ఉంది. వాస్తవానికి కొన్ని నెలల క్రితం ర్యాంకుల్లో మరింత తక్కువగా ఉండేది. అయితే.. ఇటీవల కాలంలో నార్వే జట్టులోని స్టార్ ఆటగాళ్లు ఎర్లింగ్ హాలాండ్.. మార్టిన్ ఒడెగార్డ్ లాంటి ఆటగాళ్ల ఫుణ్యమా అని నాకౌట్ పోరుకు ముందున్న దాని కంటే పది ర్యాంకులు ముందుకు వచ్చింది.

చాలామందికి తెలియని విచిత్రమైన రికార్డు

ఇప్పుడు చెప్పే అంశం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసింది. ఫుట్ బాల్ చరిత్రలోనే దీన్నో సిత్రమైన రికార్డుగా చెబుతారు. అంతర్జాతీయ ఫుట్ బాల్ లో బ్రెజిల్ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా (స్నేహపూర్వక మ్యాచ్ లతో కలిపి) ఓడించలేకపోయిన ఏకైక జట్టు నార్వే మాత్రమే.

ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 5 అంతర్జాతీయ (పురుషుల) మ్యాచ్ లు జరిగాయి. అందులో నార్వే మూడింట్లో గెలిస్తే.. రెండింటిలో డ్రాగా ముగిశాయి. ఓటమిపాలైన మూడు మ్యాచ్ లలో 1998లో జరిగిన ప్రపంచ కప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ కూడా ఉంది. ఇప్పటిలానే అప్పుడు కూడా నార్వే 2-1 తేడాతో బ్రెజిల్ ను ఓడించింది.

రెండుసార్లు ప్రపంచ కప్ టోర్నీలే

బ్రెజిల్ జట్టును రెండుసరా్లు ఓడించింది ప్రపంచ కప్ టోర్నీలో కావటం ఒక ఎత్తు అయితే.. రెండు సందర్భాల్లోనే ఒకటే స్కోర్ (2-1) తేడా గోల్స తోనే ఓటమిపాలైంది. తాజా మ్యాచ్ లో ఎర్లింగ్ హాలాండ్ చేసిన రెండు మెరుపు గోల్స్ నార్వేకు అద్భుతమైన విజయం సొంతమయ్యేలా చేసింది. ఎర్లింగ్ హాలాండ్ చేసిన రెండు గోల్స్ లో రెండో గోల్ 90వ నిమిషంలో సాధించటం గమనార్హం.

20 ఏళ్లుగా తలపడని ఇరు జట్లు

1998 ప్రపంచ కప్ తర్వాత నార్వే జట్టు 2026 ముందు వరకు ప్రపంచ కప్ టోర్నీలో ఆడే అర్హతను సాధించలేదు. 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈసారి ప్రపంచ కప్ టోర్నీలో ఆడేందుకు అర్హత సాధించారు. ప్రపంచ కప్ టోర్నీ కాకుండా స్నేహపూర్వక మ్యాచ్ లలో మాత్రమే ఇరు జట్లు తలపడే వీలుంది. అయితే.. గడిచిన 20 ఏళ్లుగా ఈ రెండు జట్ల మధ్య ముఖాముఖి పోరు జరగలేదు.

బ్రెజిల్ కొంప ముంచిన ఆ బలహీనత

బ్రెజిల్ జట్టకు ఎక్కువగా చిన్న పాస్ లు.. వేగవంతమైన స్కిల్స్ తో ఆట ఆడుతుంది. సింఫుల్ గా చెప్పాలంటే.. జింగా స్టైల్ లో. అందుకు భిన్నంగా నార్వే జట్టు ఆట తీరు ఉంటుంది. నార్వే ఆటగాళ్లు శారీరకంగా చాలా బలంగా ఉంటూ.. లాంగ్ బాల్స్ (పొడవాటి పాస్ లు) ఆడుతూ.. డిఫెన్స్ ను నమ్ముకునే గేమ్ ప్లాన్ అమలు చేసింది. యూరోపియన్ డిఫెన్స్ వ్యవస్థను ఛేదించే విషయంలో బ్రెజిల్ జట్టుకు పెద్ద కష్టమనే చెప్పాలి. దీనికి తోడు ఈసారి నార్వే జట్టులో ఎర్లింగ్ హాలాండ్ అనే ఓ పెద్ద గోల్ మెషిన్ ఫుల్ యాక్టివ్ గా ఉంది. బ్రెజిల్ జట్టు వ్యూహాల్ని దారుణంగా దెబ్బ తీసింది.

బ్రెజిల్ ప్రాణానికి నార్వే లాంటిదే మరొకటి

ఇప్పటివరకు అంతర్జాతీయ ఫుట్ బాల్ చరిత్రలో బ్రెజిల్ జట్టు ఇప్పటివరకు 88 దేశాలతో తలపడింది. అందులో వారు ఓడించలేని జట్లు రెండే ఉన్నాయి. అందులో ఒకటి నార్వే అయితే.. మరొకటి సెనెగల్. ఆఫ్రికా ఖండానికి చెందిన ఈ జట్టును ఇప్పటివరకు ఓడించలేకపోయింది. వీరిద్దరి మధ్య రెండు మ్యాచ్ లు జరిగితే.. ఒకటి డ్రా అయితే.. రెండో మ్యాచ్ (2023)లో బ్రెజిల్ ఓటమిపాలైంది. ప్రపంచ ఫుట్ బాల్ ను శాసించే బ్రెజిల్.. ఈ రెండు జట్ల మీద గెలవకపోవటాన్ని ఒక శాపంగా అభివర్ణిస్తారు.

Tags:    

Similar News