సాకర్ స్టార్‌తో టెన్నిస్ భామ హాట్ రొమాన్స్

Update: 2015-06-27 11:48 GMT
అనా ఇవనోవిచ్.. మోస్ట్ గ్లామరస్ టెన్నిస్ సుందరాంగుల్లో ఒకరు. ష్వీన్ స్టీగర్.. గత ఏడాది సాకర్ ప్రపంచకప్ గెలిచిన జర్మనీ ఫుట్ బాల్ జట్టులో స్టార్ ఆటగాడు. వీళ్లిద్దరి ఆటలు వేరు.. దేశాలు వేరు. కానీ ఎక్కడ కలిశారో.. ఎలా కలిశారో కానీ.. సడెన్‌గా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేశారు. ఊరికే తిరిగేయడమే కాదు.. వీరలెవెల్లో రొమాన్స్ చేసేస్తూ మీడియా వాళ్ల కంటపడ్డారు. ఎలాగూ వ్యవహారం బయటపడిపోయింది కదా అని ఇద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకున్నట్లు సమాచారం.

ఇవనోవిచ్‌కు ఎఫైర్లు కొత్తేం కాదు. ఇప్పటికే ముగ్గురు నలుగురితో రొమాన్స్ చేసింది. ఇక ఫుట్‌బాల్ స్టార్లకు కూడా గర్ల్‌ఫ్రెండ్లను మార్చడం మామూలే. ష్వీన్‌స్టీగర్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి ప్రేమాయణం టైంపాస్ వ్యవహారమే అనుకున్నారు జనాలు. కానీ ష్వీన్ స్టీగర్ తన ఫుట్‌బాల్ కెరీర్ వదిలేసి మరి ఇవనోవిచ్ వెంటే తిరుగుతున్నాడు. పోయిన నెలలో ఇవనోవిచ్ పారిస్‌లో ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతుంటే.. ప్రతి మ్యాచ్‌కూ వచ్చాడు ష్వీన్ స్టీగర్. ఇప్పుడు వింబుల్డన్ మొదలవుతుంటే అక్కడికీ తయారయ్యాడు. ప్రాక్టీస్‌లో అతడే, వింబుల్డన్‌ పార్టీలో అతడే.. ఇలా ఇవనోవిచ్‌ ఎక్కడ కనిపిస్తే అక్కడ అతనూ కనిపిస్తున్నాడు. అన్నట్లు వింబుల్డన్ పార్టీలో ఇవనోవిచ్ ష్వీన్ స్టీగర్ వెంట వస్తూ ఓ రింగు కూడా తొడుక్కుంది. ఆ రింగు          వాళ్లిద్దరి ఎంగేజ్మెంట్ గుర్తుగా పెట్టుకున్నదే అని సమాచారం.
Tags:    

Similar News