• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అన్నకు తగ్గ చెల్లెలు.....

అన్నకు తగ్గ చెల్లెలు.. జగన్ విడిచిన బాణం ‘షర్మిల’

By - Tupaki Desk
Update: 2020-12-17 05:23 GMT
ప్రతి మొగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందంటారు. ఏపీలో ఒంటరిగా బరిలోకి దిగి ఏకంగా 151 ఎమ్మెల్యే సీట్లు,, 22 ఎంపీ సీట్లు, 51శాతం ఓట్ల శాతం పొంది.. 2019 ఏపీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన సీఎం జగన్ వెనుక ఎవరున్నారు? ఆయనను నడిపించింది ఎవరు? ఆయన వెనుకున్నది ఎవరు అన్నది తరిచిచూస్తే ఆయన కుటుంబమే కనిపిస్తుంది. సీఎం జగన్ వెనుక స్త్రీ శక్తి స్వరూపాలున్నాయి.  వాళ్లు ఎవరు? ఆ శక్తి ఎమిటో చూద్దాం..

స్త్రీ శక్తి స్వరూపం, స్త్రీ స్పష్టికి మూలం, స్త్రీ జన్మ అపురూపం, పరమశివునిలో అర్థభాగం స్త్రీ, ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందనే మాట  తరచుగా అంటారు. సీఎం జగన్ విజయం వెనుక ముగ్గురు స్త్రీలు ఉన్నారు. జగన్ సీఎం కావడం వెనుక ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళ, సతీమణి భారతి పాత్ర ఎంతో ఉందని అందరికి తెలిసిన విషయమే. 2014 ఎన్నికల్లో 67 సీట్ల గెలిచిన జగన్ ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. ముఖ్యమంత్రి కాకముందు జగన్ రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అన్ని కష్టాలు అనుభవించి ఇప్పుడు సీఎంగా విజయతీరాలకు చేరడం వెనుక ఆ వెనుకున్నది ఆ ముగ్గురే కావడం విశేషం.

జగన్ సంతోషాల్లో... బాధల్లో ఆయన తల్లి, చెల్లి, సతీమణి అండగా ఉన్నారు. అందరికంటే ఎక్కువగా జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలబడి.. పార్టీని చెదిరిపోకుండా నిలబెట్టి.. పాదయాత్రతో ప్రజలకు చేరువై వైసీపీకి నేనున్నానంటూ జగన్ చెల్లెలు షర్మిల ముందు నిలిచారు. ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రచారం చేసి రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడానికి తమ వంతు కృషి చేశారు.  వైఎస్ జగన్ ను కుట్రపన్ని ప్రత్యర్థులు జైల్లో ఇరికించిన వేళ పార్టీకి అన్నీ తానై షర్మిల వ్యవహరించారు. అన్నకు తగ్గ చెల్లిగా.. జగన్ ‘వదిలిన బాణం’గా షర్మిల నిలిచింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి.. పార్టీని బతికించింది. పార్టీ కోసం జగన్ లేనప్పుడు ప్రచార బాధ్యతను, పార్టీని నడిపించింది షర్మిలే..  షర్మిల మాటలు తూటాల్లా పేలాయి. 2019 ఎన్నికల్లో ‘బైబై బాబు’ అన్న షర్మిల పిలుపుకు విశేష స్పందన వచ్చింది.

షర్మిల ప్రచారంలో లోకేష్ ను, చంద్రబాబును చెడుగుడు ఆడిన తీరును ఇప్పటికీ మరిచిపోరు. లోకేష్ బాబును ‘పప్పు’ అన్న షర్మిల మాటలు నాడు సోషల్ మీడియాలో, మీడియాలో వైరల్ అయ్యాయి. వైసీపీ ప్రచారానికి గొప్ప ఊపును.. పంచ్ డైలాగులను అద్దింది.. ప్రచారంలో పాపులర్ చేసింది  షర్మిలనే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

2012లో  జగన్ అరెస్టు అయ్యారు. దీంతో నాడు వచ్చిన ఉప ఎన్నిక ప్రచారానికై పార్టీ అభ్యర్థి కొండ సురేఖ తరుపున షర్మిల ప్రచారంలో పాల్గొని సత్తా చాటారు.. పార్టీ శ్రేణుల్లో ఉత్యాహం నింపి పార్టీ బలోపేతం చేయడానికి  మరో ‘ప్రజా ప్రస్థానం’ పేరు మీద పాదయాత్రను  18 అక్టొబరు 2012న ప్రారంభించారు. ఈ పాదయాత్ర 16 జిల్లాలమీదుగా సాగింది. యాత్ర దూరం 3000 కి.మీ. తన పాదయాత్రను, తనతండ్రి దివంగత రాజశేఖరురెడ్డి సమాధి (ఇడుపుల పాయ) నుంచి షర్మిల ప్రారంభించడం విశేషం..
 
ఇప్పుడు వచ్చిన వైసీపీ గెలుపు గాలివాటం కాదు.. అందులో జగన్ కష్టం ఉంది. ఆయన పడిన శ్రమ ఉంది. అన్న జగన్ లేనప్పుడు పార్టీని బతికించిన చెల్లెలు షర్మిల మనోధైర్యం ఉంది. అందుకే అన్నకు తగ్గ చెల్లెలుగా షర్మిల ఇప్పుడు వైసీపీ విజయంలోనూ ఓ తూరుపుముక్క.. అన్న గెలుపులో ఒక అలుపెరగని యోధురాలు షర్మిల అనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘షర్మిల బర్త్ డే’’ సందర్భంగా ఆమె చేసిన త్యాగాలను.. ఆమె పార్టీ కోసం పాటుపడిన జ్ఞాపకాలను వైసీపీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నారు. షర్మిలకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Tags:    
  • YSRCP Leaders 
  • YS Sharmila 
  • Birthday 
  • Telugu News 
  • AP Politics 
  • AP Political News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS