• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జగన్ శాశ్వత అధ్యక్షుడు :...

జగన్ శాశ్వత అధ్యక్షుడు : కేంద్ర ఎన్నికల సంఘం ఏమంటుంది...?

By - Tupaki Desk
Update: 2022-07-09 15:06 GMT
ఏ పార్టీకైనా సొంతంగా రాజ్యాంగం ఉంటుంది. దాని ప్రకారం వారు పదవులు ఇచ్చుకుంటూ ఉండవచ్చు. అలాగే వాటి కాల పరిమితిని కూడా సొంతంగా నిబంధలన మేరకు పెట్టుకోవచ్చు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధలను కొన్ని ఉంటాయి. అక్కడ రిజిష్టర్ అయిన పార్టీలు వాటి ప్రకారమే నడచుకోవాల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే ముచ్చటగా మూడవసారి జరిగిన వైసీపీ ప్లీనరీలో హైలెట్ ఏంటి అంటే జగన్ని ఆ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా చేస్తూ తీర్మానించడం. అంటే ఇక మీదట వైసీపీలో ఎన్నికలు అన్నవే ఉండవు. ప్రెసిడెంట్ గా జీవితకాలానికి జగనే ఉంటారు.

ఈ విధంగా పార్టీ రాజ్యాంగాన్ని మార్చి మరీ వైసీపీ జగన్ని ఎన్నుకుంది. జగనే వైసీపీ అని వేరేగా చెప్పాల్సింది లేదు కానీ ఈ తీర్మానంతో అది ఇంకా బలపడింది. నిజానికి ఎన్నికల సంఘం వద్ద రిజిష్టర్ అయిన పార్టీలు నిబంధలను పక్కాగా  అనుసరించాలి. క్రమం తప్పకుండా సంస్థాగత ఎన్నికలు అధ్యక్ష స్థానం నుంచి దిగువ దాకా నిర్వహించాలి.

అలాగే పార్టీ అజెండాతో పాటు, సమావేశాల నిర్వహణ, ఖర్చులు, విరాళాలు ఇలా అన్నీ కూడా ఎప్పటికపుడు తెలియచేయాల్సి ఉంటుంది. ఇపుడు దేశంలో ఉన్న అన్ని పార్టీలు అధినాయకులను ఎన్నుకునేటపుడు లాంచనంగా ఎన్నికలు అని ఒక తతంగాన్ని నిర్వహిస్తాయి. సాధారణంగా ఇదంతా ముందే ఒక మాట అనుకుని ఆ మేరకే జరిగిపోతుంది.

కానీ ప్రజాస్వామ్య స్పూర్తి కోసం అలా చేస్తారు. మహానాడు వేదికగా టీడీపీ అధ్యక్షుడిని ఎపుడూ ఎన్నుకుంటుంది. అలాగే ఇతర పార్టీలలో ఇదే విధానం ఉంది. అయితే వైసీపీ మాత్రం శాశ్వత అధ్యక్షుడు అన్న కొత్త ప్రతిపాదన తెచ్చింది. దానికి వారి పార్టీ వారే కాబట్టి జై కొట్టేశారు.

జగన్ లైఫ్ టైమ్ ప్రెసిడెంట్ కూడా అయిపోయారు. అంతా బాగానే ఉన్నా దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం ఎలా రియాక్ట్ అవుతుంది అన్నదే ఇక్కడ ఉత్కంఠ. అయితే పొరుగున ఉన్న తమిళనాడులో డీఎంకే శాశ్వత అధ్యక్షుడిగా కరుణానిధిని ఎన్నుకున్నారు. దాని మీద ఎన్నికల సంఘానికి తమ నిర్ణయాన్ని తెలియచేస్తే ఆమోదముద్ర వేసింది అని అంటున్నారు.

ఇపుడు డీఎంకే కేసునే ఉదహరణగా తీసుకుని జగన్ కూడా శాశ్వత ప్రెసిడెంట్ అయిపోయారు. కరుణానిధి ఎన్నికను నాడు ఆమోదించారు కాబట్టి తనకు కూడా ఇబ్బంది లేదని వైసీపీ భావిస్తోంది. మరి దీని మీద ఎన్నికల సంఘం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇదిలా ఉంటే 2011 మార్చిలో ఆవిర్భవించిన వైసీపీకి జగన్ అధ్యక్షుడిగా, తల్లి విజయమ్మ గౌరవ అధ్యక్షుడిగా ఈ రోజు దాకా ఉన్నారు. ఇపుడు విజయమ్మ రాజీనామా చేయడం, జగన్ శాశ్వత అధ్యక్షుడు కావడం వైసీపీలో సరికొత్త పరిణామం. వైసీపీకి ముందు జగన్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ఆ పార్టీకి ఆయన రాజీనామా చేసి సొంతంగా పార్టీని స్థాపించారు. అది జనాదరణను పొంది ఈ రోజు అధికారంలో ఉంది.
Tags:    
  • Ysjaganelected 
  • ysrcp 
  • president 
  • lifetime 
  • appolitics 
  • latestnews 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS