జగన్ క్యూలో వీళ్లే.. ఏమిస్తారు.?

Update: 2019-07-31 04:32 GMT
అఖండ మెజార్టీతో ఏపీ గద్దెనెక్కిన జగన్ ను ఇప్పటికీ టాలీవుడ్ పెద్దలు సీఎంగా గుర్తించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల వేళ టీడీపీతో పోలిస్తే వైసీపీకి మద్దతిచ్చింది చాలా తక్కువ మంది టాలీవుడ్ ప్రముఖులే. మరి ఇప్పుడు గెలిచిన  రెండు నెలలలోపే జగన్ కీలకమైన నామినేటెడ్ పోస్టుల్లో వైసీపీ కోసం పాటుపడ్డ ఫృథ్వీ- అలీకి కీలక పదవులు కట్టబెట్టారు.  మరీ వీరితోపాటు జగన్ కు మద్దతుగా నిలిచి పోరాడిన  పోసాని- జయసుధ- మోహన్ బాబు- జీవితా రాజశేఖర్- కృష్ణుడు- జోగినాయుడులను జగన్ ఎలా సంతృప్తి పరుస్తారు? వారికి ఎలాంటి పదవులు ఇస్తారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది.

వైసీపీకి ఎన్నికలకు చాలా రోజుల ముందే జై కొట్టి కీరోల్ పోషించిన నటుడు ఫృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చి సత్కరించారు జగన్. ఇక ఎన్నికల ముందరే వైసీపీలో చేరిన అలీకి ఎఫ్.డీ.సీ చైర్మన్ పదవిని ఖాయం చేశారంటున్నారు. మరి మిగిలిన వారి సంగతేంటన్న ప్రశ్న తలెత్తుతోంది.

మోహన్ బాబు- పోసాని- జీవితా రాజశేఖర్ లు టీడీపీపై ఉవ్వెత్తున లేచి ఎండగట్టారు. ఇలాంటి ప్రముఖులకు చిన్న పదవులు ఇస్తే నొచ్చుకునే అవకాశాలున్నాయి. వారికి స్థాయికి తగ్గ పదవులే ఇవ్వాలి. లేదంటే తేడా కొడుతుంది.ఇప్పటికే టాలీవుడ్ పెద్దలు జగన్ ను సీఎంగా గుర్తించడం లేదు.

వైసీపీకి మద్దతుగా నిలిచిన సీనియర్ నటుడు మోహన్ బాబు లాంటి వాళ్లకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశాలున్నాయనే చర్చ సాగుతోంది. ఇక జీవితారాజశేఖర్- పోసానిలకు కూడా కీలక పదవులతోనే సంతృప్తి పరచాల్సి ఉంటుంది. మరి జగన్ వీరి విషయంలో ఎలా ముందుకెళ్తారు.? ఎలాంటి పదవులు ఇస్తారనే చర్చ సాగుతోంది.  


Tags:    

Similar News