స‌రైన స‌ల‌హాదారులు ఉంటే జ‌గ‌న్ ఐడియాలు బూమ‌రాంగ్ కావా..!

Update: 2021-12-08 02:30 GMT
ఏపీలో జ‌గ‌న్ తీసుకుంటోన్న కొన్ని నిర్ణ‌యాలు అస‌లు స్పృహ‌లో ఉండే తీసుకుంటున్నారా ? అన్న సందేహాలు క‌ల‌గ‌క మాన‌వు. అస‌లు జ‌గ‌న్ ఏం చేస్తున్నారో ?  కూడా అర్థం కావ‌డం లేద‌ని సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పాటు వైసీపీ వీరాభిమానులు కూడా చెపుతున్నారు. మా వోడికి ఒక్క‌సారి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తాడ‌ని.. మ‌రో ప‌దేళ్లు అస‌లు వెన‌క్కు తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా చేస్తాడ‌ని అనుకున్నామ‌ని.. అయితే ఇప్పుడు పాల‌న జ‌రుగుతోన్న తీరు చూస్తుంటే ఏం జ‌రుగుతుందో ?  అస‌లు రాష్ట్రాన్ని ఎటు వైపున‌కు తీసుకు వెళుతున్నారో ?  మాకే అర్థం కావ‌డం లేద‌ని వారు గొణుక్కుంటున్నారు.

అస‌లు జ‌గ‌న్ ఎవ్వ‌రి మాట విన‌రు. ఏం చెప్పినా ప‌ట్టించుకోరు. ఆయ‌న ఏం చెపితే అదే వేదం. ఇక ఒక‌రిద్ద‌రు ఆయ‌న‌కు స‌న్నిహితంగా ఉండి కూడా ఆయ‌న‌కు భ‌జ‌న చేస్తూ ఆయ‌న్ను త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. తాజాగా ఏపీలో వేసే ప్ర‌తి రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్‌లో 5 %  భూమి లేదా దానికి స‌మాన‌మైన డ‌బ్బులు ప్ర‌భుత్వానికి చెల్లించాలంటూ బ‌య‌ట‌కు వ‌చ్చిన జీవో చూశాక జ‌నాల‌కు పిచ్చెక్కిపోయిన‌ట్ల‌య్యింది. అస‌లు ఈ ఆలోచ‌న‌లు జ‌గ‌న్‌కే వ‌స్తున్నాయా ?  లేదా ఆయ‌న ప‌క్క‌న ఉన్న వారు ఇస్తున్నారా ? అన్న‌ది అర్థం కావ‌డం లేదు.

అయితే జ‌గ‌న్‌కు స‌రైన ఆలోచ‌న లేద‌ని చెప్ప‌డానికి కూడా వీలులేదు. జ‌గ‌న్ అధికారంలోకి తీసుకు వ‌చ్చాక చాలా స‌మ‌ర్థ‌వంత‌మైన పథ‌కాల‌తో ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకుపోయారు. గ్రామ స‌చివాల‌యాల‌తో పాల‌న ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌రైంది. వ‌లంటీర్ల‌తోనే చాలా వ‌ర‌కు ప‌నులు జ‌రిగిపోతున్నాయి. ప్ర‌జ‌ల‌కు స‌మ‌యం మ‌రింత‌గా క‌లిసి వ‌చ్చింది. ఇక ఇప్పుడు జ‌గ‌న్ చుట్టూ స‌ల‌హాదారులు కుప్ప‌లు కుప్పులుగా ఉన్నారు. అయితే వీరంతా ప్ర‌జాక్షేత్రంలో ఉండే వారు కాదు.. వీరికి ప్ర‌జ‌ల‌తో సంబంధం కూడా లేదు.

వీళ్ల‌లో ఎక్కువ మంది హైద‌రాబాద్‌, ఢిల్లీ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేసేవారే. అస‌లు జ‌గ‌న్‌తో వీరికి ఒక్క మీటింగ్ కూడా లేని ప‌రిస్థితి. అస‌లు ప్ర‌జ‌లు ఎలాంటి ఇబ్బందులు ప‌డుతున్నారు ?  వారిలో ప్ర‌భుత్వం ప‌ట్ల ఎలాంటి అసంతృప్తి ఉంద‌న్న ఆలోచ‌న ఒక్క‌రికి కూడా లేదు. దీంతో ఎవ‌రో ఒక‌రిద్ద‌రు డిజైన్ చేసే ప్రోగ్రామ్ లేదా సీఎం ఏం అనుకుంటే అదే అమ‌లు చేసేస్తున్నారు. అస‌లు మంచి ఏంటి ?  చెడ్డ ఏంట‌న్న‌ది మాత్రం ఎవ్వ‌రికి ప‌ట్టడం లేదు. దీంతో జ‌గ‌న్ ఎన్ని మంచి ఆలోచ‌న‌లు చేసినా స‌రైన మార్గ‌ద‌ర్శ‌క‌త్వం లేక అవి చాలా వ‌ర‌కు బూమ‌రాంగ్ అవుతున్నాయి.
Tags:    

Similar News