ఆ ముగ్గురు తర్వాత తక్కువ పీఆర్సీ ఇచ్చింది జగనేనట!
గడిచిన కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగుల మధ్య హాట్ టాపిక్ గా మారిన పీఆర్సీ ఇష్యూకు చెల్లుచీటి ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ అయిన 35 శాతం పీఆర్సీ స్థానే.. జగన్ మాత్రం23.29 శాతానికి పరిమితమయ్యారు. ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం మరింత తక్కువ ఇవ్వాల్సి ఉంటుందని.. కానీ తన చేతికి ఎముక ఉండదని అందరూ అంటుంటారని.. అందుకే తాను నివేదికలో దాని కంటే ఎక్కువే ఇస్తానని ప్రకటించారు. అదే సమయంలో.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతల్ని అనునయించారు.
మొత్తంగా అధికారులు చెప్పిన దాని కంటే కాస్త ఎక్కువ పీఆర్సీ ఇవ్వటం ద్వారా.. ఈ ఇష్యూకు ముగింపు పలికారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన పీఆర్సీ ప్రకటనపై పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గడిచని ముప్ఫై ఏళ్లలో ఇంత తక్కువగా పీఆర్సీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని చెబుతున్నారు. ఏదో మాట వరసకు కాకుండా.. పాత లెక్కల్ని బయటకు తీసి మరీ చూపిస్తున్నారు.
అప్పట్లో ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన ఎన్టీఆర్.. కోట్ల విజయభాస్కర్ రెడ్డి తర్వాత అత్యంత తక్కువ పీఆర్సీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా చెబుతున్నారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని మాటలు చెప్పే జగన్.. ఏపీలో పీఆర్సీ ఇచ్చిన ముఖ్యమంత్రుల్లో అతి తక్కువ ఇచ్చిన ముగ్గురి తర్వాతి స్థానంలో నిలవటం విశేషం. 1986లో ఎన్టీఆర్ 10 శాతం పీఆర్సీ ఇస్తే.. తర్వాతి కాలంలో పీఆర్సీ ఇచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి సైతం 10 శాతమే ఇచ్చారు. 1999లో చంద్రబాబు 25 శాతం పీఆర్సీ ఇస్తే.. ఆ తర్వాతి కాలంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు కంటే తక్కువగా 16 శాతం పీఆర్సీ ఇవ్వటం గమనార్హం.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. లెక్కల మాష్టారిగా.. ఏదైనా వరం ఇవ్వాలన్నా.. హామీ ఇవ్వాలన్నా సవాలక్ష ఆలోచించే రోశయ్య.. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులకు ఇచ్చిన పీఆర్సీ.. ప్రత్యేకంగా చెప్పాలి. ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే రోశయ్య.. అప్పటివరకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారు ప్రకటించిన పీఆర్సీ కంటే ఎక్కువగా.. అత్యధికంగా ఇచ్చిన ఘనత రోశయ్యదని చెప్పాలి. 2010లో 39 శాతం పీఆర్సీని ఇచ్చారు. తర్వాత రాష్ట్ర విభజన జరగటం.. పీఆర్సీ ఇచ్చే విషయంలో తెలంగాణ రాష్ట్రంతో పోలిక రావటంతో చంద్రబాబు ఎంత ఇస్తారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.
అందరి అంచనాలకు భిన్నంగా 2015లో చంద్రబాబు.. 43 శాతం పీఆర్సీని ప్రకటించి.. ఆల్ టైం రికార్డునుక్రియేట్ చేశారు. ఇంత భారీగా పీఆర్సీ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిచారు. తాజాగా పీఆర్సీని ప్రకటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 23.29 శాతం పీఆర్సీని ప్రకటించారు. చేతికి ఎముక లేకుండా వ్యవహరిస్తాననే జగన్.. ఇప్పటివరకు తక్కువ పీఆర్సీ ఇచ్చిన ముగ్గురు ముఖ్యమంత్రుల సరసన నిలవటం విశేషం.