వైఎస్సార్సీపీ సోషల్ మీడియా టీమ్ కు సీఎం జగన్ ఆదేశాలు!

Update: 2019-08-03 06:55 GMT
తెలుగుదేశం పార్టీ వాళ్లు సోషల్ మీడియానే నమ్ముకున్నట్టుగా ఉన్నారు. తమ సొంత మీడియా ఒకవైపు వర్క్ చేస్తూ ఉండగా.. తెలుగుదేశం పార్టీ వాళ్లు సోషల్ మీడియాలో కూడా యాక్టివిటీస్ పెంచారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా బద్నాం చేయడానికి వారు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు.

ఇక తెలుగుదేశం పార్టీ నేతలు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. తమకు తమ ఫాలోయర్ల నుంచినే కౌంటర్లు పడుతున్నా వారు వెనక్కు తగ్గడం లేదు. నారా లోకేష్ మొదటి నుంచి ట్విటర్ నే నమ్ముకున్నారు. ట్విటర్ కే పరిమితం అయ్యారు. ఇక కేశినేని నాని, బుద్ధా వెంకన్న లాంటి  వాళ్లు కూడా ఇప్పుడిప్పుడు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు.

వీరంతా కలిసి తమ డొల్లతనం సంగతెలా ఉన్నా, జగన్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నాలు అయితే సాగిస్తూ ఉన్నారు.  ఇలాంటి నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంపై స్పందించాలని ఫిక్స్ అయ్యిందట.

స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్  రెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని, తెలుగుదేశం పార్టీకి కౌంటర్ ఇవ్వాలని ఆదేశించినట్టుగా సమాచారం. ఎన్నికల తర్వాత పార్టీ సోషల్ మీడియా ను పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. ఇలాంటి నేఫథ్యంలో మళ్లీ యాక్టివేట్ కావాలని అంటూ జగన్ మోహన్ రెడ్డి  వారిని ఆదేశించినట్టుగా సమాచారం. మరి జగన్ ఆదేశాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఎంత వరకూ పాటిస్తాయో చూడాలిక!


Tags:    

Similar News