ఫోర్బ్స్‌ జాబితాలో నల్లగొండ యువకుడు !

Update: 2020-12-04 06:45 GMT
ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ జాబితాలో నల్గొండ కుర్రాడు కోణం సందీప్ కు స్థానం దక్కింది. ఆరోగ్య సంరక్షణ విభాగంలో విశేషమైన కృషి చేసినందుకు గాను సందీప్ కి ఈ  గుర్తింపు లభించింది. ఈ విభాగంలో ఫోర్బ్స్ రూపొందించిన 30 అండర్ 30 జాబితాలో సందీప్‌ పేరును చేర్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్   ఆధారంగా పనిచేసే మొబైల్ యాప్‌ ను రూపొందించినందుకు గాను సందీప్‌కు ఈ అరుదైన అవకాశం  లభించింది. ఇతర దేశాల్లోని వైద్యులు ఇచ్చే సూచనలు, సలహాలను ఈ యాప్ రోగుల మాతృభాషలోకి అనువదిస్తుంది.

కోణం సాందీప్‌ 2018 ఫిబ్రవరిలో డాక్టర్‌ శివ్‌రావ్‌తో కలసి అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో అబ్రిడ్జ్‌ పేరుతో యాప్‌ సృష్టించి హెల్త్‌కేర్‌ రంగంలో రాణిస్తున్నాడు. ఇప్పటివరకు తమ కంపెనీకి 15 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.ఇడుపులపాయ  ట్రిపుల్ ఐటీలో  ఇంజినీరింగ్ పూర్తిచేసిన సందీప్.. అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో రోబోటిక్ విభాగంలో ఎంఎస్ పూర్తి చేశాడు. హెల్త్ ‌కేర్ టెక్నాలజీకి చెందిన పలు యాప్‌ లు రూపొందించాడు. పాతికేళ్ల వయసులోనే అమెరికా ఫోర్బ్స్‌ జాబితాలో స్థానం దక్కించుకున్న కోణం సాందీప్‌ను పలువురు అభినందిస్తున్నారు.

సందీప్ కోణం పేరుతో ఓ ఫౌండేషన్‌ను కూడా స్థాపించి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. సందీప్ తండ్రి శ్రీనివాస్ కనగల్ మండలంలోని కురంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మా యాప్‌ అబ్రిడ్జ్ఈ  ఏడాది అమెరికాలో కరోనా వైరస్ వైద్య సేవలు అందించే విషయంలో మంచి గుర్తింపు పొందిందని తెలిపారు.
Tags:    

Similar News