• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  క‌మ్మ ఓట్లు మాకొద్దు.....

క‌మ్మ ఓట్లు మాకొద్దు.. వైసీపీ డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌బోతోందా?

By - Tupaki Desk
Update: 2022-10-19 13:30 GMT
ఏపీ అధికార పార్టీ శైలి చూస్తే.. ఇదే అనుమానం క‌లుగుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ``క‌మ్మ వారి ఓట్లు మాకొద్దు..``  అని డిక్ల‌రేష‌న్ ఇచ్చినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. ఎందుకంటే.. మీడియా ముందుకు వ‌చ్చే వైసీపీ నాయ‌కులు ఈ సామాజిక వ‌ర్గాన్నే టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై కోపంతో.. ఏకంగా..ఆయ‌న సామాజిక వ‌ర్గ‌మైన క‌మ్మ‌ల‌ను టార్గెట్ చేయ‌డం.. ప‌రిపాటిగా మారిపోయింది.

ఉదాహ‌ర‌ణ‌కు రాజ‌ధాని అమ‌రావ‌తి ఇష్యూ వ‌చ్చిన‌ప్పుడు.. తొలిసారి.. మంత్రి స్థానంలో ఉన్న బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.. అదిఅమ‌రావ‌తి కాదు.. `క‌మ్మ‌రావతి` వారి కోస‌మే క‌ట్టుకుంటున్నారు.. అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇక‌, ఆ త‌ర్వాత‌.. ఇదే పంథాలో అనేక మంది నాయ‌కులు ముందుకు సాగారు. ప‌త్రిక‌ల‌ను కూడా.. ఈ కోవ‌లోకే చేర్చేశారు. టీడీపీకి అనుకూలంగా ఏ వార్త రాసినా.. దానిని `క‌మ్మ మీడియా` అని కామెంట్లు చేయ‌డం ప్రారంభించారు. ఇలా.. క‌మ్మ‌ల‌ను టార్గెట్ చేయ‌డం.. వైసీపీలో ష‌రా మామూలుగా మారిపో యింది. రాజ‌ధాని రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌ను కూడా.. క‌మ్మ వ‌ర్గ‌మే ముందుండి న‌డిపిస్తోంద‌ని.. అందులో ద‌ళితులు లేరు.. ద‌ళితుల ముసుగులో క‌మ్మ‌లే న‌డుస్తున్నార‌ని.. ఇలా.. వైసీపీ హేళ‌న చేసింది. ఇక‌, తాజాగా జ‌న‌సేన విష‌యాన్ని తీసుకుంటే.. ఆ పార్టీ చీఫ్ ప‌వ‌న్‌.. టీడీపీతో చేతులు క‌లిపారు.

ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం... అంటూ.. ఆయ‌న‌.. చంద్ర‌బాబును క‌లిసి.. జై కొట్టారు. అయితే.. దీనిపై  కూడా.. మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. `అది కాపు జ‌న‌సేన కాదు.. క‌మ్మ జ‌న‌సేన‌`` అని వివాదాల‌కు దిగారు. `జ‌న‌సేన కాదు.. క‌మ్మ‌సేన‌` అని వ్యాఖ్యానించారు. ఇక మరో మంత్రి అంబ‌టి రాంబాబు సైత‌.. `ప‌వ‌న్‌కు ఇప్పుడు `క‌మ్మ‌`గా ఉంది!!`` అని కామెంట్ చేశారు. ఇలా.. అనేక రూపాల్లో వైసీపీ నాయ‌కుల‌కు క‌మ్మ‌లే క‌నిపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వాళ్లు ఎప్పుడు అవ‌కాశం చిక్కినా.. క‌మ్మ‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

అయితే, రాజ‌కీయాల్లో..  కేవ‌లం క‌మ్మ సామాజిక వ‌ర్గ‌మే ఉందా? అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఓట‌ర్ల‌లో .. అన్ని సామాజిక వ‌ర్గాల వారు ఉన్నారు. కమ్మ అంటే..ఒక్క టీడీపీ అనో..వైసీపీ అంటే..ఒక్క రెడ్డి అనో.. చెప్ప‌డానికి వీల్లేదు. అన్ని పార్టీల్లోనూ అంద‌రూ ఉన్నారు.

అంతేకాదు.. ఏ పార్టీ అధికారంలోకి రావాల‌న్నా.. అన్ని సామాజిక వ‌ర్గాల ఆశీర్వాదం.. ఓటు బ్యాంకు కీల‌కం. మ‌రి రెండో సారి.. వ‌రుస‌గా.. ఐదారుసార్లు అధికారంలోకి రావాల‌ని..ల‌క్ష్యంగా పెట్టుకున్న వైసీపీకి.. క‌మ్మ సామాజిక వ‌ర్గంంతో ప‌నిలేదా? ఎందుకు ఆ సామాజిక వ‌ర్గాన్ని దూరం పెడుతున్నారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. బ‌హుశ ఈ క్ర‌మంలో క‌మ్మ ఓట్లు మాకొద్దు.. అని వైసీపీ డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌బోయినా ఆశ్చ‌ర్యం ల‌దేని అంటున్నారు.  

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • AP 
  • apgovernment 
  • ycp 
  • ysrcp 
  • ycpleaders 
  • andhrapradesh 

Similar News

జనసేన అభ్యర్థులు వీరే...పోటీ ఆసక్తికరం

2026-11-15 20:51 GMT

మ‌ర‌ణ శిక్ష‌లు నిలిపేయాలా.. వ‌ద్దా అనేది మా ఇష్టం: భార‌త్‌

2026-11-15 20:50 GMT

చంద్ర‌బాబుకు బిగ్ టెస్ట్ పెట్టేసిన అనంత త‌మ్ముళ్లు..!

2026-11-15 20:49 GMT

యార్ల‌గ‌డ్డ‌కు లోకేష్ మ‌ద్ద‌తు.. గ‌న్న‌వ‌రంలో యూట‌ర్న్‌..!

2026-11-15 20:41 GMT

ఏక‌గ్రీవం అంటే ఇలానే త‌మ్ముళ్లూ.. !

2026-11-15 20:35 GMT

ఎన్నిక‌ల వేళ‌.. గిరిజ‌నుల‌కు 3 వేల కోట్ల ప్రాజెక్టులు!

2026-11-15 20:35 GMT

రాత్రి ప‌దైంది.. బాబు నిద్ర‌పోతారులే అనుకున్నారు.. కానీ ఏం జ‌రిగిందంటే!

2026-11-15 20:34 GMT

జ‌న‌సేన అడ్డుప‌డింది.. లేక‌పోతేనా.. : బొత్స కామెంట్స్‌

2026-11-15 20:30 GMT

మెకెదాటు ఎఫెక్ట్‌: కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య క‌య్యం!

2026-11-15 20:29 GMT

తెలంగాణ‌లో మూడు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ!

2026-11-15 20:29 GMT

ఏపీకి బీపీ, షుగర్ ముప్పు.. కోటి మందికి పైగా బాధితులు! సర్వేలో షాకింగ్ నిజాలు!

2026-11-15 20:26 GMT

పాక్ పనిపట్టిన గుంటూరు కుర్రోడు.. విజయ సుభాష్ ఫుల్ స్టోరీ ఇదే..

2026-11-15 20:25 GMT

Copyright @2026

Powered by Blink CMS