కొబ్బ‌రికి ఒక డే వ‌చ్చింది

Update: 2015-08-27 09:49 GMT
మదర్స్ డే, ఫాదర్స్ డే, ఇంకెన్నింటికో వాటి వాటి విశిష్ట‌త‌ల‌ను పేర్కొంటూ ప్ర‌త్యేకంగా ఒక‌రోజు ఉన్న‌పుడు కొబ్బ‌రికాయ‌కు ఎందుకు ఉండ‌కూడ‌దు? అదే చ‌ర్చ జ‌రిగి ఇపుడు కొబ్బ‌రికాయ‌ల‌కో దినం నిర్వహించాలని నిర్ణయించారు.

జాతీయ వ్య‌వసాయ‌ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కోకనట్ డెవలప్ మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో ఈ వరల్డ్ కోకనట్ డే ఉత్సవాలు  సెప్టెంబర్ 2న జరుగనున్నాయి. విజయవాడలో ఎంజీ రోడ్డులో స్వర్ణ వేదికలో ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 500 మందికి పైగా కొబ్బరి సాగు రైతులు హాజరవుతారు. కొబ్బరి కాయల వాడకం ప్రాముఖ్యం పై ప్రజలకు తెలియజేయడం, కూల్ డ్రింక్ ల కన్నా సహజసిద్ధమైన కొబ్బరి నీళ్లు తాగడంలో ప్రయోజనాలు వివరించడం, కొబ్బరి పరిశ్రమలో పెట్టుబడులను ప్రోత్సహించడం ఈ వరల్డ్ కోకనట్ డే ఉత్సవాల ప్రధాన లక్ష్యం.

ప్రపంచంలో కొబ్బరికాయల సాగులో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఇండోనేషియా వ్యవస్థాపక దినోత్సవం సెప్టెంబ‌ర్ 2. అందుకే ఆ దేశాన్ని గౌర‌విస్తూ కోకోన‌ట్ డేకు సెప్టెంబ‌ర్ 2ను ఖ‌రారు చేశారు. సెప్టెంబర్ 2న జకార్తాలో వరల్డ్ కోకనట్ డే ను ఆసియా, పసిఫిక్ కోకనట్ కమ్యునిటీ ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. కొబ్బ‌రి త‌న‌కంటూ ఒక‌రోజు రావ‌డం చూసి మురిసిపోవ‌డం ఆనంద‌క‌రమే.
Tags:    

Similar News