కరోనా దెబ్బకు మహిళలు తాగుబోతులయ్యారట!
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి దెబ్బకు అన్నిరంగాల వారు, అన్ని వర్గాల ప్రజలు కుదేలయ్యారు. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది. కరోనాతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై అనేక మంది మద్యానికి బానిసయ్యారట. అందులో మహిళలు, యువతులు అత్యధికంగా ఉండటం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ లాక్డౌన్ పీరియడ్లో మద్యానికి బానిసైన మహిళల సంఖ్య ఎక్కువగా ఉన్నదట. ఉపాధి కోల్పోవడం. ఇంట్లో పనిఒత్తిడి ఎక్కువ కావడం. బయటకు వెళ్లలేకపోవడంతో తీవ్రమైన ఒత్తడికి గురై మహిళలు, యువతులు కరోనా బారినపడ్డట్టు సమాచారం. సామాజిక దూరం, ఒంటరితనం, ఉద్యోగంలో అభద్రతాభావం, ఇంటిఖర్చులు పెరగడం, పిల్లల పోషణ భారం కావడం వంటి అనేక కారణాలతో మహిళలు ఒత్తిడికి గురై ఉంటారని సర్వే తేల్చింది.
సౌత్ ఫ్లోరిడాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా మహిళల మద్యపానానికి సంబంధించి ఓ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లో మహిళలు గతంకంటే చాలా ఎక్కువ స్థాయిలో, ఎక్కువ మంది మద్యం సేవించినట్టు సర్వేలో తేలింది. మరోవైపు చాలా మంది మహిళలు ఈ లాక్డౌన్ సమయంలోనే కొత్తగా మద్యానికి అలవాటయ్యారట.
అమెరికాలో ఆల్కాహాల్ సంబంధిత మరణాలు పెరిగాయని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ ఒక నివేదికను విడుదలచేసింది. 2006 నుంచి 2018 మధ్య కాలంలో ఆల్కాహాల్ సంబంధిత మరణాలు 43శాతం మేర పెరిగాయని సీడీసీ నేషనల్ సెంటర్ ఫర్ హెల్త్ స్టాటాస్టిక్స్ గుర్తించింది. అయితే పట్టణప్రాంతాలతో పోల్చుకుంటే.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఎక్కువగా మద్యం తాగుతున్నట్టు ఈ నివేదిక తేల్చిచెప్పింది. మరోవైపు మద్యపానం సంబంధిత వ్యాధులతో చనిపోయేవారి సంఖ్య పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా ఉన్నట్టు ఈ సర్వే వెల్లడించింది.