• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మరీ.. ఇంత ప్రేమా? నావల్ల...

మరీ.. ఇంత ప్రేమా? నావల్ల కాదు.. విడాకులు ఇప్పించండి?

By - Tupaki Desk
Update: 2020-08-22 23:30 GMT
ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు చూస్తే.. నవ్వాలో.. ఏడవాలో అర్థం కాదు. చక్కటి మొగుడు.. ప్రేమగా చూసుకోవటం.. పల్లెత్తు మాట అనకుండా ఉండటం.. ఇంటి పనుల్లో సాయం చేయటం.. ఏదైనా పొరపాటు చేస్తే.. లైట్ తీసుకోవటం లాంటివి ఏ భార్య అయినా ఎగిరి గంతేస్తుంది. కానీ.. ఉత్తరప్రదేశ్ కు చెందిన మహిళ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. తన భర్త చూపించే ప్రేమను భరించలేకపోతున్నానని.. అతనితో కలిసి ఉండటం తన వల్ల కాదని ఆమె పేర్కొంటోంది.

ఏదో మాట వరసకు కాదు.. అదే పనిగా విడాకుల కోసం కోర్టులకు.. పెద్ద మనషుల వద్దకు వెళ్లి పంచాయితీ పెడుతున్న తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. యూపీకి చెందిన ఒక మహిళకు ఏడాదిన్నర క్రితం పెళ్లైంది. భర్త ఆమెను అపురూపంగా చూసుకుంటున్నాడు. ఆమెకు ఇప్పుడుఅదే పెద్ద సమస్యగా మారింది. తనపై చూపిస్తున్న అతి ప్రేమను తాను తట్టుకోలేకపోతున్నట్లుగా ఆమె వాపోతోంది.

ఇంటి పనితో పాటు.. వంటలోనూ సాయం చేస్తాడని.. ఏదైనా తప్పు చేస్తే వెంటనే క్షమిస్తాడని పేర్కొంది. ఎప్పుడూ కోప్పడడని.. అతనితో గొడవపడాలని తనకు ఉంటుంది కానీ ఆ అవకాశం ఇవ్వడని పేర్కొంటోంది. ఇంత ప్రేమను తాను తట్టుకోలేనని.. ఈ వాతావరణంలో తాను ఇమిడలేకపోతున్నట్లుగా పేర్కొంటూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ భార్యమణి సమస్యను విన్న షరియా కోర్టు గుమస్తా.. అవాక్కు కావటమే కాదు.. ఇలాంటి కేసుల్ని కోర్టు ఒప్పుకోదని చెప్పి వెనక్కి పంపాడు.

దీంతో.. ఆమె మత పెద్దల్ని కలిసి.. తనకు విడాకులు ఇవ్వాలని కోరుతోంది.  కంటికి రెప్పలా చూసుకునే భర్త ఉన్నప్పుడు.. కలిసి కాపురం చేయక.. విడిపోవాలనుకోవటం ఏమిటి? అన్న ప్రశ్నతో పాటు.. ఇలాంటివి భార్యభర్తలు మాట్లాడుకొని సర్దుకోవాలంటూ సలహా ఇస్తూ పంపిస్తున్నారు. సదరు భార్యమణి మాత్రం అందుకు భిన్నంగా.. ఏదోలా తన భర్త నుంచి విడిపోయి.. అంత ప్రేమకు దూరంగా ఉండాలని కోరుకుంటుందట. ఇలాంటి వాళ్లను ఏమనాలి?
Tags:    
  • Woman 
  • husband 
  • Telugu NEws 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS