ఎరక్కపోయి ఇరుక్కుంది.. వీడియో వైరల్

Update: 2019-06-24 09:37 GMT
సెల్ఫీ పిచ్చి ఎంత పనిచేస్తోంది. ఆ పిచ్చిలో పడి అత్యుత్సాహంతో సాహసాలు చేస్తూ కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు గుజరాత్ రాష్ట్రంలో కూడా ఓ భక్తురాలైన మహిళ చేసిన పని అలాంటి కోవకు చెందిందే.. అయితే సదురు వీడియో మాత్రం ఇప్పుడు నవ్వులు పూయిస్తూ వైరల్ అయ్యింది..

గుజరాత్ రాష్ట్రంలోని ఓ మహిళ వీడియో ఇప్పుడు సెన్షేషనల్ సృష్టిస్తోంది. కొద్దిరోజుల క్రితం గుడికి వెళ్లిన సదురు మహిళా.. అక్కడ ఏర్పాటు చేసిన ఏనుగు విగ్రహాన్ని చూసి ముచ్చటపడి దాని కాళ్ల కింద పడుకొని ఫొటో దిగాలని చూసింది. ఏనుగు విగ్రహం చిన్నగా ఉండడంతో అతికష్టం మీద దాని కాళ్ల కిందకు దిగింది. ఫొటో తీసుకుంది. దూరడం అయితే దూరింది కానీ బయటకు రావడం కష్టమైంది. చాలా మంది మహిళలు ఆమెను బయటకు తీసేందుకు అష్టకష్టాలు పడ్డారు. చివరకు ఎలాగోలా అతికష్టం మీద బతుకు జీవుడా అంటూ ఆ మహిళ బయటపడింది.

ఎరక్కపోయి ఫొటో కోసం ఏనుగు విగ్రహం కింద ఇరుక్కున్న ఆ మహిళ వీడియో ఇప్పుడు అందరికీ నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియో చూసిన వారందరూ తెగ నవ్వేస్తూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. వైరల్ గా మారిన ఆ వీడియో ఇప్పుటు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.



Full View
Tags:    

Similar News