• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఉల్లి సమస్య పై మోడీ ని...

ఉల్లి సమస్య పై మోడీ ని ఎందుకు విమర్శించరు బాబు , పవన్ ..!

By - Tupaki Desk
Update: 2019-12-10 06:30 GMT
ప్రస్తుతం దేశంలో ఉన్న అతి పెద్ద సమస్య ఏది అంటే ఉల్లి సమస్యే అనే చెప్పాలి. సాధారణంగా ఉల్లి ని కోసేటప్పుడు కన్నీళ్లు వస్తాయి ..కానీ, ప్రస్తుతం కొనేటప్పుడే కన్నీళ్లు వస్తున్నాయి. నిత్యావసర సరుకుల్లో ఒకటిగా ఉండే ఉల్లి ధర గత కొన్ని రోజులుగా కొండెక్కి కూర్చుంది. దీనితో సామాన్యలు ఉల్లి కొనాలి అంటేనే వణికిపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ఉల్లి .. 180 -200 వరకు పలుకుతుంది. ఈ సమస్య పై పార్లమెంట్ లో కూడా చర్చలు సాగాయి. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇచ్చిన స‌మాధానం తీవ్ర విమ‌ర్శ‌ల పాలైంది. ఆమె పార్లమెంట్ లో మాట్లాడుతూ ..మా ఇంట్లో ఉల్లి ని ఎక్కువగా వాడం అని చెప్పింది. ఆమె ఇంట్లో తిననంత మాత్రానా ..దేశంలోని ప్రజలందరూ తినకుండా ఉండాలా.

ఇక పోతే ఉల్లి సమస్య ..ఇప్పుడు ఏ ఒక్క రాష్ట్రానికో సంబంధించిందో కాదు ..మొత్తం దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత ఉంది. కానీ , ఈ విషయం తెలిసి విమర్శిస్తున్నారో ..ఆ మాత్రం పరిజ్ఙానం లేకనో కానీ , పవన్ కళ్యాణ్ , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ...ఉల్లి సమస్య కి ప్రధానం కారణం సీఎం జగనే అన్నంతగా జగన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా రెచ్చిపోతున్నారు .. దేశ వ్యాప్తంగా ఈ స‌మ‌స్య ఉంద‌నే విష‌యాన్ని ప‌వ‌న్ గుర్తించ‌డం లేదో ..లేక ఈ సమస్య పై సరైన అవ‌గాహ‌న ఉందో లేదో మ‌రి ఆయనకే తెలియాలి.

ఉల్లి గురించి ఇత‌ర రాజ‌కీయ  పార్టీలు  మోడీని నిల‌దీస్తున్నాయి. ఎందుకంటే దేశంలో ఉల్లి పాయ‌ల ల‌భ్య‌త లేదు. విదేశాల నుంచి దిగుమ‌తే మార్గంగా క‌నిపిస్తూ ఉంది. అది జ‌గ‌న్ చేతి లో ఉండ‌దు. మోడీ, కేంద్ర ప్ర‌భుత్వం డిమాండ్ కు త‌గ్గ‌ట్టు గా స్పందించాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా దీనిపై అందరూ కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటే ...బాబు , పవన్ మాత్రం ..మోడీని విమర్శించే దైర్యం లేక ..ఉల్లి సమస్య కి సీఎం జగనే కారణం అని ..జగన్ పై యుద్ధం చేస్తున్నారు. చెవుటోడి ముందు శంఖం ఊదినట్టు ... దేశ వ్యాప్తంగా ఉన్న ఈ సమస్య పై ..సీఎం జగన్ మాత్రం ఏమి చేయగలరు.

అయినప్పటికీ , సీఎం జగన్ ప్రజల గురించి అలోచించి ..ఉల్లిని కొనుగోలు చేసి రైతు బజార్లలో కిలో 25 కె పంపిణి చేస్తున్నారు. అది మాత్రం వారికీ కనిపించడం లేదు. ఉల్లి సమస్య పై కాంగ్రెస్ ఇత‌ర ప‌క్షాలు మోడీ ని విమర్శింస్తుంటే .. టీడీపీ, జ‌న‌సేన‌లు మోడీ ని పల్లెత్తు మాట కూడా అనడంలేదు. మోడీ మీద విమ‌ర్శ‌లు చేస్తే ఎక్కడ తమ కేసులు బయటపెట్టి ..తమ లొసుగులు బయట పెడతారో అని వీరు బహుశా బయపడుతుండవచ్చు ...అందుకే ఉల్లి సమస్య పై మేము కూడా పోరాటం చేస్తున్నాం అని ప్రజల దగ్గర మెప్పు పొందటానికి సీఎం జ‌గ‌న్ మీద విమ‌ర్శ‌లు చేసి పబ్బం గడుపుతున్నారు.


Tags:    
  • Onion Crisis In India 
  • India News 
  • Onion Prices In India 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS