• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఆత్మకూరు లీడర్ ఎవరు ?

ఆత్మకూరు లీడర్ ఎవరు ?

By - Tupaki Desk
Update: 2019-11-16 04:34 GMT
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ నాయకుడి కోసం ఎదురు చూస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి ని నియమించేందుకు పార్టీ సిద్దమవుతోంది. ఇప్పటి వరకు ఈ స్థానం ఖాళీ ఉండడం తో పలువురు నాయకులు ఈ పదవిని ఆశిస్తున్నారు.

మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గా పోటీ చేసిన బొల్లినేని కృష్ణయ్య కు అధిష్ఠానం బాధ్యతలు అప్పజేప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, బొల్లినేని అందుకు అంగీకరిస్తారా అన్నదే ప్రశ్న. ఇప్పుడు పార్టీ ఇంచార్జిగా నియమితులైతే మళ్లీ ఎన్నికల వరకు భారం మోయాల్సిందే.  ఐదేళ్ల పాటు అధికారం లో లేకుండా వ్యయ ప్రయాసల కోర్చి పార్టీ శ్రేణులను ముందుకు నడపడం బొల్లినేని కి కత్తి మీద సామే అవుతుంది. దానికి తోడు త్వరలో జరగ బోయే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ తో ఢీ కొనడం స్థానిక నేతల కు ఆర్థిక సమస్య పెనుభారంగా మారనుంది. ఈ క్రమంలో వారికి అన్ని విధాలా అండగా ఉండి ముందుకు నడపాల్సిన బాధ్యత నియోజకవర్గ ఇన్‌చార్జిపైనే ఉంటుంది. ఈ క్రమం లో బొల్లినేని కృష్ణయ్య బాధ్యతలు చేపడితే కొంతమేర పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు పేరు కూడా ఈ పదవికి వినిపిస్తోంది. అయితే వయసు రీత్యా నియోజ కవర్గ బాధ్యతలు చేపట్టి ఐదేళ్ల పాటు వ్యయ ప్రయాసల కోర్చి పార్టీ శ్రేణులను ముందుకు నడిపేందుకు ఏమాత్రం అంగీకరిస్తారనేది ప్రశ్నార్థకమే.

జడ్పీ మాజీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కి సైతం పార్టీ అధిష్ఠానం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేక పోలేదు. అయితే నియోజకవర్గ రథసారధిగా కొనసాగేందుకు సుముఖత వ్యక్తం చేస్తారా... అనే అంశంపై చర్చనీయాంశంగా మారింది నియోజకవర్గం లో బొమ్మిరెడ్డి కుటుంబానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. గ్రామ గ్రామాన పార్టీలకతీతం గా పరిచయాలు ఉన్నాయి.

మరో వైపు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గూటూరు మురళీ కన్నబాబు పేరూ వినిపిస్తోంది.  ప్రస్తుతం ఆయన వెంకట గిరి నియోజక వర్గ పరిశీలకులుగా ఉన్నారు. 2012లో ఆత్మకూరులో క్లిష్టపరిస్థితుల్లో ఉన్న పార్టీని ఆయన ముందుండి నడిపారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అయితే టీడీపీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గ బాధ్యతలు చేపట్టి పార్టీని పటిష్టపరిచారు. వీరిలో బొల్లినేని కి, కన్నబాబు కు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
Tags:    
  • Aatmakur 
  • Aatmakur Tdo 
  • Telugu Desam 
  • Cbn.Bollineni Krishniah 
  • Raghvendra Reddy 
  • Andhra News 
  • Andhra Politics 
  • Tupaki News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS