• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సజ్జనార్ చేసిందే...

సజ్జనార్ చేసిందే చేయాలంటున్న ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి

By - Tupaki Desk
Update: 2021-08-28 10:30 GMT
ఒక ఉదంతం ఇప్పుడు కర్ణాటకలో పెను సంచలనంగా మారటమే కాదు.. తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. విపరీతమైన భావోద్వేగంతో ఉన్న కన్నడిగుల మూడ్ ను అర్థం చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మైసూరు నగర శివారులో ఎంబీఏ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన రేపిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ఈ దారుణ ఘటనను రాజకీయ పార్టీలన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ ఉదంతంపై కన్నడిగులంతా కోపంతో ఉన్నారు. పోలీసులు ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నారు.

ఇంత ఆవేశాన్ని రగిలించిన ఈ దారున నేరానికి సంబంధించి ఇప్పటివరకు నిందితుల్ని పోలీసుల్ని పట్టుకోకపోవటంపై నిరసన మరింత పెరుగుతోంది. బాధితురాలి మీద అత్యాచారానికి పాల్పడిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రెండేళ్ల క్రితం హైదరాబాద్ మహానగర శివారులో జరిగిన దిశ ఘటనలో నిందితుల్ని ఎన్ కౌంటర్ చేసిన వైనాన్ని కుమారస్వామి ప్రస్తావించారు.

దిశ హత్యాచార కేసులో హైదరాబాద్ పోలీసులు వ్యవహరించినట్లే.. మైసూర్ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఉదంతంలోనూ దోషులపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పోలీసుల చర్యల్ని ఫాలో కావాలని.. ఇలాంటి నేరాల్లో దోషులపై కఠిన చర్యలు తీసుకోకుంటే పరిస్థితులు మెరుగుపడవని వ్యాఖ్యానించారు. కుమారస్వామి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

మైసూర్ అత్యాచార కేసులో ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలని కోరిన ఆయన.. ఆ విషయంలో హైదరాబాద్ పోలీసుల  చర్యల్ని అనుసరించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా ప్రభుత్వం ఆపలేకపోతుందని విమర్శించారు. ప్రస్తుత వ్యవస్థ నేరాల్ని ప్రోత్సహించేలా ఉందన్న ఆయన.. నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి.. కొద్ది రోజుల్లోనే బయటకు వచ్చేస్తున్నారన్నారు.

నేరాలు చేసినా తమకేం కాదన్న నమ్మకంతో వారు అలా చేస్తున్నారన్నారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. దిశ ఉదంతంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం.. నిందితులు ఎన్ కౌంటర్ కావటం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సైబరాబాద్ సీపీ గా వ్యవహరించిన సజ్జనార్ నాయకత్వంలో జరగడం తెలిసిందే. సజ్జనార్  కన్నడిగ కావటం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో ఐపీఎస్ గా ఏపీని ఎంచుకున్నారు. అప్పుడు సజ్జనార్ టీం చేసినట్లు ఇప్పుడు మైసూర్ పోలీసులు చేయాలని కుమారస్వామి కోరుకోవడం ఆసక్తికరంగా మారింది.
Tags:    
  • sajjanar 
  • telangana sajjanar 
  • Political News 
  • Breaking News 
  • Latest News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS