• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  విమర్శకులపై సెటైర్ల తో...

విమర్శకులపై సెటైర్ల తో రెచ్చిపోయిన వార్నర్ సతీమణి !

By - Tupaki Desk
Update: 2021-11-15 08:31 GMT
టీ20 వరల్డ్‌ కప్‌ లో కొత్త విజేతగా ఆస్ట్రేలియా అవతరించింది. న్యూజిలాండ్‌తో దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌ లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలిచి, తొలిసారి టీ20 వరల్డ్‌ కప్‌ ని ముద్దాడింది. క్రికెట్ చరిత్రలో ఇది ఏడో టీ20 వరల్డ్‌ కప్‌ కాగా.. ఇప్పటి వరకూ వెస్టిండీస్ మినహా ఏ జట్టు కూడా రెండు సార్లు ఈ కప్‌ ని గెలవలేదు. ఇక ఇదిలా ఉంటే .. ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా నిలకడలేమి ఫామ్‌తో సతమతమైన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ కెరీర్ ముగిసినట్లేనని క్రికెట్ విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. ప్రతీ సీజన్‌లో 500 ప్లస్ రన్స్ చేసిన వార్నర్. ఈ సీజన్‌ లో  మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.
 
ఐపీఎల్ రెండు దశల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. 8 మ్యాచ్‌ ల్లో కేవలం 195 రన్స్ మాత్రమే చేశాడు. టీ20 ప్రపంచ కప్‌ ప్రాక్టీస్ మ్యాచ్‌ లతో పాటు ఆరంభం మ్యాచ్‌ ల్లోను వార్నర్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో వార్నర్ కెరీర్ ముగిసినట్లేనని, ఫామ్ కోల్పోయిన అతను మరీ నెమ్మదిగా ఆడుతున్నాడని, అతని బ్యాటింగ్ పాత తరంలా ఉందని విమర్శలు గుప్పించారు. అయితే శ్రీలంక తో మ్యాచ్‌ లో హాఫ్ సెంచరీ‌తో టచ్‌ లోకి వచ్చిన వార్నర్ తన ఫామ్‌ ను ఫైనల్ వరకు కొనసాగించాడు. అద్వితీయమైన బ్యాటింగ్‌ తో ఆసీస్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 7 మ్యాచ్‌ ల్లో మూడు హాఫ్ సెంచరీలతో 284 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి విమర్శకులు ముక్కున వేలు వేసుకునేలా చేశాడు.

ఇందులో నాలుగు విన్నింగ్ నాక్స్ ఉన్నాయి. ముఖ్యంగా వెస్టిండీస్‌తో చివరి లీగ్ మ్యాచ్‌ లో వార్నర్ ఆడిన తీరు.. సెమీస్‌లో ఆరంభంలోనే వికెట్లు కోల్పయినా తీవ్ర ఒత్తిడిలో స్వేచ్చగా ఆడిన విధానం అతని కెరీర్‌ లోనే హైలైట్. ఇక వార్నర్ ఫామ్‌ లోకి రావడంతో అతని సతీమణి క్యాండిస్ వార్నర్ సంతోషానికి హద్దే లేకుండా పోయింది. విమర్శకుల ప్రతీ మాటను గుర్తు పెట్టుకున్నా ఆమె వారికి తనదైన శైలిలో బదులిచ్చింది. వార్నర్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఫొటోను షేర్ చేస్తూ మా ఆయన ఫామ్‌ లో లేరా అండి  అని ప్రశ్నిస్తూ విమర్శకులపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఫామ్ కోల్పోయి, పాత తరం ఆట ఆడుతున్న డేవిడ్ వార్నర్‌ కు అభినందనలు అంటూ.. నవ్వుకునే ఏమోజీలతో సెటైర్లు వేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌ గా మారాయి. 
Tags:    
  • david warner 
  • groin comments 
  • Australia 
  • World Cup 
  • T20 World Cup champions 
  • Australia win T20 World Cup 
  • australia celebrations 

Similar News

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

Copyright @2026

Powered by Blink CMS