66 ఏళ్ల క్రితమే విశాఖ రాజధానిగా ప్రతిపాదన..చరిత్ర చెప్పిన నిజం ఏమిటంటే !

Update: 2020-01-23 08:50 GMT
ప్రస్తుతం ఏపీలో రాజధాని వ్యవహారం మాములుగా లేదు. మూడు రాజధానులంటూ జగన్ సర్కార్ ముందుకెళ్తుంటే ..ఒకే రాష్ట్రం ..ఒకే రాజధాని అనే నినాదంతో టీడీపీ ముందుకెళ్తుంది. ఇకపోతే మూడు రాజధానుల బిల్లుని అసెంబ్లీలో ఆమోదం పొందేలా చేసి - మండలి లో ప్రవేశపెట్టగా అక్కడ టీడీపీ తన సంఖ్యాబలాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపారు మండలి ఛైర్మెన్. అయితే విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్నప్పటికీ కూడా  ఈ ప్రతిపాదన 66 ఏళ్ల క్రితమే వచ్చిందని చరిత్ర చెప్తుంది.

అసలు విషయం ఏమిటంటే ..ఏపీ రాజధానిగా విశాఖ పేరు వినిపిస్తుండటంతో అందరి చూపూ ఈ మహానగరంపైనే పడింది. విశాఖను రాజధానిగా చేయాలని అధికారిక వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఇందుకు సుముఖంగా లేదు. ఈ క్రమంలోనే వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో పాస్ అయినప్పటికీ ...మండలిలో మాత్రం సెలెక్ట్ కమిటీకి పంపాలన్న నిర్ణయం చేశారు ఛైర్మెన్ షరీఫ్. దీంతో ఏం జరుగుతుందో అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

అయితే , ఇక విశాఖపట్నం రాజధాని చేయాలన్న ప్రతిపాదన ఈ నాటిది కాదు. పోర్టు సిటీని రాజధాని చేయాలని 66 ఏళ్ల క్రితమే ప్రతిపాదన తెరపైకొచ్చింది. 1953లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక విశాఖను రాజధాని చేయాలని భావించారు. అయితే కొన్ని కారణాలతో అది సాధ్యపడలేదు. ఇప్పటి పరిస్థితులతో పోలిస్తే నాటి పరిస్థితులు మరోలా ఉండేవి. నాటి అసెంబ్లీలో 30 నవంబర్ 1953లో విశాఖను రాజధానిగా రొక్కం లక్ష్మీ నరసింహ దొర అధికారిక తీర్మానంను ప్రవేశపెట్టారు. 1956 ఏప్రిల్ 1 వరకు కర్నూలు రాజధానిగానే కొనసాగిస్తూ ఆ తర్వాత రాజధానిని విశాఖపట్నంకు తరలించాలన్న చట్టసవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా రెండు ఓట్ల ఆధిక్యతతో బిల్లు నెగ్గినట్లు అప్పటి అసెంబ్లీ స్పీకర్ నల్లపాటి వెంకట్రామయ్య సభలో ప్రకటించారు. విశాఖను ఏపీ శాశ్వత రాజధానిగా ఉంచాలని అప్పటి ప్రధాన పత్రికలో కూడా వార్త  వచ్చింది. 

కర్నూలులో జరిగిన శాసనసభ సమావేశాల్లో ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులతో పాటు ఇతర సభ్యులు కూడా సభలో ఉన్నట్లు ఆ పత్రికలో వార్త ప్రచురితమైంది. ఈ సమావేశాలకు స్పీకర్‌ గా నల్లపాటి వెంకట్రామయ్య ఉన్నట్లు పత్రిక ప్రచురించింది. విశాఖను 1 ఏప్రిల్ 1954 నుంచి శాశ్వత రాజధానిగా ప్రకటించాలనే ప్రతిపాదనపై ముందుగా ఓటింగ్ జరిగినట్లు పత్రిక ప్రచురించింది. అయితే ప్రభుత్వం ఇందుకు వ్యతిరేకించినట్లు పత్రిక కథనంలో ప్రచురించింది. ఆ తర్వాత రొక్కం నరసింహ దొర ప్రవేశపెట్టిన చట్ట సవరణ బిల్లు సభలో ఆమోదం పొందినట్లు వార్త ప్రచురితమైంది. అయితే , కర్నూలు వాసులు రాజధానిగా విశాఖకు అనుకూలంగా ఉన్నప్పటికీ... విశాలాంధ్ర ఏర్పాటు అయితే రాజధాని హైదరాబాదు చేయాలని ప్రతిపాదించారు. ఇక విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలన్న ప్రతిపాదన 66 ఏళ్ల క్రితమే తెరపైకి వచ్చినప్పటికీ దురదృష్టం ఏంటంటే ఈ విషయం చరిత్ర పుస్తకాల్లో కానీ ఇతర పాఠ్యాంశాల్లోగాని చేర్చకపోవడమే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే , ఇన్నేళ్ల తరువాత మరోసారి సీఎం జగన్ విశాఖని రాజధానిగా చేయాలని ప్రయత్నం చేస్తున్నా కూడా టీడీపీ దానికి అడ్డుపడుతుంది. ఈ మూడు రాజధానుల వ్యవహారం ఎంత వరకు వెళ్తుందో చూడాలి మరి ..
Tags:    

Similar News