'ఊ అంటావా మావా' సమంత పాటకు విరాట్ కోహ్లీ స్టెప్పులు వైరల్

Update: 2022-04-28 11:35 GMT
ఐపీఎల్ లో అట్టర్ ఫ్లాప్ అవుతూ వరుసగా డకౌట్లు అవుతున్న విరాట్ కోహ్లీ వైదొలగాలని చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అయితే విరాట్ ఇక అసలు ఐపీఎల్ లో ఆడకూడదని సూచించాడు. రన్ మేషిన్ అయిన కోహ్లీ పరుగులు చేయడానికే తటపటాయిస్తున్నాడు. ఈ ఐపీఎల్ లో 9 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ ఇప్పటివరకూ 128 పరుగులు మాత్రమే చేయడం విశేషం.

బ్యాటింగ్ లో విఫలమవుతున్న విరాట్ కోహ్లీకి సంబందించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప సినిమాలోని సమంత డ్యాన్స్ చేసిన 'ఊ అంటావా మావా' అనే ఐటెం సాంగ్ కు విరాట్ కోహ్లీ అదిరిపోయేలా స్టెప్పులు వేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఐపీఎల్ 2022లో కరోనా బయోబబుల్ లో ఆటగాళ్లంతా సరదాగా గడుపుతున్నారు. గ్రౌండ్ లో సిక్సులు కొట్టి అలరిస్తున్న ఆటగాళ్లకు స్వాంతన చేకూర్చేందుకు గ్రౌండ్ బయట వినోద కార్యక్రమాలను ప్రాంఛైజీలు ఏర్పాటు చేస్తున్నాయి.

ఇక బుధవారం బెంగళూరు ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ వివాహ వేడుక ను ఆటగాళ్లతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీబీ ఆటగాళ్లు సందడి చేశారు. ఆటపాటలతో దుమ్మురేపారు.

ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా ఈ వేడుకకు హాజరయ్యాడు. నల్ల కుర్తా, పైజామా వేసుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. షాబాజ్ అహ్మద్, ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తో కలిసి మ్యాక్స్ వెల్ వెడ్డింగ్ ఈవెంట్ లో కోహ్లీ రచ్చరచ్చ చేశాడు. అందరూ కలిసి డ్యాన్స్ చేశారు.
Read more!

ముఖ్యంగా విరాట్ కోహ్లీ సహచర క్రికెట్ షాబాజ్ అహ్మద్ తో కలిసి 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' అనే పాటకు స్పెప్పులు వేశాడు. విరాట్ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరుగులు చేయలేకపోయినా డ్యాన్స్ లో మాత్రం కోహ్లీ ఇరగదీస్తున్నాడే అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.


Full View


Tags:    

Similar News