• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అర్థంలేని వదంతులు - ఏటీఎం...

అర్థంలేని వదంతులు - ఏటీఎం - బ్యాంకులకు ప్రజల పరుగు!

By - Tupaki Desk
Update: 2020-04-19 01:30 GMT
కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత్ లాక్ డౌన్‌లో ఉంది. ఈ సమయంలో పేదలను, అసంఘటిత రంగ కార్మికులను, ఉద్యోగులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చర్యలు చేపట్టాయి. కేంద్రం ఇప్పటికే రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. జన్ ధన్ లేదా రేషన్ కార్డు లింక్ ఉన్న అకౌంట్లలో రూ.500 నుండి రూ.1,500 వరకు జమ చేస్తున్నాయి ప్రభుత్వాలు. తెలంగాణలో ఇటీవల జమ చేయడం ప్రారంభించారు. వాటిని తీసుకోవడానికి ప్రజలు ఏటీఎంల వద్ద క్యూ కడుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏటీఎంల వద్ద డబ్బులు తీసుకోవడానికి కూడా టోకెన్లు ఇచ్చే పరిస్థితి. పనులు లేకపోవడంతో చేతిలో డబ్బులు లేక ప్రభుత్వం అకౌంట్లలో వేస్తున్న డబ్బులను తీసుకోవడానికి ఎండలో సైతం గంటలకొద్ది నిలబడుతున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి ప్రాంతంలో బ్యాంకు వద్ద క్యూలో నిలుచున్న ఓ మహిళ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు.

ఇప్పటికే చేతిలో డబ్బులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు కొంతమంది పుట్టిస్తున్న వదంతులు ప్రజలను బ్యాంకులకు పరుగులు పెట్టేలా చేస్తున్నాయి. జన్ ధన్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని, వాటిని తీసుకోకుంటే వెనక్కి పోతాయనే వదంతులు వినిపించడంతో కామారెడ్డి ప్రాంతంలో జనం ఏటీఎంలు, బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టారు. కొన్నిచోట్ల టెంట్లు ఏర్పాటు చేశారు. డబ్బులు తీసుకోవడానికి వచ్చే నేపథ్యంలో సామాజిక దూరం కూడా పాటించడంలేదు కొంతమంది.

బ్యాంకుల్లో జమ అయిన సొమ్ము వెనక్కి వెళ్లదు. కానీ కొంతమంది వదంతులు సృష్టించడంతో ప్రజలు ఏటీఎంలు, బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో పది నుండి పదిహేను గ్రామాలకు ఓ బ్యాంకు ఉంది. ఇక్కడి ప్రజలు గంటలకొద్ది వరుసలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • corona 
  • covid 19 
  • India 
  • Lockdown 
  • public run for ATMs and banks 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS