• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాములమ్మ రాజ్యం ఏలేనా..!?

రాములమ్మ రాజ్యం ఏలేనా..!?

By - Tupaki Desk
Update: 2018-11-23 10:32 GMT
తెలంగాణలో ముందస్తు ఎన్నికల హామీలు - నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వస్తే మహిళకు ముఖ్మమంత్రిని చేసే అవకాశం ఉందంటూ తెలంగాణ కాంగ్రెస్ మహిళా నాయకులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ రేసులో గీతా  రెడ్డి - డి.కె. అరుణ ఉండగా...సీనినటి - కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపేయినర్ విజయశాంతి కూడా నేను కూడా రేసులో ఉన్నానంటూ కాలు దువ్వుతున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేతలు మాత్రం ఈ విషయం తమ అధినేత రాహుల్ గాంధీ ద్రుష్టికి తీసుకుని వెళ్లలేదని - అయితే రాహుల్ గాంధీ తమ విన్నపాన్ని  తప్పకుండా అంగీకరిస్తారన్న నమ్మకం తమకు ఉందని వారంటున్నారు. ఈ విషయమై సీనినటి ఖుష్బూ మాట్లాడుతూ - ఈ విషయమై మేము రాహుల్ గాంధీ ద్రుష్టికి తీసుకుని వెడతామని - అయితే నిర్ణయం మాత్రం రాహుల్ గాంథీ - చంద్రబాబు నాయుడికే వదిలివేసామని అన్నారు. అయితే మహాకూటమిలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంథీ కంటే కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడే చక్రం తిప్పుతున్నారని వినికిడి. అయితే మహాకూటమిలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తోయో - ఆ పార్టీలన్నింటినీ కూడా తన అధీనంలోకి తీసుకుని చక్రం తిప్పడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఒకవేళ తెలంగాణ ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఏ మహిళా నేతకు అవకాశం ఇస్తుంది. రేసులో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్లు గీతారెడ్డి - డి.కె.అరుణ వంటి వారు ఉన్నారు. వీరందరినీ కాదని రామ్ములమ్మకు పట్టం కడుతుందా. రేసులో నేనున్నానంటున్న విజయశాంతికి ఎలా అవకాశం ఇస్తారంటున్నారు. గత నాలుగేళ్లుగా విజయశాంతి ఏమైపోయారని - ఒక సినిమా అయిపోగానే - వేరొక సినీమాలో నటించడానికి సిద్దంమయినట్లు - ఈ పార్టీ నచ్చకపోతే ఆ పార్టీలోకి...ఆ పార్టీ నచ్చకపోతే ఈ పార్టీ అంటూ పార్టీలు మార్చారని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు.  ఈ రోజు సోనీయా గాంథీ బహిరంగ సభలో పాల్గోనున్నారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్లలో ఒక్క మహిళ నేతకూడా కనిపించలేదు.  పోస్టర్లలో మహిళా నేతలను చూపించడానకి - మనస్సు రాని - మహాకూటమి నేతలకు - ఒక రాష్ట్రాన్ని ఒక  మహిళ చేతిలో పెట్టేటంత పెద్ద మనస్సు ఉంటుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే  మహిళ ముఖ్యమంత్రి విషయమై - తెలంగాణ మహిళ నేతలు పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని - ఈ విషయం కూడా కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి హామీలా గాలికి కొట్టుకుపోక తప్పదని - రాజకీయ పండితులు అంటున్నారు.

Tags:    
  • Vijayashanti 
  • Telangana CM Race 
  • Telugu NEws 

Similar News

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

Copyright @2026

Powered by Blink CMS