• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబుని నమ్మితే మళ్లీ...

బాబుని నమ్మితే మళ్లీ చిప్పే..రైతులకి సలహా ఇచ్చిన విజయ సాయి రెడ్డి!

By - Tupaki Desk
Update: 2019-12-24 12:46 GMT
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుండి రాజధాని ప్రాంత రైతులు  - రాజధానిని అమరావతి నుండి తరలించవద్దు అంటూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. గత ఏడు రోజులుగా రాజధాని ప్రాంత రైతులు రాత్రి  - పగలు అన్న తేడా లేకుండా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ధర్నాలపై స్పందించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు రాజధాని ప్రాంత రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు పై కూడా విమర్శలు గుప్పించారు. సోమవారం రాజధాని ప్రాంత రైతులకు భరోసా కల్పించటం కోసం - నేను అండగా ఉన్నానని చెప్పటం కోసం రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. దీనిపై రైతులకి విజయసాయి రెడ్డి ఒక సలహా ఇచ్చారు. అమరావతి పై బాబు ప్రేమ రైతుల కోసం కాదు అని , అయన బంధువర్గాల భూముల కోసం అని విమర్శించారు. తుళ్లూరు రైతులు అనవసరంగా చంద్రబాబును నమ్ముతున్నారని - చంద్రబాబును నమ్మడం కంటే అమాయకత్వం మరొకటి ఉండదని - తన బంధువర్గాల రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ఇప్పటికే ఒకసారి రైతులను చంద్రబాబు ఫణంగా పెట్టారని - మరోసారి బాబు ని నమ్మితే రైతుల చేతికి చిప్ప ఇస్తాడని.. బాబు మాటలు నమ్మకండి అని ఆయన సలహా ఇచ్చారు.

ఇదే సమయంలో సుజనా పై కూడా విమర్శలు గుప్పించారు. రాజధాని మార్పు అంత తేలిక కాదని సుజనా చౌదరి మాట్లాడుతున్నాడని , మొదట బ్యాంకులకు ఎగ్గొట్టిన 5 వేల కోట్ల సంగతి తేల్చి, రాజధాని గురించి మాట్లాడితే బాగుంటుందని ప్రజలు అంటున్నారు అని , అమరావతిలో కొన్న 300 ఎకరాలకు పాత ధర కూడా వచ్చే అవకాశం లేదని ఆయనకి నిద్ర పట్టడం లేదు కాబోలు అంటూ సుజనా పై నిప్పులు చెరిగారు. చూడాలి మరి ఈ మూడు రాజధానుల వ్యవహారం ఎలా ముగుస్తుందో ....
Tags:    
  • Vijay Sai Reddy 
  • Amaravathi Farmers 
  • Chandrababu Naidu 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS