• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమ్మకానికి గోల్డెన్ హోటల్...

అమ్మకానికి గోల్డెన్ హోటల్ లోని ఫ్లాట్లు.. ధర ఎందంటే?

By - Tupaki Desk
Update: 2020-07-12 00:30 GMT
ప్రపంచంలో వింతలకు..విశేషాలకు కొదవలేదు. దారుణమైన పేదరికం ఒకపక్కన.. అంతులేని ఐశ్వర్యం మరో పక్కన చాలా దేశాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. అందుకు ప్రపంచంలోని చాలా దేశాల్లోని పరిస్థితులే ఉదాహరణగా చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పే హోటల్ అలాంటి ఇలాంటిది కాదు. హోటల్ లోని గోడలు మొదలుకొని.. అది ఇది అన్న తేడా లేకుండా మొత్తం బంగారమే. ప్రపంచంలోని పూర్తిస్థాయి గోల్డెన్ హోటల్ గా అభివర్ణిస్తున్న ఈ స్వర్ణ హోటల్ ఎక్కడ ఉందంటారా? అక్కడికే వస్తున్నాం.

వియత్నాంలో నిర్మిస్తున్న ఈ హోటల్ చివరి దశకు వచ్చేసింది. చాలా రోజులుగా జరుగుతున్న పనులు పూర్తి కావొస్తున్నాయి. దీంతో.. ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. డోల్స్ హనోయ్ గోల్డెన్ లేక్ హోటల్ నిర్మాణం 2009లో మొదలైంది. అప్పటి నుంచి దీని పనులు దశల వారీగా చేసుకొస్తున్నారు. ఈఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెబతున్నారు. ఈ ఫైవ్ స్టార్ హోటల్ ను ఏ మూలన చూసినా బంగారమే కనిపిస్తుంది. హోటల్ లోపల మాత్రమే కాదు.. బయట కూడా బంగారం తాపడం చేయటం దీని ప్రత్యేకతగా చెప్పాలి.

హోటల్ లాబీ మొదలుకొని.. ఎలివేటరు... ఫర్నీచర్.. చివరకు చేతులు కడుక్కునే వాష్ బేసిన్ మొదలు.. బాత్ టబ్ ఇలా ఒకటేమిటి? ఏదైనా బంగారమే. చివరకు హోటల్ వెలుపల గోడకు సైతం బంగారాన్నే తాపడటం చేశారు. ఇందులో ఒక రోజు ఉండాలంటే మన రూపాయిల్లో రూ.20వేలు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ ధర మన వరకు చాలా తక్కువే. హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో రూంలతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి.

25 అంతస్తులు ఉండే ఈ ఫైవ్ స్టార్ హోటల్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన డీల్ బయటకు వచ్చింది. ఇందులో ఫ్లాట్లను అమ్మకానికి పెట్టారు. అలా అని దాన్ని కొనేసి.. ఉండిపోదామంటే కుదరదు. ఫ్లాట్ కొనొచ్చు. దాన్ని రోజుల వారీగా అద్దెకు ఇవ్వాలే కానీ.. పర్మినెంట్ గా ఉండేందుకు అనుమతించారు. ఫ్లాట్ కొన్న యజమాని.. దాన్ని అద్దెకు ఇచ్చేందుకు హోటల్ పేర్కొన్న ఏజెన్సీతో డీల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఈ హోటల్ ను నిర్మిస్తున్నది ఎవరంటే.. హోవా బిన్ గ్రూపు సంస్థ. ఈ గోల్డెన్ హోటల్ లో ఫ్లాట్ కొనాలనుకున్న వారికి.. చదరపు మీటరు రూ.4.9 లక్షలుగా డిసైడ్ చేశారు. అంటే.. ఫ్లాట్ కొనుగోలు చేయాలంటే కోట్లల్లో ఖర్చు చేయాల్సిందే. మరి.. దీన్లో ఫ్లాట్ ఎంతమంది భారతీయులు సొంతం చేసుకుంటారో చూడాలి?
Tags:    
  • Vietnam 
  • Golden Lake hotel 
  • flats Sale 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS