• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ముస్లింలకు మా హాస్పిటల్...

ముస్లింలకు మా హాస్పిటల్ లో అనుమతి లేదు..ఎందకంటే?

By - Tupaki Desk
Update: 2020-04-21 00:30 GMT
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన తోలి నాళ్లలోనే ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో కరోనా కొంచెం కంట్రోల్ లోకి వచ్చింది. అయితే , ఆ తరువాత ఢిల్లీ మర్కజ్ ఘటన వెలుగులోకి వచ్చిన తరువాత కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగాయి. దాదాపుగా దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఢిల్లీ మర్కజ్ ఘటన వల్లే కరోనా కేసులు పెరిగాయి అనే ఆరోపణలు అయితే , ఉన్నాయి. కానీ , ఈ మహమ్మారి వ్యాప్తికి ఏ ఒక్క మతాన్ని నిందించడం సమంజసం కాదు.

ఈ తరుణంలోనే మా హాస్పిటల్ లో ముస్లింలకు అనుమతి లేదంటూ ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌ లోని మీర‌ట్ ప్రాంతంలో ఉన్న ఓ హాస్పిట‌ల్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ..ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌ లోని మీర‌ట్ ప్రాంతంలో వాలంటీస్ అనే క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌..ముస్లింల‌కు క‌రోనావైర‌స్‌ సోక‌లేద‌ని నిర్దార‌ణ అయ్యాకే వారిని ఆసుప‌త్రిలో చేర్చుకుంటామంటూ ఓ ప‌త్రిక‌లో యాడ్ ప్ర‌క‌టించింది. దేశంలో క‌రోనా వ్యాప్తికి ఢిల్లీ జ‌మాత్‌ కు వెళ్లొచ్చిన ముస్లింలే కార‌ణ‌మంటూ ఆరోపించింది. అంతేకాకుండా హిందువులు, జైనుల‌ను కూడా దుర్మార్గులు అంటూ దూష‌ణ‌లు గుప్పిస్తూ.. ఈ రెండు సంప‌న్న వ‌ర్గాలు పీఎం కేర్స్ ఫండ్‌ కు భారీగా విరాళాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.

ఈ పోస్ట్ వివాదాస్పదం కావడం తో హాస్పిట‌ల్ యాజ‌మాన్యంపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. మ‌తాల‌ను కించ‌ప‌రుస్తూ ఉద్దేశ‌పూర్వ‌కంగా వ్యాఖ్య‌లు చేసినందుకు హాస్పిట‌ల్ మేనేజ్‌మెంట్‌ పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. కరోనా నెగటివ్ వస్తేనే ముస్లింలను ఆసుపత్రిలోకి అనుమతిస్తాం అని చెప్పడం దారుణం. ఈ వార్తని నిజంగా ఆ హాస్పిటల్ యాజమాన్యమే పత్రికలో ప్రకటన కి ఇచ్చింటే ..దాని కంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు. ఎవరో కొందరు చేసిన తప్పుకి అందరిని బద్నామ్ చేయడం కరెక్ట్ కాదు. అది కూడా ఒక హాస్పిటల్ ఇలా మతాలు , కులాలు అంటూ ప్రకటన ఇవ్వడం అంత మంచింది కాదు. ఏ మతం వారైనా ..ఏ కులం వారైనా కూడా చేతులెత్తి మొక్కేది ఒక్క డాక్టర్ కి మాత్రమే. డాక్టర్ ను దేవుడు తో పోల్చే ఈ సమాజంలో మా హాస్పిటల్ లోకి ముస్లింలకు అనుమతి లేదు అంటూ ప్రకటించడం హేయమైన చర్య. ప్ర‌స్తుతం యూపీ అంత‌టా 970 క‌రోనా కేసులు న‌మోదుకాగా, 14 మంది చ‌నిపోయారు.
Tags:    
  • Political News 
  • Breaking News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • corona 
  • covid 19 
  • uttarpradesh 
  • valetis Hospital 
  • Muslims are not allowed in our hospital 

Similar News

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

GTA 6 తయారీలో బెంగళూరు టీమ్.. 1,600 మందికి పైగా భారతీయుల పని!

2026-11-19 05:08 GMT

చైనాపై మేమూ నిఘా పెడతాం.. ట్రంప్ కామెంట్స్ వైరల్!

2026-11-19 05:03 GMT

గడువు ముగిసిన బాంబుల ప్రయోగమా? అమెరికా 'యుద్ధ నీతి'ని చూసి సిగ్గుపడండి..

2026-11-19 05:02 GMT

కాలుష్యానికి నేనే బాధ్యుడిని.... గడ్కరీ బోల్డ్ స్టేట్మెంట్

2026-11-19 05:00 GMT

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

భూమి మీద ఇక నివసించలేమా...భయపెడుతున్న నివేదిక !

2026-11-19 04:57 GMT

Copyright @2026

Powered by Blink CMS