• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హెచ్ సీయూ గొడవలో...

హెచ్ సీయూ గొడవలో మంత్రులకు క్లీన్ చిట్

By - Tupaki Desk
Update: 2016-02-20 06:32 GMT
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్ వీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కు దారితీసిన కారణాల్లో ఒకటిగా చెబుతున్న విద్యార్థుల సస్పెన్షన్‌ విషయంలో కేంద్ర మంత్రుల జోక్యం ఏమీ లేదని తేలింది. కేంద్రం నియమించిన నిజ నిర్ధారణ కమిటీ ఈ మేరకు తేల్చిచెప్పింది. పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు, వర్సిటీలో గొడవలకు యూనివర్సిటీ యాజమాన్యం వైఫల్యమే కారణమని నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఇచ్చింది.   మానవ వనరుల శాఖ నుంచి వచ్చిన లేఖలను హెచ్‌సీయూ అధికారులు అసలు పట్టించుకోలేదని.... అసలు వారు కేంద్రం నుంచి వచ్చిన లేఖలను పట్టించుకోనప్పుడు వారిపై మంత్రుల ఒత్తిడి ఉందనడం అర్ధరహితమని నివేదికలో అభిప్రాయపడినట్లు సమాచారం.

కాగా  హెచ్‌సీయూలో రోహిత్ ఆత్మహత్య అంశం వివాదం కావడంతో కేంద్రం దీనిపై ద్విసభ్య కమిటీని వేసింది. వారు వర్సిటీలో పరిస్థితులను పరిశీలించింది. అధికారులు, విద్యార్థులతో మాట్లాడి తాజాగా మానవ వనరుల శాఖకు నివేదిక అందజేశారు. హెచ్‌సీయూలో విద్యార్థుల సస్పెన్షన్, వివాదాలు, రోహిత్ ఆత్మహత్య తదితర ఘటనలకు వర్సిటీ యాజమాన్యం వైఫల్యమే కారణమని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. రోహిత్‌తో పాటు ప్రశాంత్ - విజయ్ - సుంకన్న - శేషులపై సస్పెన్షన్ వేటుకు కేంద్ర మంత్రుల జోక్యం కారణం కాదని స్పష్టం చేసినట్లు సమాచారం.

కాగా సస్పెన్షన్ల అనంతరం ఆందోళన చేస్తున్న విద్యార్థులతో వర్సిటీ యాజమాన్యం చర్చలు జరపకపోవడాన్ని కమిటీ తప్పు పట్టింది. వర్సిటీ మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్టులోనూ, 2015 ఆగస్టు 3, 4 తేదీల్లో వర్సిటీ ప్రాక్టోరియల్ బోర్డు చేపట్టిన విచారణ కూడా సవ్యంగా లేదని తేల్చింది. సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించే విధానం వర్సిటీలో లేదని... ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు తాము వివక్షకు గురవుతున్నట్లు భావిస్తున్నారని.. అలాంటివన్నీ గుర్తించి పరిష్కరించే చర్యలు అక్కడ లేకపోవడంతో ఈ పరిస్థితిఏర్పడిందని కమిటీ తేల్చింది. అంతేకాకుండా... గతంలో హెచ్‌ సీయూలో జరుగుతున్న కొన్ని విషయాల్లో స్పందించి, చర్యలు తీసుకోవాలంటూ 2014 నవంబర్‌ లో పార్లమెంటు సభ్యులు లేఖ రాసిన విషయాన్ని కూడా నిజ నిర్ధారణ కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. వర్సిటీలో జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో 2008లో నియమించిన వినోద్ పావురాల కమిటీ సూచనలనుగానీ, ప్రొఫెసర్ కృష్ణ కమిటీ సూచనలనుగానీ, 2014లో నియమించిన జస్టిస్ రామస్వామి కమిటీ నివేదికనుగానీ వర్సిటీ యాజ మాన్యం పట్టించుకోలేదని... ఆ సూచనలు అమలు చేయలేదని కమిటీ స్పష్టం చేసింది.
Tags:    
  • Union Ministers 
  • HCU Rohit Suicide 
  • Telugu NEws 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS