అంబులెన్సు ఎత్తుకెళ్లాలని చూసి.. అడ్డంగా బుక్కయ్యాడు!
ఓ దొంగ రోడ్డుపై నిలుచున్న అంబులెన్స్ లో ఎవరూ లేరని భావించి దాన్ని ఎత్తుకెళ్లాలని చూశాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఇక రయ్ రయ్ మంటూ వెళ్లడమే ఆలస్యం అనుకున్నాడు. ఆ అంబులెన్స్ లో వైద్యులు, వైద్య సిబ్బంది ఓ రోగి ఉన్నట్లు తెలుసుకుని ఖంగుతిన్నాడు. దొంగ చేసిన ఈ ప్రయత్నమంతా సీసీటీవీ ఫుటేజీలో నమోదవడంతో ఆ తెలివి తక్కువ దొంగ చేసిన పనికి అంతా ఘోల్లుమని నవ్వుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది. ఇంగ్లాండ్ లోని ల్యాంక్ షైర్ బ్లాక్ పూల్ లో ఓ వృద్ధుడు అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ వచ్చింది.
మార్గమధ్యంలో ఆ వృద్ధుడికి సీరియస్ అవడంతో వాహనాన్ని రోడ్డు పక్కగా ఆపి వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ దొంగ రోడ్డు పక్కన అంబులెన్స్ ఖాళీగా ఉందని భావించి దాని ఎత్తుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. డ్రైవింగ్ సీట్లో ఎవరూ లేకపోవడంతో ఎక్కి కూర్చున్నాడు. ఈ తతంగమంతా లోపల ఉన్న వారు గమనిస్తూనే ఉన్నారు. ఇక వాహనం స్టార్ట్ చేసే ముందు అకస్మాత్తుగా అతడి ముందు హెల్త్ వర్కర్ ప్రత్యక్షమయ్యాడు.
అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించాడు. ఈ వ్యవహారమంతా అక్కడి సీసీ టీవీ ఫుటేజీలో నమోదయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇతడేవరో తెలివితక్కువ దొంగ.. అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అయితే ఆ వ్యక్తి డ్రగ్, మద్యం మత్తులోనే ఇదంతా చేశాడని, అంబులెన్స్ సిబ్బంది వెల్లడించారు.