• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హెయిర్ డ్రయ్యర్,...

హెయిర్ డ్రయ్యర్, ఇస్త్రిపెట్టెలతో నవ్వులపాలైన బీసీసీఐ..

By - Tupaki Desk
Update: 2020-01-06 09:07 GMT
అస్సాం రాజధాని గౌహతి లో నిన్న తడి పిచ్ కారణం గా ఆగి పోయిన ఇండియా- శ్రీలంక మొదటి టి20 మ్యాచ్ నవ్వుల పాలైంది. ఒక్క బంతి పడకుండా తడి కారణంగా మ్యాచ్ ను నిలిపి వేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. వర్షం తో తడిసిన గ్రౌండ్ ను ఆర బెట్టడానికి గ్రౌండ్ సిబ్బంది చేసిన పనులతో బీసీసీఐ పరువు పోయింది. క్రికెట్ పిచ్ తడిగా ఉన్నందున, పిచ్ పొడిగా మార్చడానికి గ్రౌండ్ సిబ్బంది జుట్టును ఆరబెట్టే హెయిర్ డ్రయ్యర్లను ఉపయోగించిన వైనంపై నెటిజన్లు, ప్రేక్షకులు దుమ్మెత్తి పోశారు. ప్రపంచం లోనే సంపన్న బీసీసీఐ కి ఒక పిచ్ ను ఆరబెట్టడానికి కనీస వసతులు లేవా? హెర్ డ్రయ్యర్ల ను    వాడుతారా అని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.

కేవలం హెయిర్‌ డ్రయ్యర్లు మాత్రమే కాకుండా బట్టలను ఇస్త్రీ చేసే ఇస్త్రీ పెట్టెలను కూడా పిచ్‌లో ఉపయోగించారు. ఈ ఫొటోలు వీడియోలు విపరీతం గా షేర్ చేస్తూ నెటిజన్లు బీసీసీఐ తీరును ఎండగడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. అంతర్జాతీయ మ్యాచ్‌లు షెడ్యూల్ చేసినప్పుడు వర్షాలను ఎదుర్కోవటానికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) ని సోషల్ మీడియాలో నిందిస్తున్నారు.

పిచ్‌లో వాడే హెయిర్‌ డ్రయ్యర్లు , ఇస్త్రీ పెట్టలను పెట్టి ఎండబెట్టిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది నెటిజన్లు ఈ ఫొటోలను చూసిన కామెడీ చేస్తూ బీసీసీఐని ట్రోల్ చేస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు. చిత్రవిచిత్రమైన హ్యాష్ ట్యాగ్ లతో బీసీసీఐని చెడుగుడు ఆడుతున్నారు.

మైదానంలో ఒక్క బాల్ పడకుండా మ్యాచ్ రద్దవ్వడంపై.. తమ అభిమాన క్రికెట్ తారలను చూడలేక పోవడంపై అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సంపన్న క్రికెట్ బోర్డుగా పేరొందిన బిసిసిఐ దేశవ్యాప్తంగా క్రికెట్ మైదానాలకు కనీస వసతులు సౌకర్యాలు కల్పించకపోవడంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఉపద్రవాలు ఎదురైనప్పుడు పరిష్కరించడానికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.


Tags:    
  • Twitter mocks BCCI for using hairdryer to dry pitch in Guwahati 
  • India Vs Srilanka 
  • India 
  • India News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS