• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ట్రంప్ గెల‌వాల‌ని 21...

ట్రంప్ గెల‌వాల‌ని 21 రాష్ర్టాల్లో హ్యాకింగ్ చేసేశార‌ట‌

By - Tupaki Desk
Update: 2017-06-23 05:15 GMT
అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ర‌ష్యా హ్యాకింగ్ చేసిందా? డొనాల్డ్ ట్రంప్ గెలుపుకోసం ర‌ష్యా జోక్యం చేసుకొని ఫ‌లితాలు తారుమారు చేసే క్ర‌మంలో స‌హ‌క‌రించిందా? అంటే అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు ఒబామా ప్రభుత్వంలో హోంశాఖలో పనిచేసిన జే జాన్సన్ . జాన్స‌న్ తాజాగా ఇచ్చిన వాంగ్మూలం కార‌ణంగా అధ్యక్ష ఎన్నిక‌ల్లో ట్రంప్ గెలుపుకోసం ర‌ష్యా కృషి చేసింద‌నే వార్తలు నిజ‌మ‌ని తేలింది. అమెరికా కాంగ్రెస్‌కు ఇచ్చిన వివ‌ర‌ణ‌లో గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 21 రాష్ర్టాల్లో రష్యా హ్యాకింగ్‌ కు పాల్పడిందని చెప్పారు. ఆ సమయంలో అమెరికా హెచ్చరికల నుంచి దృష్టి మళ్లించేందుకు ట్రంప్ లైంగిక విజయాలపై వీడియో ఒకటి బయటకు వచ్చిందని తెలిపారు.

డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ను అప్రతిష్ఠ పాల్జేసేందుకు క్రెమ్లిన్ విస్తృతస్థాయిలో కుట్రలు జరిపిందని జాన్స‌న్ ఆరోపించారు. అధ్య‌క్ష ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఓటర్ల నమోదు డాటా బేస్ హ్యాకింగ్‌కు గురవుతున్నదని తాను పలుమార్లు హెచ్చరించానని జాన్సన్ చెప్పారు. కానీ నాడు ఎవరూ తన హెచ్చరికలను పట్టించుకోలేదన్నారు. అప్పుడే ట్రంప్ తన లైంగిక విజయాలను గూర్చి గొప్పలు చెప్పుకున్న 2005 నాటి వీడియో ఒకటి బయటకు వచ్చిందని, అది తన హెచ్చరికల నుంచి అమెరికన్ల దృష్టి మరల్చిందని జాన్స‌న్ అన్నారు. అదే స‌మ‌యంలో ర‌ష్యా త‌న ప‌ని తాను చేసుకుపోయింద‌ని జాన్సన్ వ్యాఖ్యానించారు.

కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా పాత్రపై ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఊహాగానాలు సాగుతున్నాయి. రష్యా 21 రాష్ర్టాల్లో హ్యాకింగ్‌కు పాల్పడటం నిజమేనని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారి జీనెట్ మన్‌ఫ్రా తొలిసారి బహిరంగంగా ప్రకటించారు. ఇందుకు తగిన సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని సెనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ ముందు వెల్లడించారు. తాజాగా జాన్స‌న్ అదే విష‌యాన్ని వెల్ల‌డించ‌డం క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Trump 
  • Jeh Johnson 
  • Russia probe 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS